Telugodu : చంద్రబాబు బయోపిక్.. ఇది ఎప్పుడు చేసారు.. స్కిల్ డెవలప్మెంట్ అరెస్ట్‌తో..

ఏపీ ఎన్నికల ప్రచారాలకు డిజిటల్ మీడియాని ఏపీ పొలిటిషన్స్ బాగా ఉపయోగించుకుంటున్నారు. ఈక్రమంలోనే కమర్షియల్ యాడ్స్ తో పాటు బయోపిక్స్..

Published By: HashtagU Telugu Desk
Tdp Leader Chandrababu Naidu Biopic Telugodu Full Movie

Tdp Leader Chandrababu Naidu Biopic Telugodu Full Movie

Telugodu : మరో నాలుగు రోజుల్లో దేశమంతటా ఎన్నికలు జరగబోతున్నాయి. అయితే ఈ ఎన్నికల్లో అత్యంత ఆసక్తిగా మారిన రాజకీయాలు అంటే.. అవి ఆంధ్రప్రదేశ్ ఎన్నికలే. వైసీపీ, టీడీపీ, జనసేన, బీజేపీతో ఏపీ ఎన్నికల్లో ఓ రేంజ్ హీట్ కనిపిస్తుంది. ఒకరి పై ఒకరు విమర్శలు, పార్టీ ప్రచారాలతో ఏపీ రాజకీయాలు దేశమంతటా వినిపిస్తున్నాయి. ఇక ఈ ప్రచారాలకు డిజిటల్ మీడియాని ఏపీ పొలిటిషన్స్ బాగా ఉపయోగించుకుంటున్నారు.

ఈక్రమంలోనే కమర్షియల్ యాడ్స్ తో పాటు కొన్ని సినిమాలను కూడా తెరకెక్కించి జనాలు ముందుకు తీసుకు వస్తున్నారు. అలా ప్రేక్షకుల ముందుకు వచ్చిన సినిమాలే వ్యూహం, శపథం, యాత్ర 2, వివేకం (వైఎస్ వివేకానందా బయోపిక్), తాజాగా తెలుగోడు. ఈ తెలుగోడు సినిమా చంద్రబాబు బయోపిక్ గా తెరకెక్కింది. ఈ ఎన్నికలకు ముందు చంద్రబాబుని స్కిల్ డెవలప్మెంట్ కేసుతో అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. ఆ అరెస్ట్ తోనే ఈ బయోపిక్ కథని స్టార్ట్ చేసారు.

పథకాలు, సంక్షేమాలతో పాటు ఐటీ రంగాన్ని డెవలప్ చేసి, ఎన్నో వేల ఉద్యోగలు ఇచ్చి రాష్ట్ర ఎకానమీని పెంచడంలో చంద్రబాబు చేసిన విషయాలను, ఆయన విజనరీని చూపిస్తూ తెలుగోడు సినిమాని తెరకెక్కించారు. కాగా ఈ సినిమాని డైరెక్ట్ యూట్యూబ్ లో రిలీజ్ చేసారు. గంట పదిహేను నిముషాలు ఉన్న ఈ సినిమా యూట్యూబ్ లో అందుబాటులో ఉంది చూసేయండి.

  Last Updated: 09 May 2024, 11:19 AM IST