AP : టీడీపీ-జనసేన కు భారీ షాక్.. వైసీపీ లో చేరిన కీలక నేతలు

ఇప్పుడు కూటమి తమ అభ్యర్థులను ప్రకటించిన నేపథ్యంలో టికెట్ రాని నేతలు , అలాగే తమ నేతకు టికెట్ ఇవ్వలేదనే కోపంతో టీడీపీ , జనసేన పార్టీలకు చెందిన కీలక నేతలు ఆయా పార్టీలకు రాజీనామా చేసి , వైసీపీ లో చేరుతున్నారు.

  • Written By:
  • Publish Date - March 26, 2024 / 08:42 PM IST

ఎన్నికలు (Elections) సమీపిస్తున్న తరుణంలో కూటమి పార్టీలైన టీడీపీ (TDP) , జనసేన (Janasena) పార్టీ లకు భారీ షాక్ తగిలింది. మొన్నటి వరకు వైసీపీ (YCP) నుండి పెద్ద ఎత్తున టీడీపీ , జనసేన పార్టీలలో కీలక నేతలు చేరగా..ఇక ఇప్పుడు కూటమి తమ అభ్యర్థులను ప్రకటించిన నేపథ్యంలో టికెట్ రాని నేతలు , అలాగే తమ నేతకు టికెట్ ఇవ్వలేదనే కోపంతో టీడీపీ , జనసేన పార్టీలకు చెందిన కీలక నేతలు ఆయా పార్టీలకు రాజీనామా చేసి , వైసీపీ లో చేరుతున్నారు. ఈరోజు పెద్ద ఎత్తున నేతలు వైసీపీ కండువా కప్పుడుకున్నారు.

We’re now on WhatsApp. Click to Join.

తాడేప‌ల్లిలోని సీఎం క్యాంప్‌ కార్యాలయంలో వైసీపీ పార్టీ అధ్య‌క్షులు, సీఎం జగన్‌ సమక్షంలో గండూరి మహేష్, నందెపు జగదీష్‌ (మాజీ కార్పొరేటర్లు), కొక్కిలిగడ్డ దేవమణి (మాజీ కోఆప్షన్‌ మెంబర్‌), కోసూరు సుబ్రహ్మణ్యం (మణి) టీడీపీ రాష్ట్ర బీసీ సెల్‌ సెక్రటరీ, గోరంట్ల శ్రీనివాసరావు, మాజీ డివిజన్‌ అధ్యక్షులు, బత్తిన రాము (జనసేన విజయవాడ తూర్పు నియోజకవర్గం ఇన్‌ఛార్జి) వైసీపీలో చేరారు.

అలాగే వైజాగ్ కు చెందిన జి.వి.రవిరాజు (సీనియర్‌ నాయకులు), బొగ్గు శ్రీనివాస్, బొడ్డేటి అనురాధ (జనసేన నాయకులు), సూళ్లూరుపేట టీడీపీ సీనియర్‌ నేత వేనాటి రామచంద్రారెడ్డి, రాజంపేట పార్ల‌మెంట్ నియోజ‌క‌వ‌ర్గ టీడీపీ ఇన్‌చార్జ్ గంటా నరహరి, ఏలూరు పార్లమెంట్ నియోజ‌క‌వ‌ర్గ టీడీపీ ఇన్‌చార్జ్‌ గోరుముచ్చు గోపాల్‌ యాదవ్ లు వైసీపీలో చేరారు. ఈ మేర‌కు సీఎం జ‌గ‌న్ వారికి పార్టీ కండువాలు క‌ప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ కార్యక్రమంలో విజయవాడ వైసీపీ ఎంపీ అభ్య‌ర్థి కేశినేని నాని, ఎమ్మెల్యే వెలంపల్లి శ్రీనివాసరావు, ఎమ్మెల్సీ రుహుల్లా, విజయవాడ ఈస్ట్ వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి దేవినేని అవినాష్ , వైసీపీ రీజనల్‌ కోఆర్డినేటర్‌, రాజ్య‌స‌భ స‌భ్యులు వైవీ. సుబ్బారెడ్డి, గాజువాక వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి గుడివాడ అమర్‌నాథ్, విశాఖ నార్త్ వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి కే.కే. రాజు పాల్గొన్నారు. ఒకేసారి ఇంతమంది కీలక నేతలు చేరడం తో టీడీపీ , జనసేన పార్టీలలో ఆందోళన మొదలైంది.

Read Also : Pawan Kalyan : సొంత పార్టీకి రూ.10 కోట్ల విరాళం ఇచ్చిన పవన్ కళ్యాణ్