Yanamala: పొమ్మనకుండా పొగబెట్టాడు!

ఏపీ సీఎం వైఎస్ జ‌గ‌న్ పై మాజీమంత్రి య‌న‌మ‌ల రామ‌కృష్ణుడు ఫైర్ అయ్యారు.

Published By: HashtagU Telugu Desk
Yanamanala Jagan

Yanamanala Jagan

ఏపీ సీఎం వైఎస్ జ‌గ‌న్ పై మాజీమంత్రి య‌న‌మ‌ల రామ‌కృష్ణుడు ఫైర్ అయ్యారు. ఉద్యోగుల‌ను అవసరం కోసం వాడుకుని, అవసరం తీరాక నిలువునా వంచించి వదిలేయడంలో జగన్ రెడ్డి టాప్ ర్యాంకర్ అని ఆయ‌న అన్నారు. అధికారంలోకి వచ్చినప్పటి నుండి.. తమ అనైతిక చర్యలకు, అక్రమ అరెస్టులకు గౌతం సవాంగ్ ను అడ్డగోలుగా వాడుకుని.. ఇప్పుడు అవమానకర రీతిలో గెంటేశారని ఆరోపించారు. డీజీపీ స్థాయి వ్యక్తికి పోస్టింగ్ కూడా ఇవ్వకుండా ఘోరాతి ఘోరంగా అవమానించారని.. బఅసాధారణ పరిస్థితుల్లో మాత్రమే నిర్వహించే సీఎస్, డీజీపీల బదిలీలను ముఖ్యమంత్రి జగన్ రెడ్డి.. తన రాజకీయ అవసరాలకు అనుగుణంగా పని చేసే మ్యూజికల్ చైర్ గా మార్చేశారన్నారు. గతంలో సీఎస్ గా పని చేసిన ఎల్వీ సుబ్రహ్మణ్యంను అన్నా అని పిలుస్తూనే.. ఎలాంటి ప్రాధాన్యత లేని పోస్టుకు బదిలీ చేసి అవమానించారని… ఇదే విధంగా పీవీ రమేష్, అజేయకల్లాం వంటి వారి పట్ల అవమానకర రీతిలో అధికారాల్లో కోత విధించి పొమ్మనకుండా పొగబెట్టారన్నారు.

న్యాయమూర్తుల మీద విషం కక్కే పనిని అజేయ కల్లంతో చేయించిన జగన్ రెడ్డి….పని అయిపోగానే ఆయనను పక్కన పెట్టారని.. దీంతో సిఎంవో అంతా నాదే అనుకున్న స్థానం నుంచి అసలు సిఎంవోకు వెళ్లడానికీ అనుమతి లేని స్థితికి దిగజార్చారన్నారు. ముఖ్యమంత్రి కార్యాలయంలో అంతా నీవే అన్న ప్రవీణ్ ప్రకాశ్ ను రాష్ట్రం దాటి కనీసం ఎలాంటి ప్రాధాన్యం లేని ఢిల్లీ లోని ఏపీ భవన్ కు తరిమేశారని తెలిపారు. అధికారంలోకి వచ్చిన కొత్తలో అన్నా, తమ్ముడూ మీరే నన్ను నడిపించాలన్న జగన్ రెడ్డి.. ఇప్పుడు అడ్డగోలుగా తరిమేస్తూ ఉద్యోగుల్ని తీవ్రంగా అవమానిస్తున్నారు. ముఖ్యమంత్రి వ్యవహారశైలిని, నైజాన్ని ఉద్యోగులు, పోలీసులు అర్ధం చేసుకోవాలి. తన అవినీతికి, అక్రమాలకు సహకరించని వాళ్లు ఎవరైనా.. తన కాళ్ల కింద పడి బాధితులుగా మారాల్సిందే అనేలా జగన్ రెడ్డి తీరు ఉందన్నారు

దేశంలో ఏ రాష్ట్రంలో కూడా చేయని విధంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఎడాపెడా అప్పులు చేస్తోందని య‌న‌మ‌ల రామ‌కృష్ణుడు మ‌డిప‌డ్డారు. మరోవైపు.. ఆస్తులు తాకట్టు పెట్టి, భూములు అమ్మకానికి పెట్టి భారీగా ఆదా

  Last Updated: 16 Feb 2022, 12:11 PM IST