Site icon HashtagU Telugu

AP : నేడు జనసేన – టీడీపీ ఉమ్మడి భారీ బహిరంగ సభ..ఇక తగ్గేదేలే అంటున్న శ్రేణులు

Tdp Janasena Meeting Tadepa

Tdp Janasena Meeting Tadepa

ఎన్నికల్లో పొత్తు పెట్టుకొని బరిలోకి దిగుతున్న జనసేన – టీడీపీ (Janasena -TDP) పార్టీలు..ఇక ఉమ్మడిగా ప్రచారం చేయబోతున్నారు. మొన్నటి వరకు ఓ లెక్క..ఇప్పటి నుండి ఓ లెక్క అన్నట్లు ఇరు అధినేతలు తమ అజెండా ను తెలుపబోతున్నారు. తాడేపల్లి గూడెం లో జరగనున్న ఈ భారీ ‘జెండా’ సభలో చంద్రబాబు (Chandrababu ), పవన్ కల్యాణ్ (Pawan Kalyan), ఇరు పార్టీల ముఖ్య నేతలు పాల్గొంటారు. ఈ సభకు రాష్ట్ర వ్యాప్తంగా లక్షలాదిగా అభిమానులు, కార్యకర్తలు తరలి వస్తున్నారు. తెలుగు జన విజయ కేతనం జెండాగా ఈ సభకు నామకరణం చేశారు. ఎన్నికల షెడ్యూల్ రాకముందే సగానికిపైగా అభ్యర్థులను ప్రకటించి అధికారపార్టీకి సవాల్ విసిరిన కూటమి ఇప్పుడు ఉమ్మడి బహిరంగ సభ నిర్వహణ ద్వారా శ్రేణులు కలిసి కదనరంగంలోకి దూకేలా దిశానిర్దేశం చేయనున్నాయి. సీఎం జగన్ (CM Jagan) విమర్శలకు ఈ సభ ద్వారా సమాధానం ఇవ్వబోతున్నారు.

We’re now on WhatsApp. Click to Join.

ఈసభలో చంద్రబాబు, పవన్ కల్యాణ్‌ తో పాటు మరో 500 మంది నాయకులు వేదికను పంచుకోబోతున్నారు. అన్ని నియోజకవర్గాల నుంచి దాదాపు 6 లక్షల మంది జనం ఈ సభకు హజరవుతారని అంచనా వేస్తున్నారు. సభా ప్రాంగణం చుట్టు భారీ ఎల్ఈడీలు, ఫ్లెక్సీలు, కటౌట్లు ఏర్పాటు చేస్తున్నారు. ఎన్నికల శంఖారావాన్ని ఇరు పార్టీల అధినేతలు ఇదే వేదికపై నుంచి పూరించబోతున్నారు. వచ్చే ఎన్నికల్లో ఉమ్మడిగా విజయం సాధించడమే లక్ష్యంగా క్యాడర్ ఏవిధంగా పనిచేయాలి.. టిక్కెట్ల కేటాయింపు తర్వాత ఇరు పార్టీల ఎలాంటి విభేదాలు లేకుండా పనిచేయాలనే విధంగా అధినేతలు పార్టీ శ్రేణులకు తెలుపనున్నారు. వైసీపీ అరాచక పాలన గురించి ప్రజలకు చెప్పడమే గాక టీడీపీ – జనసేన గెలుపు రాష్ట్రానికి ఎంత అవసరమో వివరించనున్నారు. ఈ సభ ఫై యావత్ రాష్ట్ర ప్రజలు ఆసక్తి గా ఎదురుచూస్తున్నారు.

Read Also : Manipur: మ‌ణిపూర్‌లో మ‌రోసారి ఉద్రిక్త‌త‌.. కార‌ణ‌మిదే..?