ఏపీ అసెంబ్లీ ఎన్నికల (AP Assembly Elections) సంబదించిన నోటిఫికేషన్ వెలువడనున్న నేపథ్యంలో అన్ని పార్టీలు తమ అభ్యర్థులను ప్రకటించే పనిలో నిమగ్నమయాయ్యి. ఇప్పటీకే అధికార పార్టీ వైసీపీ వరుసపెట్టి జాబితాలను విడుదల చేస్తుండగా..ఈరోజు శనివారం టీడీపీ (TDP) ఏకంగా 94 మందితో కూడిన అభ్యర్థుల పేర్లను ప్రకటించింది. ఈ 94 మందిలో 23 మంది కొత్తవారే కావడం విశేషం. ఈసారి ఎన్నికల్లో కొత్తవారికి , మహిళలకు పెద్ద పీఠం వేస్తామని చెపుతూ వచ్చిన అధినేత చంద్రబాబు..చెప్పినట్లు కొత్తవారికి , మహిళలకు అవకాశం కల్పించారు.
టీడీపీ ప్రకటించినజాబితాలో 25 నుంచి 35 ఏళ్లు ఉన్న వాళ్లు ఇద్దరు ఉన్నారు. 36 నుంచి 45 మధ్య వయసు కలిపిన నేతలు 22 మంది ఉన్నారు. 46 నుంచి 60 ఏళ్ల వయసు ఉన్న వాళ్లు 55 మందికి చోటు దొరికింది. 60 ఏళ్లకు పైబడిన వాళ్ల సంఖ్య 20గా ఉంది. అలాగే 13 మంది మహిళలకు చోటు కల్పించారు. ఈ జాబితాలో పీజీలు చదివిన వారు 28 మంది ఉంటే… డిగ్రీ చదివిన వాళ్లు 50 మంది ఉన్నారు. డాక్టర్లు ముగ్గురు, పీహెచ్‌డీలు చేసిన వాళ్లు ఇద్దరు. ఒకరు ఐఏఎస్ ఆఫీసర్ ఉన్నారు. ఇలా అందరికి సమానంగా ఛాన్స్ ఇచ్చి ఆకట్టుకున్నారు చంద్రబాబు.
We’re now on WhatsApp. Click to Join.
జాబితాను ప్రకటించిన అనంతరం మీడియాతో చంద్రబాబు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. 1 కోటి 10 లక్షల మంది నుంచి అభిప్రాయ సేకరణ జరిపామని , టీడీపీ (TDP)లో ఇంత పెద్ద లిస్ట్ ఇవ్వడం ఇదే మొదటిసారి అని పేర్కొన్నారు. విన్నింగ్ హార్స్‌లను , పార్టీ అంటే కమిట్మెంట్ ఉన్న వాళ్లకు కొంతమందికి ఇవ్వలేకపోయారన్నారు. వారందరినీ పిలిపించి మాట్లాడుతానన్నారు. వారందరికీ పార్టీ బాధ్యతలు ప్రస్తుతం అప్పగిస్తానని చంద్రబాబు వెల్లడించారు. అధికారంలోకి వచ్చిన వెంటనే టికెట్ కేటాయించని అభ్యర్థులందరికీ పదవులు కూడా ఇస్తామని చంద్రబాబు పేర్కొన్నారు. అందరి అభిప్రాయాలు తీసుకున్న తరువాత మాత్రమే అభ్యర్థులను ఎంపిక చేశానన్నారు. బీజేపీతో పొత్తు విషయం చర్చలు జరుగుతున్నాయన్నారు. త్వరలోనే కొలిక్కి వస్తాయన్నారు.
Read Also :janasena : జనసేనకు 24 సీట్లు మాత్రమే దక్కడంపై పవన్ కళ్యాణ్ క్లారిటీ