YSRCP : వైసీపీలోకి మాజీ మంత్రి గొల్ల‌ప‌ల్లి.. మిథున్ రెడ్డి, కేశినేని నానిల‌తో భేటీ

ఎంపి కేశినేని నాని కార్యా లయంలో కీలక నేతల భేటీ జ‌రిగింది. వైసీపీ ముఖ్య‌నేత ఎంపీ మిథున్ రెడ్డి, ఎంపీ కేశినేని శ్రీనివాస్

  • Written By:
  • Publish Date - February 28, 2024 / 08:14 AM IST

ఎంపి కేశినేని నాని కార్యా లయంలో కీలక నేతల భేటీ జ‌రిగింది. వైసీపీ ముఖ్య‌నేత ఎంపీ మిథున్ రెడ్డి, ఎంపీ కేశినేని శ్రీనివాస్ (నాని)తో టీడీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి గొల్ల‌ప‌ల్లి సూర్యారావు భేటీ అయ్యారు. తెలుగుదేశం పార్టీలో జరుగుతున్న సామాజిక అన్యాయం గురించి సూర్యారావు ఆవేద‌న వ్య‌క్తం చేశారు. ముఖ్యమంత్రి జగన్మోహన రెడ్డి విధానాలను ఎన్నికల్లో సామాజిక వర్గాల కూర్పు, సీనియర్ ,జూనియర్ లకు అవకాశాలు భరోసా కల్పిస్తూ మెజారిటీ సామాజికవర్గాలకు న్యాయం చేసినట్లు అది ప్రజల్లో పెద్ద ఎత్తున చర్చకి తావిచ్చిన అంశంగా సూర్యారావు చెప్పుకొచ్చారు టీడీపీకి రాజీనామా చేసి ఈ రోజు ముఖ్యమంత్రి జగన్‌మోహ‌న్ రెడ్డి స‌మ‌క్షంలో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరాలని సూర్యారావు నిర్ణయించుకున్నట్లు తెలిపారు. రాజోలు నుంచి గ‌తంలో సూర్యారావు ప్రాతిన‌ధ్యం వ‌హించారు. ద‌ళిత నేత‌ల్లో కీల‌కంగా ఉన్న సూర్యారావుకు ఈ సారి పొత్తులో భాగంగా టికెట్ నిరాక‌రించ‌డంతో ఆయ‌న పార్టీలో అసంతృప్తిగా ఉన్నారు. దీంతో ఆయ‌న వైసీపీలో చేరేందుకు సిద్ధ‌మైయ్యారు. టీడీపీ ఎంపీ కేశినేని నాని.. సూర్యారావుతో చ‌ర్చ‌లు జ‌రిపారు. చ‌ర్చ‌లు అనంత‌రం ఆయ‌న వైసీపీలో చేరాల‌ని నిర్ణ‌యించుకున్నారు. వైసీపీలో ఆయ‌న‌కు స‌ముచిత‌స్థానం ఇస్తామ‌ని ఎంపీ మిథున్ రెడ్డి, కేశినేని నానిలు తెలిపారు.

Also Read:  CAA Rules : మార్చి నుంచే సీఏఏ అమల్లోకి.. ఎన్నికల కోడ్‌కు ముందే ప్రకటన