Site icon HashtagU Telugu

TDP BC : క్యాడ‌ర్‌కి కొత్త ఉత్సాహం తెచ్చిన జ‌య‌హో బీసీ స‌భ‌

TDP

TDP

ఆర్థికంగా వెనకబడిన వర్గాల అభ్యున్నతి, అభివృద్ధే లక్ష్యంగా టీడీపీ-జనసేన బీసీ డిక్లరేషన్ ప్రకటించాయి. టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు, జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ 10 అంశాలతో కూడిన బీసీ డిక్లరేషన్ ను ప్రకటించారు. గుంటూరు జిల్లా, మంగళగిరి నియోజకవర్గం, ఆచార్య నాగార్జు యూనివర్సిటీ ఎదురు ప్రాంగణంలో ఏర్పాటు చేసిన జయహో బీసీ సభకు పెద్ద సంఖ్య‌లో ప్ర‌జ‌లు పాల్గొన్నారు. టీడీపీకి 40 ఏళ్లుగా అండగా ఉన్న బీసీల రుణంతీర్చుకునేందుకే డిక్లరేషన్ ప్రకటించామ‌ని టీడీపీ అధినేత చంద్ర‌బాబు తెలిపారు. జ్యోతీరావు పూలే ఆశయాలను పాటించిన వ్యక్తి ఎన్టీఆర్ అని.. టీడీపీ-జనసేన పార్టీలు బడుగు బలహీన వర్గాలకు అండగా ఉంటాయని చెప్పేందుకే సమిష్టిగా డిక్లరేషన్ ను ప్రకటిస్తున్నామ‌న్నారు. 153 కులాలతో 56 సాధికార కమిటీలు ఏర్పాటు చేసి అభిప్రాయాలు సేకరించామ‌ని.. తెలుగుదేశం-జనసేన నాయకులతో చర్చించి చరిత్ర తిరగరాయబో బీసీ డిక్లరేషన్ ను తీసుకువచ్చామ‌న్నారు.  బీసీల జీవితాల్లో ఒక వెలుగు వచ్చే విధాంగా ముందుకు వెళ్తున్నామ‌ని.. బీసీల డీఎన్ఏలోనే తెలుగుదేశం పార్టీ ఉందన్నారు.
We’re now on WhatsApp. Click to Join.
ప్రజా ప్రభుత్వం వచ్చిన వెంటనే బీసీలకు 50 ఏళ్లకే పింఛన్ ఇచ్చే విధానానికి శ్రీకారం చుడుతున్నామ‌ని చంద్ర‌బాబు తెలిపారు.  ఫించను విధానాన్ని రూ.35తో కి ఎన్టీఆర్ ప్రారంభించారని.. దాన్ని రూ.70 కి నేను పెంచానన‌ని. ఆ  తర్వాత రూ.200 ఉన్న పెన్షన్ ను రూ.2 వేలకు పెంచింది కూడా టీడీపీనే అని తెలిపారు. ఇప్పుడు రూ.3 వేలు ఉన్న పెన్షన్ ను రూ.4 వేలకు పెంచుతామ‌ని చంద్ర‌బాబు తెలిపారు. సంక్షేమ కార్యక్రమాలు ఇస్తూనే సంపద సృష్టించే మార్గాన్ని చూపించాలన్న ఉద్దేశంతోనే సబ్ ప్లాన్ ద్వారా రూ.1.50 కోట్లు ఐదేళ్లలో ఖర్చు చేసే బాధ్యత త‌మ‌పై ఉంద‌న్నారు. దొంగ లెక్కలు చూపించి నిధులను దొడ్డు దారిని మళ్ళించి బీసీలకు అన్యాయం చేసిన పార్టీ వైసీపీ అని.. స్థానిక సంస్థల ఎన్నికల్లో రిజర్వేషన్లను 25 శాతం నుండి 34 శాతానికి పెంచామ‌ని.. కానీ జగన్ రెడ్డి 34 శాతాన్ని 24 శాతానికి తగ్గించడంతో 16,800 పదవులు బీసీలు కోల్పోయారన్నారు.
Also Read:  Nara Lokesh : మంగళగిరి ఫై నారా లోకేష్ వరాల జల్లు..
నాయకత్వం అనేది రాత్రికి రాత్రే రాదని.. అనునిత్యం కష్టపడేత తప్ప సాధ్యం కాదన్నారు. ఆర్థికంగా, సామాజికంగా, రాజకీయంగా వెనకబడి ఉండటం వల్ల పేదరికంలోనే మగ్గుతున్నారని.. అందువల్ల రాజకీయాల్లో వెనుకబడిన వర్గాలకు రిజర్వేషన్ లు పెట్టి నాయకులను తయారుచేసిన పార్టీ టీడీపీ అని చంద్ర‌బాబు తెలిపారు. చట్ట సభల్లో(అసెంబ్లీ, పార్లమెంటు) వెనుకబడిన వర్గాలకు 33 శాతం రిజర్వేషన్లు పెట్టేంతవరకు మీ తరుపున మేము పోరాడుతామ‌ని.. ఎవరికైనా రాజకీయంగా ప్రాముఖ్యతివ్వలేకపోతే, స్థానాన్ని కేటాయించలేకపోతే నామినేటెడ్ పోస్టుల్లో పెట్టే బాధ్యత త‌మ‌ద‌ని చంద్ర‌బాబు తెలిపారు.