Site icon HashtagU Telugu

TDP : ఒకేసారి టీడీపీ 175 మంది అభ్యర్థుల్ని ప్రకటించబోతుందా..?

Chandrababu

Chandrababu

ఏపీలో మరికొద్ది రోజుల్లో పార్లమెంట్ , అసెంబ్లీ ఎన్నికలు జరగబోతున్నాయి. ఈ క్రమంలో అన్ని పార్టీలు ఎన్నికల సమరానికి సిద్ధం అవుతున్నాయి. ఇదే క్రమంలో అభ్యర్థులను ప్రకటిస్తూ వస్తున్నారు. వైసీపీ ఇప్పటీకే ఆరు జాబితాలను విడుదల చేసి అభ్యర్థులను ప్రకటించగా..టీడీపీ – జనసేన పొత్తు లో భాగంగా ఆచితూచి అభ్యర్థులను ఎంపిక చేస్తూ వస్తున్నారు. ఇక ఇప్పుడు ఈ పొత్తులో బిజెపి కూడా కలవబోతుండడం తో ఎవరికీ టికెట్ దక్కుతుందో…ఎవరికీ దక్కదో..ఎవరు పార్టీని వీడుతారో..ఎవర్ని ఏ విధంగా బుజ్జగిస్తారో అనే టెన్షన్ అందరిలో నెలకొంది.

We’re now on WhatsApp. Click to Join.

ప్రస్తుతం అధినేత చంద్రబాబు అభ్యర్థుల జాబితాపై ముమ్మర కసరత్తు చేస్తున్నారు. 175 స్థానాలకు అభ్యర్థుల్ని ఆయన ఒకేసారి ప్రకటిస్తారని పార్టీ వర్గాలంటున్నాయి. 15 నుంచి 20మందికి టికెట్లను నిరాకరించినట్లు తెలుస్తోంది. ఇక పరిటాల, జేసీ, కోట్ల వంటి రాజకీయ కుటుంబాలకు తలా ఒక్కో టికెట్ మాత్రమే కేటాయించనున్నట్లు సమాచారం. బీజేపీతో పొత్తు దృష్ట్యా అభ్యర్థుల ప్రకటన మరింత ఆలస్యం కావొచ్చని టీడీపీ వర్గాలు భావిస్తున్నాయి.

ఇదిలా ఉంటె పార్టీ అధినేతలంతా వరుస పర్యటనలు ఫిక్స్ చేసుకుంటున్నారు. ఈరోజు నుండి టీడీపీ జాతీయ ప్రధానకార్యదర్శి నారా లోకేశ్‌ ‘శంఖారావం’ కార్యక్రమం శ్రీకాకుళం జిల్లా ఇచ్ఛాపురంలో ప్రారంభించారు. రోజు కు 3 నియోజకవర్గాల చొప్పున అన్ని నియోజకవర్గ కేంద్రాల్లో సభలు నిర్వహించనున్నారు. యువగళం పాదయాత్ర ముగించినప్పటికీ.. శ్రీకాకుళం, పార్వతీపురం మన్యం, విజయనగరం జిల్లాల్లోని కొన్ని నియోజకవర్గాల్లో లోకేశ్‌ పర్యటించలేదు. ఈ నేపథ్యంలో ఎన్నికలు సమీపిస్తుండడంతో ఆదివారం నుంచి నలభైరోజుల పాటు రాష్ట్రవ్యాప్తంగా 120 నియోజకవర్గాల్లో ‘శంఖారావం’ పేరుతో సభలు నిర్వహించనున్నారు. ఈనెల 21 వరకు ఉత్తరాంధ్రలోని అన్ని నియోజకవర్గాలలో సభలు నిర్వహిస్తారు.

Read Also : Mukesh Ambani: మ‌రో కంపెనీని కొనుగోలు చేసిన ముకేశ్ అంబానీ