Site icon HashtagU Telugu

TDP Janasena Manifesto 2024 : ఈ నెల 17 న టీడీపీ-జనసేన పార్టీల ఉమ్మడి మేనిఫెస్టో విడుదల

Tdp Janasena Joint Manifest

Tdp Janasena Joint Manifest

మరో వారంలో ఏపీ అసెంబ్లీ ఎన్నికలకు సంబదించిన నోటిఫికేషన్ విడుదల అవుతున్న తరుణంలో అన్ని రాజకీయ పార్టీలు తమ ప్రచారాన్ని స్పీడ్ చేయాలనీ చూస్తున్నాయి. ఇప్పటికే అధికార పార్టీ వైసీపీ తో పాటు ఉమ్మడి జనసేన – టీడీపీ (Janasena – TDP) కూటమి తమ అభ్యర్థులను ప్రకటించి ప్రచారాన్ని ముమ్మరం చేస్తున్నాయి. ఈ తరుణంలో ఈ నెల 17 న టీడీపీ-జనసేన పార్టీల ఉమ్మడి మేనిఫెస్టో (Manifesto 2024) విడుదల చేసేందుకు ముహూర్తం ఖరారు చేసారు. చిలకలూరిపేటలో నిర్వహించనున్న భారీ బహిరంగ సభలో ఉమ్మడి మేనిఫెస్టో ప్రకటిస్తామని.. ఈ సభ ద్వారా భవిష్యత్తు కార్యాచరణను వెల్లడిస్తామన్నారు ఏపీ టీడీపీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడు. టీడీపీ కేంద్ర కార్యాలయంలో అచ్చెన్నాయుడు, నాదెండ్ల మనోహర్‌లు మీడియా సమావేశం నిర్వహించారు.

We’re now on WhatsApp. Click to Join.

చిలకలూరిపేట సభలో అందరూ భాగస్వామ్యం కావాలని శ్రేణులకు మనోహర్ పిలుపునిచ్చారు. వివిధ స్థాయిల్లో కమిటీలు ఏర్పాటు చేసి సభను విజయవంతం చేస్తామన్నారు. సూపర్ 6 నినాదంతో అభివృద్ధి లక్ష్యంతో ముందుకెళ్తున్నామమని తెలిపారు. పవన్ కళ్యాణ్ భద్రతా సిబ్బంది, జనసేన టీంలను పోలీసులు భయభ్రాంతులకు గురిచేస్తున్నారని ఆరోపించారు. ప్రతిపక్షాలను భయపెట్టాలని ప్రయత్నం చేస్తే అది సఫలం కాదన్నారు నాదెండ్ల. రాష్ట్రాన్ని జగన్‌ దారుణమైన పరిస్థితులకు తీసుకెళ్లారని.. టీడీపీ-జనసేన నేతలపై పోలీసుల వేధింపులు మానుకోవాలన్నారు. వారి తీరు మారకుంటే న్యాయపరంగా ముందుకెళ్తామన్నారు. ఆ వేధింపుల నుంచి పార్టీ శ్రేణుల్ని కాపాడేందుకు ప్రత్యేక టోల్‌ ఫ్రీ నంబర్‌ను (73062 99999) ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు.

Read Also : Telangana: తెలంగాణలో ఎమ్మెల్సీల నియామకాలపై రాష్ట్ర ప్రభుత్వానికి ఎదురు దెబ్బ