Site icon HashtagU Telugu

AP TDP : జ‌గ‌న్ మెప్పుకోసం సీఐడీ, ఇంటిలిజెన్స్ ప‌ని చేస్తున్నాయి – మాజీ ఎమ్మెల్యే ధూళిపాళ్ల న‌రేంద్ర‌

TDP

TDP

రాష్ట్ర సీఐడీ, కౌంటర్ ఇంటిలిజెన్స్ విభాగాలు జగన్ రెడ్డి మెప్పుకోసం, పరిధిదాటి చట్టవిరుద్ధంగా పనిచేస్తున్నాయని మాజీ ఎమ్మెల్యే ధూళిపాళ్ల న‌రేంద్ర ఆరోపించారు. రాజకీయ ప్రత్యర్థుల్ని వెంటాడి..వేధించాలన్న జగన్ ఆలోచనల మేరకే కౌంటర్ ఇంటిలిజెన్స్ డీజీ పీ.ఎస్.ఆర్. ఆంజనేయులు, సీఐడీ డీజీ రఘురామిరెడ్డి పరిధి దాటి పనిచేస్తున్నారన్నారు. కిలారు రాజేశ్ కేవలం సాక్షి మాత్రమేనని మొదట చెప్పి, తర్వాత దోషిగా పేర్కొని లుక్ఔట్ నోటీసు ఇవ్వడం సీఐడీ పనితీరుని ఎత్తిచూపుతోందన్నారు. జగన్ ముఖ్యమంత్రిత్వంలో జరుగుతున్న వ్యవస్థల సర్వనాశనంలో భాగమే కౌంటర్ ఇంటిలిజెన్స్ సిబ్బందిని రాజకీయ కక్షలకు వాడుకోవడమ‌ని ఆయ‌న తెలిపారు. అధికారం తలకెక్కిన అహంకారంతో జగన్ రెడ్డి పోలీసుల్ని ప్రైవేట్ సైన్యంగా మార్చాడని.. ఆ సైన్యం సాయంతోనే చంద్రబాబు, ఇతర టీడీపీ నేతలపై తప్పుడు కేసులుపెట్టి, అన్యాయంగా జైలుకు పంపారని దూళిపాళ్ల ఆరోపించారు. ఇప్పుడు అదే కోవలో జగన్ సర్కార్ టీడీపీనేత కిలారు రాజేశ్ ను టార్గెట్ చేసిందని, హైకోర్టులో చాలా స్పష్టంగా “రాజేశ్ నిందితుడు కాడు..కేవలం సాక్షి మాత్రమే” అని ప్రభుత్వ న్యాయవాది చెప్పినా, ఏపీ సీఐడీ తన వెబ్ సైట్లో రాజేశ్ ని మోస్ట్ వాంటెడ్ పర్సన్ గా పేర్కొని లుక్ ఔట్ నోటీసులు ఇవ్వడాన్ని ఏమనాలని ప్ర‌శ్నించారు.

Also Read:  Diwali 2023 : దీపావ‌ళి రోజున సాయంత్రం 5 గంట‌ల వ‌ర‌కే బాణాసంచా అమ్మ‌కాలు – ఏపీ పోలీసులు

Exit mobile version