Candidates Changed : ఐదుగురు అసెంబ్లీ అభ్యర్థులను మార్చిన టీడీపీ

Candidates Changed : ప్రస్తుతం టీడీపీ తమ అభ్యర్థులకు బీఫారాలను పంపిణీ చేస్తోంది.

  • Written By:
  • Updated On - April 21, 2024 / 01:28 PM IST

Candidates Changed : ప్రస్తుతం టీడీపీ తమ అభ్యర్థులకు బీఫారాలను పంపిణీ చేస్తోంది. ఈ కీలక తరుణంలో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు అనూహ్య నిర్ణయం తీసుకున్నారు. ఐదు అసెంబ్లీ స్థానాల్లో అభ్యర్థులను మారుస్తున్నట్లు ప్రకటించారు. ఉండి నుంచి  రఘురామకృష్ణరాజుకు, పాడేరు నుంచి గిడ్డి ఈశ్వరికి, మాడుగుల నుంచి బండారు సత్యనారాయణమూర్తికి, వెంకటగిరి నుంచి కురుగొండ్ల రామకృష్ణకు, మడకశిర నుంచి ఎంఎస్‌ రాజును బరిలోకి దింపుతున్నట్లు  టీడీపీ ప్రకటించింది. ఈ ఐదుగురు అభ్యర్థులకు బీఫారాలను కూడా అందజేసింది.ఈ మార్పుతో షాక్‌కు గురైన ఐదు స్థానాల కీలక టీడీపీ నేతలను పిలిచి బుజ్జగించే పనిలో చంద్రబాబు, సీనియర్లు ఉన్నట్లు తెలుస్తోంది.

బీఫామ్‌లను పంపిణీ చేసిన చంద్రబాబు

ఇవాళే అమరావతిలోని పార్టీ ప్రధాన కార్యాలయంలో మొత్తం ఎమ్మెల్యే, ఎంపీ అభ్యర్థులకు బీఫామ్‌లను చంద్రబాబు స్వయంగా అందించారు. ఆంధ్రప్రదేశ్ పునర్నిర్మాణం కోసం కృషి చేస్తామని వారితో ప్రమాణం చేయించారు. టీడీపీ శ్రేణులు, ఏపీ ప్రజల తరఫున వారికి శుభాకాంక్షలు తెలిపారు. చంద్రబాబు మాట్లాడుతూ.. పార్టీ కేండిడేట్లను గెలిపించుకునేందుకు సమష్టిగా కృషి చేయాలంటూ టీడీపీ నేతలకు సూచించారు. ఎన్నికల్లో విజయం సాధించేందుకు శాయశక్తులా పోరాడాలని, ప్రచారం ఉధృతం చేయాలని కోరారు. ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహాలకు సంబంధించి పార్టీ అభ్యర్థులకు చంద్రబాబు దిశానిర్దేశం చేశారు.

We’re now on WhatsApp. Click to Join

పొత్తులో భాగంగా.. 

ఆంధ్రప్రదేశ్‌లో టీడీపీ, జనసేన, బీజేపీలు కూటమిగా ఏర్పడి పోటీ చేస్తున్నాయి. పొత్తులో భాగంగా ఆయా స్థానాల్లో అభ్యర్థుల జాబితాను ప్రకటించి ప్రచారాన్ని కొనసాగిస్తున్నారు. ఏపీలో 175 అసెంబ్లీ, 25 పార్లమెంట్‌ స్థానాలుండగా టీడీపీ 144 అసెంబ్లీ, 17 పార్లమెంట్‌ స్థానాల్లో పోటీ చేస్తోంది. జనసేనకు 21 అసెంబ్లీ స్థానాలు, రెండు పార్లమెంట్‌ స్థానాలను కేటాయించారు.  బీజేపీ 10 అసెంబ్లీ, 6 ఎంపీ స్థానాల్లో అభ్యర్థులను బరిలోకి దింపింది.

Also Read :Israel Vs US : అమెరికాకు ఇజ్రాయెల్ వార్నింగ్.. ఇజ్రాయెలీ సైనికులపై అగ్రరాజ్యం ఆంక్షలు ?