Chandrababu Bail : జగన్ లండన్లో ఉండి బాబును అరెస్ట్ చేయిస్తే..పవన్ ఇటలీ లో ఉండి బెయిల్ ఇప్పించాడు

చంద్రబాబు అరెస్ట్ వెనుక జగన్ ఉంటే.. బెయిల్ రావడం వెనుక తమ అధినేత పవన్ కల్యాణ్ ఉన్నారని జనసేన కార్యకర్తలు సోషల్ మీడియా వేదికగా పోస్టులు పెడుతున్నారు

Published By: HashtagU Telugu Desk
Pawan Babu Bail

Pawan Babu Bail

స్కిల్ డెవలప్ మెంట్ కేసులో ఆరోపిస్తూ మాజీ సీఎం , చంద్రబాబు (Chandrababu) ను అరెస్ట్ చేసి రాజమండ్రి సెంట్రల్ జైల్లో వేసిన సంగతి తెలిసిందే. దాదాపు 52 రోజుల పాటు బాబు జైలు జీవితం గడిపి రెండు రోజుల క్రితం మధ్యంతర బెయిల్ (Chandrababu Bail) ఫై బయటకు వచ్చారు. తిరిగి నవంబర్ 28 న సరెండర్ అవ్వాల్సి ఉంది. బాబు అరెస్ట్ అయినా నేపథ్యంలో ఒకటి, రెండు రోజుల్లో బెయిల్ ఫై బయటకు వస్తారని అంత భావించారు. కానీ ఏపీ CID మాత్రం బాబు ఫై పలు కేసులు నమోదు చేసి..బెయిల్ రాకుండా చేసింది. చివరకు బాబు అనారోగ్యానికి గురి కావడం తో కోర్ట్ బెయిల్ ఇచ్చింది.

బాబు కు బెయిల్ రావడం తో టీడీపీ (TDP) శ్రేణులు సంబరాలు చేసుకుంటున్నారు. ఇక జైలు నుండి రాడేమో అని అంత అనుకుంటున్నా సమయంలో బాబు బయటకు రావడం కుటుంబ సభ్యుల్లో , పార్టీ శ్రేణుల్లో ఊపిరి పోసింది. ఇక బాబు బయటకు రావడం తో వైసీపీ-టీడీపీ (TDP vs YCP) నేతల మధ్య మాటల యుద్దం నడుస్తోంది. చంద్రబాబు బయటకు రావడంతో..న్యాయం గెలిచింది, ధర్మం నిలిచిందని టీడీపీ శ్రేణులు , నేతలు సోషల్ మీడియాలో హోరెత్తిస్తుండగా, చంద్రబాబు హెల్త్ ఇష్యూస్ మీదనే ఈ బెయిల్ వచ్చిందనే విషయాన్ని వైసీపీ నేతలు గుర్తు చేస్తున్నారు. స్కిల్ స్కాంలో చంద్రబాబుకు కేవలం బెయిల్ మాత్రమే వచ్చిందనే విషయాన్ని టీడీపీ గుర్తుంచుకోవాలని.. న్యాయస్థానం ఎక్కడ కూడా చంద్రబాబు నిర్దోషి అని చెప్పలేదని వైసీపీ కామెంట్స్ చేస్తుంది.

We’re now on WhatsApp. Click to Join.

ఇలా టీడీపీ – వైసీపీ పార్టీల మధ్య వార్ నడుస్తుంటే..జనసేన (Jasena) సరికొత్త వాదనను తెరపైకి తీసుకొచ్చి వార్తల్లో నిలిచింది. చంద్రబాబు అరెస్ట్ వెనుక జగన్ ఉంటే.. బెయిల్ రావడం వెనుక తమ అధినేత పవన్ కల్యాణ్ (Pawan Kalyan) ఉన్నారని జనసేన కార్యకర్తలు సోషల్ మీడియా వేదికగా పోస్టులు పెడుతున్నారు. జగన్ ఇంగ్లాండ్‌లో ఉండి చంద్రబాబును అరెస్ట్ చేయిస్తే… పవన్ ఇటలీలో ఉండి బెయిల్ ఇప్పించారని వైసీపీ నాయకులకు జనసేన కార్యకర్తలు గట్టిగానే కౌంటరిస్తున్నారు. జగన్‌ను పవన్ కల్యాణ్ దెబ్బకు దెబ్బ తీశారని పవన్ అభిమానులు సోషల్ మీడియా వేదికగా కామెంట్స్ చేస్తున్నారు. మరి జనసేన కామెంట్స్ ఫై వైసీపీ రియాక్షన్ ఎలా ఉంటుందో చూడాలి.

ప్రస్తుతం పవన్ కళ్యాణ్..నాగబాబు తనయుడు వరుణ్ తేజ్ వివాహ వేడుకల నిమిత్తం ఇటలీకి వెళ్ళాడు. నిన్న వరుణ్ వివాహం అట్టహాసంగా జరిగింది. ఈ పెళ్లి వేడుక పిక్స్ సోషల్ మీడియా లో మెగా ఫ్యాన్స్ తెగ వైరల్ చేస్తున్నారు.

Read ALso :

  Last Updated: 02 Nov 2023, 10:50 AM IST