Site icon HashtagU Telugu

TDP vs YCP : జ‌గ‌న్ జేబు సంస్థ సీఐడీ : టీడీపీ నేత క‌న్నా ల‌క్ష్మీనారాయ‌ణ‌

TDP vs YCP

Tdp

చంద్రబాబు గారిని జైలుకి పంపాలన్నది జగన్ రెడ్డి నాలుగున్నరేళ్ల క‌ళ అని టీడీపీ నేత క‌న్నా ల‌క్ష్మీనారాయ‌ణ అన్నారు. స్కిల్ డెవలప్ మెంట్ అనేది ప్రధాని మోదీకి ఎంతో ఇష్టమైందని.. అందుకే గుజరాత్ సహా అనేక రాష్ట్రాల్లో ప్రవేశపెట్టారన్నారు. యువతకు ఉద్యోగాలు కల్పించాలనే ఉద్దేశంతో ఈ పథకాన్ని ప్రవేశపెట్టారని.. రాష్ట్రాభివృద్ధిని కాంక్షించే వారు, యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పించాలనే ఉద్దేశం ఉన్నవారంతా స్కిల్ డెవలప్ మెంట్ ను పలు రాష్ట్రాల్లో ప్రవేశపెట్టారని ఆయ‌న తెలిపారు. స్కిల్ డెవలప్ మెంట్ కింద 2 లక్షలమందికి పైగా శిక్షణ ఇచ్చి లక్షమందికి పైగా ఉద్యోగాలు కల్పించిన ఘనత చంద్రబాబుదేన‌న్నారు. ఈ స్కీమ్ ద్వారా ఎంతోమంది లబ్ధి పొందారని జగన్ ప్రభుత్వం ప్రసంశించిందని గుర్తు చేశారు. సిమెన్స్ కేసులో పలువురికి హైకోర్టు బెయిల్ కూడా ఇచ్చిందని.. తాను జైలుకు వెళ్లాడు కాబట్టి చంద్రబాబు సహా అనేకమంది నేతలను జైలుకు పంపాల‌ని జగన్ రెడ్డి నిర్ణయించుకున్నార‌ని ఆరోపించారు. ర‌ఘురామ కృష్ణంరాజుని అరెస్ట్ చేయించి వీడియో కాల్ లో అది చూసి పైశాచిక ఆనందం పొందిన వ్యక్తి జగన్ రెడ్డి అన్నారు. లండన్ నుంచి వచ్చేసరికి సీఎం కళ్లలో ఆనందం చూడాలని ఆత్రుత తప్పా ఆ రిమాండ్ రిపోర్టులో ఏం లేదన్నారు.