Chandrababu : తుపాను సహాయక చర్యలపై ప్రభుత్వం దృష్టిపెట్టాలన్న టీడీపీ అధినేత చంద్ర‌బాబు

రాష్ట్రంపై మిచౌంగ్ తుపాను ప్రభావం తీవ్రంగా ఉంటుందనే సమాచారం ఆందోళన కలిగిస్తోందని టీడీపీ అధినేత చంద్ర‌బాబు

Published By: HashtagU Telugu Desk
Chandrababu

Chandrababu

రాష్ట్రంపై మిచౌంగ్ తుపాను ప్రభావం తీవ్రంగా ఉంటుందనే సమాచారం ఆందోళన కలిగిస్తోందని టీడీపీ అధినేత చంద్ర‌బాబు అన్నారు. ప్రభుత్వం వెంటనే సహాయక చర్యలు చేపట్టాలని సూచించారు. తుపాను కారణంగా రైతులు తీవ్రంగా నష్టపోయే అవకాశం ఉందని.. ఈ నేపథ్యంలో పక్కా ప్రణాళిక ద్వారా అన్నదాతలకు నష్టం జరగకుండా చూడాలని చంద్రబాబు ప్రభుత్వాన్ని కోరారు. గతంలో అకాల వర్షాల కారణంగా ధాన్యం రైతులు తీవ్రంగా నష్టపోయినా.. ప్రభుత్వం తగు రీతిలో స్పందించ లేదని అన్నారు. ధాన్యం కోనుగోలులో రకరకాల ఆంక్షలతో ఇప్పటికే రైతులు ఇబ్బంది పడుతున్నారని.. సమస్య వెంటనే పరిష్కరించాలని డిమాండ్ చేశారు. పంట చేతికి వచ్చే సమయంలో తుపాను అన్నదాతలను తీవ్ర ఆందోళనకు గురిచేస్తోందని.. ధాన్యం కొనుగోలులో ఆంక్షలు తొలగించాలని అన్నారు. తుపాను బాధిత ప్రజల కోసం షెల్టర్లు, అవసరమైన ఆహారం అందించేందుకు తక్షణమే చర్యలు తీసుకోవాలని చంద్రబాబు కోరారు. ఇటు తెలుగు దేశం పార్టీ కార్యకర్తలు, నేతలు తుపాను బాధితులకు అండగా నిలవాలని చంద్రబాబు నాయుడు పిలుపు నిచ్చారు. పలు జిల్లాలపై తుఫాను ప్రభావం తీవ్రంగా ఉండే అవకాశం ఉందని.. బాధిత వర్గాలకు అండగా ఉండాలని, చేతనైన సాయం చేయాలని చంద్రబాబు నాయుడు పార్టీ నేతలు, కార్యకర్తలను కోరారు.

Also Read:  TDP : ద్వారంపూడి దోచుకున్నదంతా నయా పైసాతో సహా కక్కిస్తాం : మాజీ మంత్రి కే.ఎస్ జవహార్

  Last Updated: 04 Dec 2023, 11:09 PM IST