టీడీపీ సీనియర్ నేత జేసీ ప్రభాకర్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. జ్యూడిషియరీలో కొద్దిమంది వ్యక్తుల వల్ల ఆ వ్యవస్థలపై నమ్మంకం పోయే పరిస్థితి ఏర్పడిందని ఆయన వ్యాఖ్యానించారు. తాను చేసిన వ్యాఖ్యల వల్ల జ్యుడిషియరీలో కొంతమందికి బాధ కలగొచ్చని.. తప్పుడు కేసులతో చంద్రబాబును అరెస్ట్ చేశారన్నారు. ఈకేసులో బెయిల్ కోసం కాదని.. క్వాష్ పిటిషన్‍పైనే పోరాటం చేయాలని ఆయన తెలిపారు. చంద్రబాబు కోసం ఇప్పుడు చేస్తున్న దీక్షల కంటే ఉద్యమంలో మారాల్సిన అవసరం ఉందన్నారు. మరికొద్ది రోజుల ఇదే పరిస్థితి కొనసాగితే ప్రజల్లో నెలకొన్న ఆందోళన ఉద్యమంగా మారుతుందని జేసీ ప్రభాకర్ రెడ్డి వ్యాఖ్యానించారు. ఉద్యమం ప్రారంభమైన రోజు ప్రజల ఆగ్రహావేశాలను తట్టుకునే శక్తి ప్రభుత్వాలకు ఉండదన్నారు. చంద్రబాబు అరెస్ట్ అప్రజాస్వామికమని.. ఇలాంటి కేసులకు, ఈడీ కేసులకు కూడా తాము భయపడపడమని తెలిపారు. ఇలాంటి అక్రమ కేసులపై పోరాటం చేస్తూనే ఉంటామని.. చంద్రబాబును అక్రమ అరెస్టు చేసిన అధికారులు సర్వనాశం అయిపోతారని వ్యాఖ్యానించారు. నిబంధనలకు విరుద్దంగా వ్యవహరిస్తున్న అధికారులు రాబోయే రోజుల్లో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటారని జేసీ ప్రభాకర్ రెడ్డి హెచ్చరించారు. వీటి అన్నింటిని ప్రజలు గమనిస్తున్నారని అధికారులు గుర్తుపెట్టుకోవాలన్నారు.
JC Prabhakar Reddy : జేసీ ప్రభాకర్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు.. జ్యుడిషియరీలో కొద్దిమంది వ్యక్తుల వల్ల..?

Jc