Site icon HashtagU Telugu

TDP : అధికారంలోకి వ‌చ్చాక జ‌గ‌న్‌రెడ్డి బొక్కిందంతా ఉగ్గుపాల‌తో స‌హా క‌క్కిస్తాం – టీడీపీ నేత ఆనంద్‌సూర్య‌

TDP

TDP

చంద్రబాబు ముఖ్యమంత్రి అయిన వెంటనే జగన్ రెడ్డి బొక్కిందంతా ఉగ్గుపాలతో సహా కక్కించి, అవినీతిపరుడిని కటకటాల్లోకి పంపుతార‌ని టీడీపీ నేత ఆనంద్‌సూర్య తెలిపారు. రాష్ట్రాభివృద్ధి.. ప్రజాశ్రేయస్సు కోసం పాటుపడే నాయకుడిని అన్యాయంగా జైలుకు పంపిన జగన్ రెడ్డి.. భవిష్యత్ లో భారీమూల్యమే చెల్లించుకుంటార‌న్నారు. చంద్రబాబు తప్పు చేయలేదనడానికి.. ప్రజలు చేస్తున్న నిరసనలు, దీక్షలు,ధర్నాలే నిదర్శనమ‌న్నారు. చంద్రబాబు అవినీతి చేశాడని వైసీపీ నేతలు, మంత్రులతో పాటు, ఆ పార్టీ పేటీఎమ్ బ్యాచ్ పిచ్చికుక్కల్లా వాగుతున్నారని, నోటికొచ్చినట్టు..చేతికి నచ్చినట్టు విషప్రచారం చేసేముందు టీడీపీ అధినేత తప్ప చేశాడని చెప్పగల ఆధారాలు, సాక్ష్యాలు ఏం ఉన్నాయోచెప్పాల‌న్నారు. ఒక్క ఛాన్స్ అని ప్రజల్ని నమ్మించి అధికారంలోకి వచ్చిన జగన్ రెడ్డి నాలుగున్నరేళ్ల లో సంక్షేమం పేరుతో రాష్ట్రాన్ని సాంతం దోచేశార‌ని ఆరోపించారు. గతంలో తండ్రి అధికారంతో లక్ష కోట్లు కొట్టేసి, ఈడీ ద్వారా రూ.43వేలకోట్లు జప్తు కాబడి, 16నెలలు జైల్లో ఉండివచ్చిన జగన్ .. తనకు పట్టిన గతే చంద్రబాబుకి పట్టించాలనే దుగ్ధతోనే అకారణంగా ప్రజలు మెచ్చిన నాయకుడిని జైలుపాలు చేశార‌ని మండిప‌డ్డారు.

పోలీసులను అడ్డంపెట్టుకొని ప్రజాగ్రహాన్ని అణచివేయడానికి కుటిలయత్నాలు జ‌గ‌న్ చేస్తున్నార‌ని.. స్కిల్ డెవలప్ మెంట్ కార్పొరేషన్ ద్వారా 2.13 లక్షల మంది యువత నైపుణ్యాభివృద్ధి శిక్షణ పొందితే, వారిలో 75వేల మంది ఉద్యోగాలు పొందారని ఆనంద్ సూర్య తెలిపారు. అలాంటి గొప్ప ప్రాజెక్ట్ ను నీరుగార్చి, తన దురహంకారంతో జగన్ రెడ్డి యువత జీవితాలను అంధకారం చేశార‌ని ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. ప్రతిపక్షనేతపై పెట్టింది అక్రమకేసు కాబట్టే ఈ ప్రభుత్వం, సీఐడీ అధికారుల్ని విచారించడం లేదన్నారు. స్కిల్ డెవలప్ మెంట్ కార్పొరేషన్ ఏర్పాటు.. దాని అమలు.. నిధుల విడుదలలో కీలక పాత్ర పోషించిన అధికారులైన అజయ్ కల్లం రెడ్డి..ప్రేమచంద్రారెడ్డిలపై చర్యలు తీసుకోకుండా.. కేబినెట్ అప్రూవల్ తో రాష్ట్రవ్యాప్తంగా సమర్థవంతంగా అమలైన ప్రాజెక్ట్ లో అవినీతి జరిగిందని ఎలా చెప్తార‌ని ప్ర‌శ్నించారు.