TDP Jumping Leaders : అమ‌రావ‌తి నేత‌ల పోటు!?

గుంటూరు, కృష్ణా జిల్లా గ్రూప్ రాజ‌కీయాల‌తో (TDP Jumping Leaders) చంద్ర‌బాబు విసిగిపోతున్నారు. కొంద‌రు వెన్నుపోటు పొడిచేందుకు సిద్ద‌మ‌య్యారు.

  • Written By:
  • Updated On - July 15, 2023 / 09:34 AM IST

గుంటూరు, కృష్ణా జిల్లా గ్రూప్ రాజ‌కీయాల‌తో  (TDP Jumping Leaders) చంద్ర‌బాబు సైతం  విసిగిపోతున్నారు. ద‌గా ప‌డ్డ రాష్ట్రం కోసం చంద్ర‌బాబు త‌ప‌న ప‌డుతున్నారు. ఆ పార్టీలోని గుంటూరు, కృష్ణా జిల్లా లీడ‌ర్లు కొంద‌రు  వెన్నుపోటు పొడిచేందుకు సిద్ద‌మ‌య్యారు. ఆ జాబితాలో విజ‌య‌వాడ ఎంపీ కేశినేని నాని, మాజీ మంత్రి ప్ర‌త్తిపాటి పుల్లారావు, రాయపాటి సాంబశివరావు పేర్లు ప్ర‌ముఖంగా వినిపిస్తున్నాయి. పార్టీని వీడేందుకు సిద్ద‌ప‌డుతున్నార‌ని స‌ర్వ‌త్రా వినిపిస్తోంది.

గుంటూరు, కృష్ణా జిల్లా గ్రూప్ రాజ‌కీయాల‌తో చంద్ర‌బాబు విసిగిపోతున్నారు (TDP Jumping Leaders)

మాజీ ఎంపీ రాయ‌పాటి సాంబశివరావు సుదీర్ఘ‌కాలం కాంగ్రెస్ పార్టీలో ప‌నిచేశారు. అదే స‌మ‌యంలో మాజీ మంత్రి క‌న్నా ల‌క్ష్మీనారాయ‌ణ కూడా కాంగ్రెస్ పార్టీలో ఉన్నారు. వాళ్లిద్ద‌రి మ‌ధ్యా గ్రూప్ రాజ‌కీయాలు. (TDP Jumping Leader) ఉండేవి. గుంటూరు కేంద్ర రాజ‌కీయాల్లో క‌న్నా పెద్ద జోక్యం చేసుకోకుండా కాంగ్రెస్ ల‌క్ష్మ‌ణ‌గీత గీసింది. అప్ప‌ట్లో గుంటూరు ఎంపీగా జిల్లా రాజ‌కీయాల‌కు కేంద్ర‌బిందువుగా రాయ‌పాటి బ్ర‌ద‌ర్స్ ఉండే వారు. ఉమ్మ‌డి రాష్ట్ర విడిపోయిన త‌రువాత రాయ‌పాటి కుటుంబీకులు టీడీపీలో చేరారు. న‌ర‌స్స‌రావుపేట ఎంపీగా 2014 ఎన్నిక‌ల్లో పోటీ చేసిన రాయ‌పాటి సాంబ‌శివ‌రావు ఆ ఎన్నిక‌ల్లో గెలుపొందారు. కానీ, 2019 ఎన్నిక‌ల్లో ఓడిపోయారు.

రాయ‌పాటి, క‌న్నా మ‌ధ్య గ్రూప్ రాజ‌కీయం 

కాంగ్రెస్ పార్టీలో 2014 వ‌ర‌కు ఉన్న క‌న్నా ల‌క్ష్మీనారాయ‌ణ వైసీపీలో చేర‌డానికి అప్ప‌ట్లో రంగం సిద్ధం చేసుకున్నారు. కానీ, ఢిల్లీ బీజేపీ పెద్ద‌లు చ‌క్రం తిప్ప‌డంతో క‌మ‌లం గూటికి చేరారు. ఆ పార్టీ ఏపీ అధ్య‌క్షునిగా ఇటీవ‌ల వ‌ర‌కు ఉన్నారు. ఆ స‌మ‌యంలో చంద్ర‌బాబుకు స‌హ‌కారం అందించార‌ని బీజేపీ అధిష్టానం వ‌ద్ద ఫిర్యాదు ఉన్నాయి. అందుకే, ఆయ‌న్ను పార్టీ అధ్య‌క్ష ప‌ద‌వి నుంచి త‌ప్పించారు. అప్ప‌టికే రాజ‌కీయ వేదిక‌ను ఏర్పాటు చేసుకున్న క‌న్నా టీడీపీలో చేరిపోయారు. వాస్త‌వంగా జ‌న‌సేన పార్టీలో చేరాల‌ని భావించిన‌ప్ప‌టికీ రెండు పార్టీల పొత్తు ఉంటుంద‌ని గ్ర‌హించిన ఆయ‌న సైకిల్ (TDP Jumping Leaders) ఎక్కారు. ఆ రోజు నుంచి రాయ‌పాటి, క‌న్నా మ‌ధ్య గ్రూప్ రాజ‌కీయం మ‌ళ్లీ టీడీపీలో రాజుకుంది.

