TDP Josh : తొలి విడ‌త భువ‌నేశ్వ‌రి, మ‌లివిడ‌త బ్రాహ్మణి `బ‌స్సు యాత్ర`

TDP Josh : జైలులో ఉన్న చంద్ర‌బాబునాయుడుతో మూడుసార్లు బ్రాహ్మ‌ణి, భువ‌నేశ్వ‌రి ములాఖ‌త్ అయ్యారు. ఆయ‌న ఇచ్చిన డైరెక్ష‌న్ ఏమిటో తెలియ‌దు.

  • Written By:
  • Publish Date - October 2, 2023 / 02:43 PM IST

TDP Josh : జైలులో ఉన్న చంద్ర‌బాబునాయుడుతో మూడుసార్లు బ్రాహ్మ‌ణి, భువ‌నేశ్వ‌రి ములాఖ‌త్ అయ్యారు. ఆయ‌న ఇచ్చిన డైరెక్ష‌న్ ఏమిటో తెలియ‌దు. కానీ, భువ‌నేశ్వ‌రి బ‌స్సు యాత్ర‌కు ఈనెల 5వ తేదీ నుంచి శ్రీకారం చుడ‌తార‌ని తెలుస్తోంది. ఆమె కుప్పం నుంచి యాత్ర‌ను ప్రారంభిస్తార‌ని టాక్. జైలుకు చంద్ర‌బాబు వెళ్లిన తొలి రోజుల్లో బ్రాహ్మ‌ణి పేరు బాగా వినిపించింది. అంతేకాదు, ఒక వేళ లోకేష్ ను కూడా అరెస్ట్ చేస్తే ఆమె పాద‌యాత్ర చేస్తార‌ని కూడా టీడీపీ కేంద్ర కార్యాల‌యం నుంచి లీకులు బ‌య‌ట‌కు వ‌చ్చాయి. కానీ, బ్రాహ్మ‌ణి బ‌దులుగా భువ‌నేశ్వ‌రి ముందుకు రావ‌డంపై పార్టీలో అంత‌ర్గ‌తంగా చ‌ర్చ జ‌రుగుతోంది.

భువ‌నేశ్వ‌రి బ‌స్సు యాత్ర‌కు బ్లూ ప్రింట్ (TDP Josh)

బ‌స్సు యాత్ర‌కు బ్లూ ప్రింట్ కూడా సిద్ద‌మ‌యింద‌ని తెలుస్తోంది. ఆమె రాష్ట్ర వ్యాప్తంగా ప‌ర్య‌టించ‌డానికి రూట్ మ్యాప్ ను రూపొందించార‌ని స‌మాచారం. తొలుత రాయ‌ల‌సీమ జిల్లాల్లో భువ‌నేశ్వ‌రి యాత్ర ఉంటుంద‌ని తెలుస్తోంది. ఆ త‌రువాత ఉత్తరాంధ్ర వ‌ర‌కు యాత్ర‌ను నిర్విరామంగా కొన‌సాగిస్తారని టీడీపీ క్యాడ‌ర్ భావిస్తోంది. అయితే, ఇటీవ‌ల రెండుసార్లు బ్రాహ్మ‌ణి ఇచ్చిన స్పీచ్ యువ‌త‌ను బాగా ఆక‌ట్టుకుంద‌ని స‌ర్వేల ద్వారా పార్టీ స‌మాచారాన్ని సేక‌రించింది. ప్ర‌ధానంగా యువ‌త‌, మ‌హిళ‌ల‌ను బ్రాహ్మ‌ణి స్పీచ్ ఆక‌ట్టుకున్న‌ట్టు (TDP Josh) పార్టీ భావిస్తోంది. అంతేకాదు, బ్రాహ్మ‌ణి పాల్గొన్న క్యాండిల్ ర్యాలీ విజ‌య‌వంతం అయింది. అలాగే, ఆమె పిలుపు మేర‌కు `మోతమోగిద్దాం.,` అనే ప్రోగ్రామ్ సూప‌ర్ హిట్ అయింది.

