TDP @NDA : ఎన్డీయేలోకి టీడీపీ.. పొత్తుపై ముగిసిన చ‌ర్చ‌లు…?

2019 ఎన్నిక‌ల్లో ఘోర ఓట‌మి త‌రువాత తెలుగుదేశం పార్టీ ఆచితూచి అడుగులు వేస్తుంది. అధికారంలోకి రావాలంటే పొత్తులు అనివార్య‌మ‌ని టీడీపీ అధినేత చంద్ర‌బాబు భావిస్తున్నారు.

  • Written By:
  • Updated On - August 29, 2022 / 11:38 AM IST

2019 ఎన్నిక‌ల్లో ఘోర ఓట‌మి త‌రువాత తెలుగుదేశం పార్టీ ఆచితూచి అడుగులు వేస్తుంది. అధికారంలోకి రావాలంటే పొత్తులు అనివార్య‌మ‌ని టీడీపీ అధినేత చంద్ర‌బాబు భావిస్తున్నారు. ఇప్ప‌టికే బీజేపీతో పొత్తు పెట్టుకునేందుకు చంద్ర‌బాబు సిద్ధ‌మైయ్యారు. ఇటు జ‌న‌సేన అధినేత ప‌వ‌న్ కళ్యాణ్ కూడా ప‌లుమార్లు బ‌హిరంగంగానే ఆయ‌న పొత్తుల గురించి మాట్లాడారు. అయితే జ‌న‌సేన టీడీపీ పొత్తుల‌పై ఇప్ప‌టికే క్లారిటీ వ‌చ్చిన‌ప్ప‌టికీ బీజేపీ నుంచి గ్రీన్ సిగ్న‌ల్ రావ‌డంకోసం వేచి చూస్తున్నారు. ఇటీవ‌ల చంద్ర‌బాబు ఢిల్లీ ప‌ర్య‌ట‌న త‌రువాత బీజేపీ పొత్తుపై క్లారిటీ వ‌చ్చిన‌ట్లు తెలుస్తొంది. ప్ర‌ధాని న‌రేంద్ర మోడీతో చంద్ర‌బాబు ప‌ర్స‌న‌ల్‌గా మాట్లాడుకున్న విష‌యం తెలిసిందే. ఆ స‌మ‌యంలో రాజ‌కీయాల గురించి మాట్లాడిన‌ట్లు టీడీపీ ముఖ్య‌నేత‌లు చెప్తున్నారు.

 

Also Read:  Pension Scheme: ప్రయివేటు జాబ్, బిజినెస్ చేసే వాళ్ళకూ ప్రతినెలా 50వేల పెన్షన్.. ఇలా!?

 

వ‌చ్చే ఎన్నిక‌ల్లో బీజేపీ జ‌న‌సేన టీడీపీ క‌లిసి పోటీ చేసే అవ‌కాశం ఉన్న‌ట్లు విశ్లేష‌కులు కూడా అంచనా వేస్తున్నారు. అయితే పొత్తుల వార్త‌లు వ‌చ్చిన స‌మ‌యంలో అధికార వైసీపీ పార్టీ జ‌న‌సేన‌, టీడీపీని టార్గెట్ చేస్తుంది. పొత్తులపై అధికార పార్టీ నేత‌లు స‌వాళ్లు విసురుతున్నారు, కేంద్రం అండ‌దండ‌లు ఉంటే టీడీపీకి అధికారంలోకి వ‌స్తుంద‌నే ఆందోళ‌న కొంత అధికార పార్టీ నేత‌ల్లో క‌నిపిస్తుంది. దీంతో జ‌న‌సేన‌, బీజేపీ, టీడీపీల‌పై వైసీపీ నేత‌లు మాట‌ల దాడి చేస్తున్నారు. మ‌రి టీడీపీ ఎన్డీయేలోకి చేరేందుకు సిద్ధ‌మైన‌..ఇంకా డేట్ ఫిక్స్ కాలేద‌ని స‌మాచారం.