TDP Krishna : బోండా, దేవినేని, వ‌ర్ల‌కు డౌట్‌ ? కృష్ణాలో బాబు గెలుపు గుర్రాలివే!

ఉమ్మ‌డి కృష్ణా రాజ‌కీయం వినూత్నం, విభిన్నం. అక్క‌డ రాజకీయాల‌ను నెర‌ప‌డం క‌త్తిమీద సాము.

  • Written By:
  • Updated On - January 13, 2023 / 03:00 PM IST

ఏపీ రాజకీయాల్లో ఉమ్మ‌డి కృష్ణా రాజ‌కీయం(TDP Kirshna) వినూత్నం, విభిన్నం. అక్క‌డ రాజకీయాల‌ను నెర‌ప‌డం క‌త్తిమీద సాము. సామాజిక‌, ఆర్థిక‌, ప్రాంతీయ‌, మ‌త స‌మ్మేళ‌నంతో కూడిన పాలిట్రిక్స్ (Politics)కు పెట్టింది పేరు. ఆ జిల్లా రాజ‌కీయాన్ని కంట్రోల్ లోకి తీసుకోవ‌డానికి 40ఏళ్ల పైబ‌డిన అనుభ‌వం ఉన్న చంద్ర‌బాబునాయుడు కూడా ముప్పుతిప్ప‌లు ప‌డుతున్నారు. అక్క‌డ అంద‌రూ లీడ‌ర్లే, అంద‌రూ ఓట‌ర్లే. చైత‌న్యం ఎక్కువ‌గా ఉన్న జిల్లా. అందుకే, ఏ పార్టీకైనా ఆ జిల్లాలోని అంత‌ర్గ‌త కుమ్ములాట‌ల‌ను శాశ్వ‌తంగా నిర్మూలించ‌లేరు. కానీ, ఈసారి చంద్ర‌బాబునాయుడు సైలెంట్ గా అంతా సెట్ చేస్తున్నారు. ఇప్ప‌టికే ఏ నియోజ‌క‌వ‌ర్గానికి ఎవ‌రు అభ్య‌ర్థి అనే విష‌యంపై నిర్థార‌ణ‌కు వ‌చ్చేదానికి అవ‌స‌ర‌మైన స‌ర్వేల‌ను చేసుకున్నార‌ట‌.

ఉమ్మ‌డి కృష్ణా రాజ‌కీయం (TDP Kirshna)

రాష్ట్ర పార్టీ కార్యాల‌యం(Politics) నుంచి అందుతోన్న విశ్వ‌సనీయ స‌మాచారం ప్ర‌కారం విజయవాడ పశ్చిమానికి శ్రీరామ్ తాతయ్య పేరు బ‌లంగా వినిపిస్తోంది. ఇటీవ‌ల చేసిన స‌ర్వేల్లోనూ ఆయ‌నకు పాజిటివ్ గా ఉంద‌ని తేలింద‌ట‌. అలాగే, విజ‌య‌వాడ ఎంపీ అభ్య‌ర్థిగా కేశినేని చిన్ని పేరు వినిపిస్తోంది. ప్ర‌స్తుతం ఎంపీగా ఉన్న కేశినేని నానికి ఆయ‌న స్వ‌యాన సోద‌రుడు. ఇటీవ‌ల నియోజ‌క‌వ‌ర్గంలో చాలా యాక్టివ్ గా ఉంటున్నారు. పైగా నాని త‌ర‌చూ చంద్ర‌బాబు, టీడీపీ అధిష్టానం మీద ప‌రోక్షంగా వివాద‌స్ప‌ద వ్యాఖ్య‌లు చేసిన సంద‌ర్భాన్ని చూశాం. ఇలాంటి పరిస్థితుల్లో చిన్ని బ‌ల‌మైన అభ్య‌ర్థిగా భావిస్తూ విజ‌య‌వాడ ఎంపీ బ‌రిలోకి దింపాల‌ని టీడీపీ(TDP Krishna) యోచిస్తోంది.

Also Read : Dark politics : ముక్కోణ‌పు ల‌వ్ గేమ్‌! చ‌తుర్ముఖ చ‌ద‌రంగం!