టీడీపీకి తాజాగా క‌న్నా, రాయ‌పాటి మ‌ధ్య పోరు

వెట‌ర‌న్ లీడ‌ర్ల‌తో విసిగిపోతున్న టీడీపీకి తాజాగా క‌న్నా, రాయ‌పాటి మ‌ధ్య పోరు (TDP Jumping Leaders) సంక‌టంగా మారింది. ఇరువురినీ వ‌దులుకోలేని చంద్ర‌బాబు ఎటూ చెప్ప‌లేక ఇటీవ‌ల మ‌ల్ల‌గుల్లాలు ప‌డ్డారు. కానీ, లోకేష్ మాత్రం రాయ‌పాటిని వ‌దిలించుకునేందుకు సిగ్న‌ల్ ఇచ్చార‌ట‌. ఆ విష‌యం తెలుసుకున్న రాయ‌పాటి కుటుంబీకులు వైసీపీలో చేర‌డానికి రంగం సిద్దం చేసుకుంటున్నార‌ని స‌ర్వ‌త్రా చ‌ర్చ జ‌రుగుతోంది.

ఇప్ప‌టికే క‌న్నా ల‌క్ష్మీనారాయ‌ణ‌కు స‌త్తెన‌ప‌ల్లి నుంచి పోటీ చేసే అవ‌కాశాన్ని చంద్ర‌బాబు ఇచ్చారు. అక్క‌డ కోడెల శివ‌ప్ర‌సాద్ కుమారుడు శివ‌కుమార్ ఉన్న‌ప్ప‌టికీ ప‌క్క‌న పెట్టేశారు. దీంతో కోడెల వ‌ర్గం క‌న్నా మీద వ్య‌తిరేకంగా ఉంది. అదే స‌మ‌యంలో రాయ‌పాటి అనుచ‌రులు కూడా క‌న్నా తో క‌లిసి ప‌నిచేయ‌లేక‌పోతున్నారు. ఇలాంటి పరిస్థితుల న‌డుమ పార్టీని వీడేందుకు రాయ‌పాటి సిద్ద‌మ‌య్యార‌ని తెలుస్తోంది. రేపోమాపో ఫ్యాన్ గాలిని (Jumping Leader) పీల్చుకుంటార‌ని గుంటూరు టీడీపీ వ‌ర్గాల్లోని టాక్‌.

వైసీపీలోకి  ప్ర‌త్తిపాటి పుల్లారావు వెళుతున్నార‌ని ప్ర‌చారం (TDP Jumping Leaders) 

ఇక గుంటూరు జిల్లా టీడీపీ అధ్య‌క్షునిగా వెల‌గ‌బెట్టిన ప్ర‌త్తిపాటి పుల్లారావు అధికారంలో ఉన్న‌ప్పుడు మంత్రి హోదాను అనుభ‌వించారు. సీఆర్డీయే వ్య‌వ‌హారాల‌ను స‌ర్వం తానై చూశారు. ఆ స‌మ‌యంలో ఆయ‌న‌తో పాటు కుటుంబీకులపై కూడా ప‌లు అవినీతి ఆరోప‌ణ‌లు వ‌చ్చాయి. అయిన‌ప్ప‌టికీ పూర్తికాలం మంత్రిగా ఉండే అవ‌కాశం చంద్ర‌బాబు ఇచ్చారు. అధికారం పోయిన త‌రువాత మాజీ మంత్రిగా పార్టీని కాపాడేందుకు ప్ర‌య‌త్నం చేయ‌లేదు. ఒకానొక స‌మ‌యంలో వైసీపీలోకి (Jumping Leader) వెళుతున్నార‌ని ప్ర‌చారం కూడా జ‌రిగింది.

