TDP- Janasena- Bjp Alliance : రెండు తెలుగు రాష్ట్రాల్లో టీడీపీ – జనసేన – బిజెపి కలిసి పోటీ..?

ఈ మూడు పార్టీ లు రెండు తెలుగు రాష్ట్రాల్లో పోటీ చేస్తే బాగుంటుందనే అభిప్రాయాన్ని అమిత్ షా వద్దకు తీసుకొచ్చినట్లు తెలుస్తుంది.

  • Written By:
  • Publish Date - October 12, 2023 / 12:51 PM IST

నిన్న బుధువారం కేంద్ర మంత్రి అమిత్ షా (Amit Shah) ను టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ (Nara Lokesh) , ఏపీ బిజెపి అధ్యక్షురాలు పురందేశ్వరి (Purandeswari), తెలంగాణ బిజెపి అధ్యక్షులు , కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి (Kishan Reddy) లు కలవడం ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాల్లో హాట్ టాపిక్ గా మారింది. ఇన్నర్ రింగ్ రోడ్ కేసులో రెండు రోజులు సీఐడీ విచారణ ఎదుర్కొన్న లోకేశ్ నిన్న సాయంత్రం ఢిల్లీ వెళ్లి హోం మంత్రి అమిత్ షాతో భేటీ అయ్యారు. ఈ భేటీ లో చంద్రబాబు (Chandrababu) కేసుల అంశాన్ని అమిత్ షా తో వివరించడం జరిగింది. ఉద్దేశ పూర్వకంగా కేసులతో వేధిస్తున్నారని ఫిర్యాదు చేసారు.

చంద్రబాబు వయసును ప్రస్తావించిన అమిత్ షా ఆయన ఆరోగ్యం పైన వాకబు చేయడం జరిగింది. అయితే, ఈ భేటీ వెనుక బీజేపీ (BJP) ఏపీ అధ్యక్షురాలు పురందేశ్వరి చొరవ తీసుకున్నారు. చంద్రబాబు అరెస్ట్ తరువాత 23రోజుల పాటు లోకేశ్ ఢిల్లీలోనే ఉన్నారు. ఆ సమయంలోనే అమిత్ షా తో కలవాలని ప్రయత్నాలు చేసారని చెబుతున్నారు. కానీ, కలవలేకపోయారు. చంద్రబాబు అరెస్ట్ వెనుక బీజేపీ ఉందనే ప్రచారం సాగుతున్న వేళ పురందేశ్వరి..ఇదే అంశం పైన బీజేపీ నాయకత్వంతో చర్చించినట్లు సమాచారం. ఈ భేటీ తరువాత పురందేశ్వరి ట్వీట్ చేయడం జరిగింది. చంద్రబాబు అరెస్ట్ లో బీజేపీ పాత్ర ఉంటే లోకేశ్ తో ఎలా సమావేశం అవుతారని ప్రశ్నించారు.

We’re now on WhatsApp. Click to Join.

ఇదిలా ఉంటె ఈ భేటీ లో రాబోయే ఎన్నికల్లో రెండు తెలుగు రాష్ట్రాల్లో టీడీపీ – జనసేన – బిజెపి కలిసి పోటీ (TDP- Janasena- Bjp Alliance) చేసేలా కూడా చర్చలు జరిపినట్లు తెలుస్తుంది. బీజేపీకి తెలంగాణ ఎన్నికలు ప్రతిష్ఠాత్మకంగా మరీనా సంగతి తెలిసిందే. తెలంగాణ లో ఈసారి ఎలాగైనా బిజెపి ని అధికారం లోకి తీసుకరావాలని బిజెపి అధిష్టానం చూస్తుంది. ఈ క్రమంలో తెలంగాణలో ఏపీ నుంచి సెటిలర్ల ఓట్లు కొన్ని నియోజకవర్గాల్లో గెలుపు ఓటములు ప్రభావితం చేయనున్నాయి. ఇప్పటికే ఆ ఓట్లను తమకు అనుకూలంగా మలచుకోవాలని కాంగ్రెస్ , బిఆర్ఎస్ ప్లాన్ చేస్తుంది. చంద్రబాబు అరెస్ట్ తర్వాత స్పందించని నేతలు..ఇప్పుడు చంద్రబాబు అరెస్ట్ ను ఖండిస్తూ వస్తున్నారు. ఈ క్రమంలో బిజెపి..చంద్రబాబు అరెస్ట్ విషయంలో కొంచం చొరవ తీసుకొని , బయటకు వచ్చేలా చేస్తూ..ఆ ప్రభావం రాబోయే ఎన్నికల్లో బిజెపి కి అనుకూలంగా మారుతుంది.

ప్రస్తుతం ఏపీ లో టీడిపి – జనసేన కలిసి పోటీ చేయడం ఫిక్స్ అయ్యింది. బిజెపి సపోర్ట్ చేస్తుందా..లేదా అనేది ఇంకా క్లారిటీ రాలేదు. నిన్న అమిత్ షా తో జరిగిన భేటీలో కలిసి పోటీ చేయాలనే ప్రస్తావన కూడా తీసుకొచ్చినట్లు తెలుస్తుంది. ఈ మూడు పార్టీ లు రెండు తెలుగు రాష్ట్రాల్లో పోటీ చేస్తే బాగుంటుందనే అభిప్రాయాన్ని అమిత్ షా వద్దకు తీసుకొచ్చినట్లు తెలుస్తుంది. దీనిపై అమిత్ షా సానుకూలంగా స్పందించినట్లు తెలుస్తుంది. ఒకవేళ అంత ఓకే అయితే రెండు తెలుగు రాష్ట్రాల్లో ఈ మూడు పార్టీలు కలిసి పోటీ చేయడం ఖాయం. ఈ లోపు చంద్రబాబు బయటకు రావాలి..ఆలా వస్తే ఈ మూడు పార్టీలకు తిరుగుండదు. మరి బాబు ను బిజెపి బయటకు తీసుకొస్తుందా..? అనేది చూడాలి.

Read Also : KCR: సారే కావాలి.. కారే రావాలి అంటూ దివ్యాంగుడి జన చైతన్య యాత్ర