తెలుగుదేశం పార్టీ ప్ర‌తిష్టాత్మ‌కంగా భావిస్తోన్న బంద‌రు లోక్ స‌భ స్థానం నుంచి వంగ‌వీటి రాధాను దింపాల‌ని భావిస్తోంది. ఆ మేర‌కు స‌ర్వేలు సానుకూలంగా ఉన్నాయ‌ని తెలుస్తోంది. వాస్త‌వంగా ఆయ‌న అసెంబ్లీకి పోటీ చేయాల‌ని అభిమానుల ఉవాచ‌. కానీ, ఇప్పుడున్న రాజ‌కీయ స‌మీక‌ర‌ణాల దృష్ట్యా మ‌చిలీప‌ట్నం లోక్ స‌భ స్థానం నుంచి పోటీ చేయించాల‌ని నిర్ణ‌యించింద‌ట‌. అయితే, ఆయ‌న విజ‌య‌వాడ సెంట్ర‌ల్ నుంచి పోటీ చేయాల‌ని చాలా కాలంగా భావిస్తున్నారు. గ‌త ఎన్నిక‌ల్లోనూ అదే సీటు ను ఆయ‌న కోరుకున్నారు. వైసీపీలో ఉండ‌గా ఆ సీటు కోసం ప్ర‌య‌త్నం చేసి విఫ‌లం అయ్యారు. ఆనాడు మచిలీప‌ట్నం లోక్ స‌భ స్థానం నుంచి పోటీకి వైసీపీ కూడా అవ‌కాశం ఇచ్చింది. కానీ, రాధా దాన్ని త్రోసిబుచ్చుతూ టీడీపీ వైపు మ‌ళ్లారు. తాజాగా మారిన ప‌రిణామాల దృష్ట్యా వ‌సంత నాగేశ్వ‌ర‌రావు కుటుంబం నుంచి జ‌గ్గ‌య్య‌పేట అసెంబ్లీ స్థానం నుంచి బ‌రిలోకి దిగుతార‌ని తెలుస్తోంది. రాష్ట్ర వ్యాప్తంగా వైసీపీ రెబ‌ల్స్ ఎమ్మెల్యేల జాబితాలో ప్ర‌స్తుతం వ‌సంత కృష్ణ‌ప్ర‌సాద్ చేరారు. మాజీ హోం మంత్రి వసంత నాగేశ్వ‌ర‌రావు కూడా క‌మ్మ సామాజిక‌వ‌ర్గానికి జ‌రుగుతోన్న అన్యాయం మీద ఇటీవ‌ల ప్ర‌స్తావించారు. దానిపై కృష్ణ‌ప్ర‌సాద్ క్లారిటీ ఇచ్చే ప్ర‌య‌త్నం చేసిన‌ప్ప‌టికీ వైసీపీలో ఆయ‌న‌కు వ్య‌తిరేకంగా కొంద‌రు ప‌నిచేస్తున్నార‌ని తెలుస్తోంది. దీంతో రాబోవు రోజుల్లో రాజ‌కీయ స‌మీక‌ర‌ణాలు మారే ఛాన్స్ ఉంది. అందుకే, వ‌సంత కుటుంబం నుంచి టీడీపీ అభ్య‌ర్థిగా జ‌గ్గ‌య్య‌పేట నుంచి బ‌రిలోకి దిగ‌డానికి అవ‌కాశం ఉంది.

మైలవరం నుంచి కేశినేని శ్వేత (Politics)

అదే జిల్లాకు చెందిన మైలవరం నియోజ‌క‌వ‌ర్గం నుంచి కేశినేని శ్వేత(Politics) పోటీ చేయ‌బోతున్నార‌ని తెలుస్తోంది. ఆ మేర‌కు స‌ర్వేలు సానుకూలంగా ఉన్నాయ‌ని వినికిడి. విజ‌య‌వాడ ఎంపీగా పోటీ చేయ‌డానికి విముఖ‌త చూపుతోన్న కేశినేని నాని కుమార్తె శ్వేత‌. విజ‌య‌వాడ కార్పొరేష‌న్ ఎన్నిక‌ల్లో కీల‌కంగా ప‌నిచేశారు. ఆ రోజు నుంచి ప్ర‌జ‌ల్లో ఆమెకు క్రేజ్ ఉంది. అందుకే, యువ‌త కోటా నుంచి శ్వేత‌ను రంగంలోకి దింప‌డానికి టీడీపీ అధిష్టానం సిద్ధ‌మ‌వుతుంద‌ని వినికిడి.ఇలా కృష్ణా జిల్లా అంత‌టా రానున్న ఎన్నికల్లో ఏపిలో పూర్తి స్థాయిలో విజయం సాధించే దిశగా తెలుగుదేశం పార్టీ అడుగులు వేస్తోంది.కుల సమీకరణాలు, ఆర్థికంగా బలంగా ఉన్న నేతలపై పార్టీ అధినేత చంద్రబాబు దృష్టి సారించారు. పార్టీలో అసమ్మతి తీవ్రంగా ఉన్న చోట అభ్యర్థులను మార్చేయనున్నారు. విజయవాడ పశ్చిమానికి శ్రీరామ్ తాతయ్య అభ్యర్థిత్వాన్ని ఖరారు చేయనున్నట్లు తెలుస్తోంది. జగ్గయ్యపేట నియోజకవర్గంలో అసమ్మతి కారణంగా తాతయ్యను పశ్చిమానికి ఖరారు చేసే అవకాశం ఉంది. పశ్చిమంలో ముప్పై వేల మంది వైశ్య సామాజిక వర్గం ఉన్నందున ఆ దిశగా అధినేత అడుగులు వేస్తున్నార‌ట‌. అలాగే జగ్గయ్యపేటలో అరవై వేల మంది కమ్మ సామాజిక వర్గం ఉన్నందున అక్కడ నుంచి వసంత కృష్ణ ప్రసాద్ ను బరిలోకి దింపాలని ప్రయత్నాలు జరుగుతున్నాయ‌ని ప్ర‌చారం జ‌రుగుతోంది.

