AP TDP: చంద్రబాబుకు నోటీసుల‌పై ట్విట్ట‌ర్ వార్

అత్యాచారం సంఘ‌ట‌న‌పై టీడీపీ లీడ‌ర్లు వ్య‌వ‌హ‌రించిన తీరు ఏపీ మ‌హిళా క‌మిష‌న్ ఆగ్ర‌హం క‌లిగించింది.

  • Written By:
  • Updated On - April 23, 2022 / 04:08 PM IST

విజ‌య‌వాడ ప్ర‌భుత్వ ఆస్ప‌త్రిలో జరిగిన అత్యాచారం సంఘ‌ట‌న‌పై టీడీపీ లీడ‌ర్లు వ్య‌వ‌హ‌రించిన తీరు ఏపీ మ‌హిళా క‌మిష‌న్ ఆగ్ర‌హం క‌లిగించింది. అగౌర‌వంగా ప్ర‌వ‌ర్తించార‌నే కార‌ణాల‌ను చూపుతూ చంద్ర‌బాబు, మాజీ ఎమ్మెల్యే బొండా ఉమ‌కు క‌మిష‌న్ నోటీసులు జారీ చేసింది. ఈనెల 27వ తేదీన క‌మిష‌న్ ఎదుట హాజ‌రు కావాల‌ని ఆదేశించింది. ఆ నోటీసులను చూసిన టీడీపీ మ‌హిళా విభాగం అధ్య‌క్షురాలు అనిత ఫైర్ అయ్యారు. ట్వీట్ట‌ర్ వేదిక‌గా ప్ర‌భుత్వ వైఖ‌రిని ఎండ‌గ‌డుతూ స్పందించారు. విజయవాడ ప్రభుత్వ ఆస్పత్రిలో కమిషన్ ఛైర్ పర్సన్ వాసిరెడ్డి పద్మతో అగౌరవంగా ప్రవర్తించారనే ఆరోపణలు బాబు, బొండాపై వచ్చాయి.

ఆ మేర‌కు నోటీసులు జారీ చేశారు. అత్యాచారానికి గురైన బాధితురాలు పాత గవర్నమెంట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఆమెను పరామర్శించేందుకు టీడీపీ అధినేత చంద్రబాబు, మాజీ ఎమ్మెల్యే బొండా ఉమామహేశ్వరరావులు వెళ్లారు. బాధితురాలి కుటుంబానికి రూ.5 లక్షల ఆర్థిక సహాయం చంద్ర‌బాబు ప్రకటించారు. ఆ టైంలో బాధితురాలిని పరామర్శించేందుకు మహిళా కమిషన్ వాసిరెడ్డి పద్మ రావడంతో మహిళలు అడ్డుకుని గో బ్యాక్ అంటూ నినాదాలు చేశారు. ఆ తర్వాత చంద్రబాబు వాసిరెడ్డి పద్మ మధ్య వాగ్వాదం జరిగింది. ఆ తర్వాత పోలీసులు వాసిరెడ్డి పద్మను బాధితురాలి దగ్గరకు తీసుకెళ్లారు.

బొండా ఉమా, టీడీపీ నేతలు ఆసుపత్రి ప్రధాన ద్వారం వద్ద బైఠాయించి నిరసన చేపట్టారు. చంద్రబాబు బాధితురాలిని పరామర్శించడానికి వస్తే ఇప్పటికిప్పుడు మహిళ కమిషన్ ఛైర్ పర్సన్ వాసిరెడ్డి పద్మ వచ్చి హడావిడి చేశారని ఉమా మండిపడ్డారు. ఘటన జరిగి నాలుగు రోజులైతే మహిళ కమిషన్ ఛైర్ పర్సన్‌కు ఇప్పటి వరకు కనపడలేదా అంటూ నిర‌సించారు. ఇదిలా ఉంటే టీడీపీ నేతల తీరుపై వాసిరెడ్డి పద్మ ఆగ్రహం వ్యక్తం చేశారు. బాధితురాలిని పరామర్శించేందుకు వెళితే టీడీపీ దౌర్జన్యానికి పాల్పడిందని దిగిందని మండిపడ్డారు. టీడీపీ చిల్లర రాజకీయాలు చేస్తోందని, మహిళా కమిషన్‌ ఛైర్ పర్సన్‌ను బెదిరించే స్థాయికి చంద్రబాబు దిగజారనని విమర్శించారు. సీన్ క‌ట్ చేస్తే, శ‌నివారం క‌మిష‌న్ నోటీసులు జారీ చేయ‌డం టీడీపీకి ఆగ్ర‌హం వ్య‌క్తం చేస్తూ ట్వీట్ట‌ర్ వేదిక‌గా రియాక్ట్ అయింది.