Budda Venkanna : ఇంద్ర‌కీలాద్రిపై మాజీమంత్రి వెల్లంప‌ల్లి అర‌చ‌కాలు అడ్డుక‌ట్ట వేయాలి – టీడీపీ నేత బుద్దా వెంక‌న్న‌

ఇంద్ర‌కీలాద్రిపై క‌న‌క‌దుర్గ‌మ్మ శ‌ర‌న్న‌వ‌రాత్రి ఉత్స‌వాల సందర్భంగా మాజీ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాసరావు వల్ల అమ్మవారి

  • Written By:
  • Publish Date - October 27, 2023 / 01:31 PM IST

ఇంద్ర‌కీలాద్రిపై క‌న‌క‌దుర్గ‌మ్మ శ‌ర‌న్న‌వ‌రాత్రి ఉత్స‌వాల సందర్భంగా మాజీ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాసరావు వల్ల అమ్మవారి ఆదాయానికి గండి పడిందని టీడీపీ నేత బుద్దా వెంక‌న్న ఆరోపించారు. ప్రతి రోజూ వెల్లంపల్లి ఇంటి వద్ద కార్ లు పెట్టుకుని రూ.100 టికెట్ లు కొని రూ. 500 లైన్ లో దర్శనాలు చేయించారని ఆయ‌న ఆరోపించారు. అయితే మిగిలిన రూ.400 రూపాయ‌లు ఎవ‌రి జేబులోకి వెళ్లాయ‌ని ఆయ‌న ప్ర‌శ్నించారు. మాజీ మంత్రి వెల్లంపల్లి అవినీతిని అరికట్టేందుకు గుడి పైన 9 రోజులు సాక్షాత్తు దేవాదాయ‌శాఖ మంత్రి కొట్టు స‌త్య‌నార‌యాణ కాపలా కాస్తూ ఉన్నార‌ని.. ఇది దుర్గ‌గుడి చరిత్రలో ఎప్పుడూ జ‌ర‌గ‌లేద‌న్నారు. తెప్పోత్సవం కార్యక్రమంలో కూడా అమ్మవారి హంస వాహనంపై రాజకీయ నాయకులు ఉండటం ఎప్పుడూ లేదన్నారు. గుడి పైన ప్రతీ కాంట్రాక్ట్ లో మామూళ్లు వెల్లంపల్లి శ్రీనివాసరావుకి వెళ్లాయ‌ని బుద్దా వెంక‌న్న ఆరోపించారు. వెల్లంపల్లి అరాచకాలు అరికట్టాలని.. వెల్లంప‌ల్లి అర‌చ‌కాలు సీఎం ఆరికట్టక పోతే ప్రజలలోకి తీసుకు వెళ్లి పోరాటం చేస్తామ‌న్నారు. గుడి పైకి వెళ్లి ఈఓ కార్యాలయం ముందు ధర్నా చేస్తామని బుద్దా వెంక‌న్న ప్ర‌భుత్వాన్ని హెచ్చ‌రించారు.

We’re now on WhatsApp. Click to Join.

మూడు సింహాలు ఏమయ్యి పోయాయో ఇంత‌వ‌ర‌కు దుర్గ‌గుడి అధికారులు, పోలీసులు తేల్చ‌లేక‌పోయార‌ని అన్నారు. భువనేశ్వరి ఓదార్పు యాత్ర పై వైసీపీ కుక్కలు మొరుగుతున్నాయని.. మంత్రి అంబటి రాంబాబు వ్యక్తి గతంగా కూడా విమర్శిస్తున్నార‌న్నారు. భువనేశ్వరి గారు 40 రోజులుగా రాజమండ్రి లో వుంటే, ప్రపంచం లో వున్న తెలుగు వారు ఆమెను పరామర్శించడానికి రాజమండ్రి కి క్యూ క‌ట్టార‌ని.. ఇది చూసి ఓర్వలేక వైసీపీ కుక్కలు విమర్శలు చేస్తున్నారన్నారు. జగన్16 నెలలు జైలు లో ఉన్నప్పుడు తల్లీ, చెల్లి పాదయాత్ర చేయలేదా? అని ప్ర‌శ్నించారు. పాద‌యాత్ర చేసిన త‌ల్లి, చెల్లికి చిన్న పదవి కూడా ఇవ్వకుండా పక్కన పెట్టారన్నారు.

Also Read:  Chandrababu Letter : ‘నన్ను అంతమొందించే కుట్ర జరుగుతోంది’ – ఏసీబీ జడ్జికి చంద్రబాబు లేఖ