విజయవాడ ఎంపీ అభ్యర్థి గా కేశినేని శివనాథ్ (Politics)

విజయవాడ ఎంపీ అభ్యర్థి గా కేశినేని శివనాథ్ అలియాస్ నాని పేరు దాదాపుగా ఖరారు కావడంతో ఆయన పలు సేవా కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు. బందర్ పార్లమెంట్ కు వంగవీటి రాధా పేరు దాదాపుగా ఖాయ మైందని తెలుస్తోంది. నూజివీడు కి పర్వతనేని గంగాధర చౌదరి పేరు పరిశీలనలో ఉంది. మైలవరానికి కేశినేని శ్వేత పేరుని పరిశీలిస్తున్నారు. ఇక గన్నవరంలో యాదవ సామాజిక వర్గానికి గాను పార్థసారథి పేరు పరిశీలనలో ఉంది. తిరువూరు కి చావల దేవదత్తు పేరును పరిశీలిస్తున్నారు. గుడివాడ కు వెనిగండ్ల రాము, పెడనకు కొనకళ్ళ నారాయణ, బందర్ అసెంబ్లీ కి కొల్లు రవీంద్ర పేర్లు దాదాపుగా ఫైన‌ల్ అయ్యాయ‌ని కేంద్ర పార్టీ కార్యాల‌యంలోని టాక్‌.

 Also Read : TDP : మాజీ మంత్రి దేవినేనికి టీడీపీ ఎంపీ కేశినేని చుర‌క‌లు.. నేనే తోపు అనుకుంటే కృష్ణాన‌దే..!

పొత్తులలో భాగంగా ఆవనిగడ్డను ప్రస్తుతానికి ప‌క్క‌న పెట్టారు. అక్క‌డ నుంచి జనసేన అభ్యర్థి ఉంటార‌ని తెలుస్తోంది. విజయవాడ తూర్పు నియోజక వర్గం కావాలని నాదెండ్ల మనోహర్ పట్టుబడితే, ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ ను పెనమలూరు పంపించే అవకాశం ఉంది. ఇలా రాబోవు ఎన్నిక‌ల్లో ప్ర‌త్య‌ర్థుల‌కు ఏ మాత్రం అవ‌కాశం ఇవ్వ‌కుండా ప‌గ‌డ్బందీగా వ్యూహాలు రచిస్తూ సర్వే నివేదికల ఆధారంగా గెలుపు గుర్రాలను ఎంపిక చేసే ప‌నిలో ఉన్నార‌ని తెలుస్తోంది. మాజీ మంత్రి దేవినేని ఉమ‌, మాజీ ఎమ్మెల్యే బోండా ఉమా, మాజీ ఎమ్మెల్సీ బుద్ధా వెంక‌న్న త‌దిత‌రుల‌కు ప్రాధాన్యం ఇచ్చేలా కనిపించ‌డంలేదు. పైగా స‌ర్వేల్లోనూ వాళ్లకు పెద్ద‌గా సానుకూల‌త లేద‌ని స‌మాచారం.

ఇక ఎస్సీ నియోజ‌క‌వ‌ర్గం నుంచి వ‌ర్ల రామ‌య్య లేదా ఆయ‌న కుటుంబంలోని వాళ్ల‌కు అభ్య‌ర్థిత్వాన్ని ఇవ్వ‌డానికి టీడీపీ సిద్ధమ‌యింది. అయితే, పామ‌ర్రు నియోజ‌క‌వ‌ర్గంలో వ‌ర్ల కు ప్ర‌తికూల పరిస్థితులు ఉన్నాయ‌ని స‌ర్వేల సారాంశంగా టీడీపీ అంచ‌నా వేస్తోంది. ఇలాంటి ప‌రిస్థితి, దేవినేని, బోండా విష‌యంలోనూ ఉంద‌ట‌. వాళ్ల‌ను కాద‌ని చంద్ర‌బాబు ఇత‌రుల‌కు ఈసారి టిక్కెట్ల కేటాయిస్తార‌ని తెలుస్తోంది. అంత‌టి సాహ‌సం ఆయ‌న చేస్తారా? అనేది చూడాలి.

Also Read : RGV: చంద్రబాబుకు వ్యతిరేకంగా `వర్మ` సినిమాలు – స్క్రీన్ ప్లే, డైరెక్షన్ జగన్..!