భాష్యం కుటుంబీకుల‌కు చిల‌క‌లూరిపేట టిక్కెట్ ఇవ్వాల‌ని

అమ‌రావ‌తి ఉద్య‌మంలో ఇటీవ‌ల ఒక‌టి రెండు చోట్ల మిన‌హా ఎక్క‌డా ఆయ‌న కనిపించ‌లేదు. తెర‌వెనుక వైసీపీతో చేతులు క‌లిపి వ్యాపారాలు చేసుకుంటున్నార‌ని గుంటూరు జిల్లాలోని టీడీపీ వ‌ర్గాలు చెప్పుకునే మాట‌. అందుకే, ఇటీవ‌ల భాష్యం కుటుంబీకుల‌కు చిల‌క‌లూరిపేట టిక్కెట్ ఇవ్వాల‌ని టీడీపీ అధిష్టానం భావించింది. నియోజ‌క‌వ‌ర్గంలోనూ సేవ కార్య‌క్ర‌మాల‌ను ఆయ‌న పెద్ద ఎత్తున చేశారు. నాలుగేళ్లుగా పార్టీ కార్య‌క్ర‌మాల‌కు దూరంగా ఉన్న పుల్లారావు ఇప్పుడు మీడియా ముందుకొచ్చి ఇత‌రుల‌కు టిక్కెట్ ఎలా ఇస్తారంటూ చంద్ర‌బాబును నిల‌దీస్తున్నారు. కాదంటే, జెండా పీకే  (TDP Jumping Leaders) ప‌రిస్థితికి వ‌చ్చార‌ని తెలుస్తోంది.

Also Read : TDP Scheme : మ‌గువ‌కు `మ‌హాశ‌క్తి` చంద్ర‌బాబు

ఇక విజ‌య‌వాడ ఎంపీ కేశినేని నాని వ్య‌వ‌హారం అంద‌రికీ తెలిసిందే. నాలుగేళ్లుగా అప్పుడ‌ప్పుడు చంద్ర‌బాబు, లోకేష్ నాయ‌క‌త్వం మీద తిర‌గ‌బడుతూ వ‌స్తున్నారు. కృష్ణా జిల్లాలోని లీడ‌ర్ల‌తో ఆయ‌న‌కు పొస‌గ‌దు. ఆ జిల్లాలోని మాజీ మంత్రి దేవినేని ఉమ‌, బ‌ద్దా వెంక‌న్న‌, బొండా ఉమ త‌దిత‌రుల‌ను నాయ‌కులుగా కేశినేని చూడ‌రు. వాళ్ల‌ను అధిష్టానం ప్రోత్స‌హిస్తుంద‌ని అప్పుడ‌ప్పుడు ఆక్రోశం వెళ్ల‌గ‌క్కారు. ప‌లు సంద‌ర్భాల్లో లోకేష్ నాయ‌క‌త్వం మీద ట్వీట్ట‌ర్ వేదిక‌గా ప‌రోక్షంగా విమ‌ర్శ‌లు గుప్పించారు.

Also Read : AP North : అమ్మో YCP, ఉత్త‌రాంధ్ర ఉలికిపాటు!

కార్పొరేష‌న్ ఎన్నిక‌ల్లోనూ రెండు గ్రూపులుగా విడిపోయిన టీడీపీ లీడ‌ర్లు టీడీపీని విజ‌య‌వాడ కేంద్రంగా బ‌ల‌హీన‌ప‌రిచేలా వ్య‌వ‌హ‌రించారు. అయిన‌ప్ప‌టికీ ఎవ‌ర్నీ ఏమీ అన‌లేని ప‌రిస్థితుల్లో చంద్ర‌బాబు ఉన్నారు. కానీ, లోకేష్ మాత్రం కేశినేని నాని పార్టీ నుంచి వెళ్లిపోయిన‌ప్ప‌టికీ న‌ష్టంలేద‌నే సంకేతాలు ఇస్తున్నారు. ప్ర‌త్యామ్నాయ ఏర్పాట్లను కూడా చేశారు. ఇలా, పార్టీలోని కీల‌క లీడ‌ర్లు గ్రూపుల‌తో అస‌హ‌నంగా ఉండ‌డాన్ని నికార్సైన టీడీపీ క్యాడ‌ర్ జీర్ణించుకోలేక‌పోతోంది. ఈసారి ఎన్నిక‌లు ఏపీ రాష్ట్రానికి కీల‌కం. ఆ దిశ‌గా చంద్ర‌బాబు సిద్ద‌మ‌వుతుంటే, రాజ‌ధాని అమ‌రావ‌తి ప‌రిధిలోని టీడీపీ లీడ‌ర్లు మాత్రం పార్టీకి వెన్నుపోటు  (TDP Jumping Leaders) పొడిచేందుకు ఏ మాత్రం సందేహించ‌క‌పోవ‌డం విచిత్రం.