బ్రాహ్మ‌ణి బ‌స్సు యాత్ర చేయాల‌ని పార్టీలోని కొంద‌రు

అత్తాకోడ‌ళ్లు ఇద్ద‌రూ మంచి స్పీక‌ర్లే. కానీ,బ్రాహ్మిణి తెలుగు స్పీచ్ యువ‌త‌ను ఆక‌ట్టుకుంటుంద‌ని పార్టీ అంత‌ర్గ‌త స‌ర్వేల్లోని సారాంశం. అందుకే, బ్రాహ్మ‌ణి బ‌స్సు యాత్ర చేయాల‌ని పార్టీలోని కొంద‌రు భావిస్తున్నారు. అయితే, ఇటీవ‌ల ఏర్పడిన పార్టీ ప్ర‌ణాళిక క‌మిటీలోని సీనియ‌ర్లు మాత్రం భువ‌నేశ్వ‌రిని రంగంలోకి దింపుతున్నారు. తొలి విడ‌త భువ‌నేశ్వ‌రిని బ‌స్సు యాత్రకు దింపిన త‌రువాత వ‌చ్చే స్పంద‌న ఆధారంగా మ‌లి విడ‌త ప్రోగ్రామ్ ను బ్రాహ్మ‌ణితో చేయించాల‌ని ప్లాన్ చేస్తున్నారు. ప్ర‌స్తుతం బ్రాహ్మ‌ణి హెరిటేజ్ కంపెనీ వ్యాపారాల‌ను చూస్తున్నారు. ఆమె బిజీగా వ్యాపార కార్య‌క‌లాపాల్లో ఉంటారు. అందుకు సంబంధించిన అంశాల‌ను ఒక కొలిక్కి తీసుకొచ్చిన త‌రువాత ఎన్నిక‌ల ప్ర‌చారంలోకి  (TDP Josh) దిగుతార‌ని తెలుస్తోంది.

Also Read : Jagan: ఉత్తరాంధ్ర లో సొంత నేతలకే జగన్ షాక్ ఇవ్వబోతున్నారా..?

యువ‌గ‌ళం పాద‌యాత్ర‌ను కంటిన్యూ చేయ‌డానికి లోకేష్ సిద్ద‌మ‌వుతున్నారు. ఆయ‌న సీఐడీ విచార‌ణ‌కు ఈనెల 4వ తేదీన హాజ‌రు కానున్నారని వినికిడి. రెండు రోజుల క్రితం ఢిల్లీ వెళ్లిన సీఐడీ ఆయ‌న‌కు 41ఏ కింద నోటీసులు ఇచ్చిన విష‌యం విదిత‌మే. ఇన్నర్ రింగ్ రోడ్డు అలైన్మెంట్ కేసు, పైబ‌ర్ నెట్ కేసుల‌కు సంబంధించి ఆయ‌న్ను విచారిస్తార‌ని తెలుస్తోంది. ఇప్ప‌టికే స్కిల్ డ‌వ‌లెప్మెంట్ కేసులో ఏ 37 కింది చంద్ర‌బాబు జైలుకు వెళ్లారు. ఆ కేసులోనూ లోకేష్ ప్ర‌మేయం ఉంద‌ని సీఐడీ చెబుతోంది. ఆయ‌న్ను కూడా అరెస్ట్ చేస్తామ‌ని ఇటీవ‌ల ప్ర‌క‌టించింది. ఇన్న‌ర్ రింగ్ రోడ్డు కేసులో ఏ 14గా ఉన్న ఆయ‌న్ను ఈనెల 4వ తేదీన సీఐడీ విచారించ‌నుంది.

Also Read : CBN Vision Effect : చంద్ర‌బాబు విలువ తెలుస్తోంది.! ప్రపంచ వ్యాప్తంగా నిర‌స‌న‌!!

ప్ర‌స్తుతం ఢిల్లీలో ఉన్న లోకేష్ జాతీయ మీడియా వేదిక‌గా వాస్త‌వాల‌ను బ‌య‌ట పెడుతున్నారు. న్యాయ‌స్థానాల్లోని అంశాల‌ను స‌మీక్షిస్తూ కేసుల గురించి న్యాయ‌వాదుల‌తో మాట్లాడుతున్నారు. ఢిల్లీ జంత‌ర్ మంత‌ర్ వ‌ద్ద స‌త్యాగ్ర‌హ‌దీక్ష‌ను అక్టోబ‌ర్ 2 తేదీన చేస్తున్నారు. ఈనెల 4వ తేదీన విజ‌య‌వాడ సీఐడీ కార్యాల‌యంకు వ‌స్తార‌ని తెలుస్తోంది. ఒక వేళ ఆయ‌న్ను అరెస్ట్ చేస్తే మాత్రం బ్రాహ్మ‌ణి నేరుగా రంగంలోకి దిగుతార‌ని పార్టీ వ‌ర్గాల్లోని టాక్‌. అటు బ్రాహ్మ‌ణి ఇటు భువ‌నేశ్వ‌రి ఇద్ద‌రూ రాజ‌కీయ కుటుంబ నేప‌థ్యం ఉన్న వాళ్లే. కానీ, ఏనాడూ ఇద్ద‌రూ రాజ‌కీయాల్లో ప్ర‌త్య‌క్ష జోక్యం చేసుకోలేదు. వ్యాపారాలు, గృహిణులుగా మాత్ర‌మే ఉన్నారు. ఇప్పుడు అనివార్యంగా రాజ‌కీయాల్లోకి ప్ర‌త్య‌క్షంగా అడుగు పెట్టాల్సి వ‌స్తుంది. స‌మ‌కాలీన రాజ‌కీయాలను ప్ర‌త్య‌క్ష రాజ‌కీయాల‌ను వాళ్లిద్ద‌రూ ఎలా ఫేస్ చేస్తారు? అనేది ఆస‌క్తిక‌రం.