Site icon HashtagU Telugu

TDP-Janasena Meet : ఈ నెల 09 న టీడీపీ- జనసేన సమన్వయ కమిటీ

Tdp Janasena Working Commit

Tdp Janasena Working Commit

ఈ నెల 09 న టీడీపీ కేంద్ర కార్యాలయంలో టీడీపీ- జనసేన సమన్వయ కమిటీ (TDP Janasena Working Committee Meet) సమావేశం కాబోతున్నారు. ఇప్పటికే లోకేష్ (Nara Lokesh) అధ్యక్షతన ఓసారి సమావేశం అవ్వగా..ఇప్పుడు మరోసారి భేటీ కాబోతున్నారు. ఈ సమావేశానికి జనసేన అధినేత పవన్ కల్యాణ్ (Pawan Kalyan), పీఏసీ చైర్మన్ నాదెండ్ల మనోహర్‌ (Manohar), టీడీపీ నుంచి నారా లోకేశ్ (Nara Lokesh), యనమల రామకృష్ణుడులు హాజరుకానున్నారు. వీరితో పాటు అటు జనసేన నుంచి మరో ఐదుగురు, టీడీపీ నుంచి మరో ఐదుగురు ఈ సమావేశానికి హాజరుకానున్నట్లు తెలుస్తోంది. అయితే, ఉమ్మడి మేనిఫెస్టో, కామన్ మినిమమ్ ప్రోగ్రాం రూపకల్పనపై ప్రధానంగా చర్చ సాగనుంది. అలాగే ఈ సమావేశం వేదికగా రెండు పార్టీలు కలిసి ప్రజల్లోకి వెళ్లడంపై చర్చించనున్నారు. ప్రజా సమస్యల వారీగా ఉద్యమ కార్యాచరణ చేపట్టే అంశంపై చర్చించనున్నట్లు తెలుస్తోంది. అలాగే ప్రతి నియోజకవర్గంలో ఇంటింటి ప్రచారంపై చర్చించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.

We’re now on WhatsApp. Click to Join.

కాగా, రాజమండ్రి జైలులో టీడీపీ అధినేత చంద్రబాబు (Chandrababu)ను కలిసిన తర్వాత మీడియాతో మాట్లాడిన పవన్‌ కల్యాణ్.. టీడీపీ-జనసేన కలిసి నడవాలని నిర్ణయించాయనే విషయాన్ని ప్రకటించిన సంగతి తెలిసిందే. ఇక, అనారోగ్య సమస్యలతో మధ్యంతర బెయిల్‌పై జైలు నుంచి విడుదలైన చంద్రబాబును హైదరాబాద్‌లో పరామర్శించిన పవన్‌ కల్యాణ్‌.. తాజా రాజకీయ పరిస్థితులపై కూడా చర్చించారు.. దాదాపు రెండున్నర గంటల పాటు ఈ భేటీ జరిగింది. ఇక ఇప్పుడు సమన్వయ కమిటీ ద్వారా మరోసారి టీడీపీ నేతలతో పవన్ సమావేశం కాబోతున్నారు.

Read Also : YS Sharmila : రేవంత్ రెడ్డి ఓ దొంగ ..ఏనాటికి అలాంటి వారు సీఎం కాలేరు – వైస్ షర్మిల సంచలన వ్యాఖ్యలు