Site icon HashtagU Telugu

TDP Ganta : తెలుగుదేశం పార్టీలో `గంటా` లొల్లి, పోరాట‌యోధుల ప‌రాక్!

TDP Ganta

Ganta

తెలుగుదేశం పార్టీకి దూరంగా ఉన్న లీడ‌ర్లు ఇప్పుడిప్పుడు ఫ్రంట్ లైన్(TDP Ganta) లోకి వ‌స్తున్నారు. ఇప్ప‌టి వ‌ర‌కు పోరాడి జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి ప్ర‌భుత్వంతో ఇబ్బందులు ప‌డ్డ వాళ్లు వెనుక వ‌రుస‌లోకి వెళ్లిపోతున్నారు. ఆ విష‌యాన్ని మాజీ మంత్రి అయ్య‌న్న‌పాత్రుడు(Ayyanna) కుండ‌బ‌ద్ధ‌లు కొట్టారు. గ‌తంలో మాదిరిగా కాదంటూ చంద్ర‌బాబు, లోకేష్ చెప్పిన దానికి భిన్నంగా య‌థాత‌దంగా పాత రాజ‌కీయం మొద‌లైయింది. అందుకు ప్ర‌త్య‌క్ష నిద‌ర్శ‌నం ఎమ్మెల్యే గంటా శ్రీనివాస‌రావు మ‌ళ్లీ టీడీపీలో యాక్టివ్ కావ‌డ‌మే.

గంటా శ్రీనివాస‌రావు మ‌ళ్లీ టీడీపీలో యాక్టివ్ (TDP Ganta)

పార్టీల‌ను తేలిగ్గా మార్చేసే జాబితాలో మొద‌టి వ‌రుస‌లో గంటా శ్రీనివాస‌రావు(TDP Ganta) ఉంటారు. ఒక్క వైసీపీ మిన‌హా ఆయ‌న ప్ర‌స్తుతం ఏపీలో ఉన్న పార్టీల కండువాల‌న్నీ క‌ప్పుకున్నారు. ఎప్పుడు ఏ పార్టీలో ఉంటారు? అనేది కూడా తెలియ‌దు. ఆయ‌న రాజ‌కీయ ప్ర‌యాణం 20ఏళ్ల క్రితం తెలుగుదేశంతో ప్రారంభ‌మై ప్రజారాజ్యం మీదుగా కాంగ్రెస్ వర‌కు అధికారింగా న‌డిచింది. అన‌ధికారికంగా జ‌న‌సేన‌, వైసీపీతోనూ చ‌ట్టాప‌ట్టాలేసుకుని తిరిగారు. గ‌త ఎన్నిక‌ల్లో టీడీపీ ఎమ్మెల్యేగా గెలుపొందిన ఆయ‌న తొలి నుంచి పార్టీకి దూరంగా ఉన్నారు. ఒకానొక స‌మ‌యంలో వైసీపీ కండువా క‌ప్పుకోవ‌డానికి సిద్ధ‌మ‌య్యారు. ఏపీ సీఎం జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి తీసుకున్న మూడు రాజ‌ధానుల నిర్ణ‌యానికి జై కొట్టారు. విశాఖ ప‌ట్నం జిల్లా టీడీపీ స‌మావేశంలో మూడు రాజ‌ధానుల‌కు మ‌ద్ధ‌తు తీర్మానం చేయించాల‌ని ప‌ట్టుబ‌ట్టారు.

 Also Read : CBN Power : అధికార మార్పుపై అంచ‌నా, చంద్ర‌బాబుతో IAS,IPSల ర‌హ‌స్య‌ భేటీ

2019 ఎన్నిక‌లు త‌రువాత ఇప్ప‌టి వ‌ర‌కు టీడీపీకి దూరంగా ఉంటూ చంద్ర‌బాబు నిర్ణ‌యాల‌ను ప‌లు సంద‌ర్భాల్లో త‌ప్పుబ‌ట్టారు. తెలుగుదేశం పార్టీకి రాజీనామా చేస్తూ లేఖ‌ను పంపారు. అయితే, ఆ లేఖ‌ను వెన‌క్కు తీసుకుని ఇప్పుడు యాక్టివ్ అవుతానంటూ ప్ర‌క‌టించ‌డం మూడున్నేరేళ్ల‌కు పైగా జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి స‌ర్కార్ మీద పోరాడుతోన్న వాళ్ల‌కు ఆగ్ర‌హం క‌లిగిస్తోంది. రాష్ట్రం విడిపోయిన త‌రువాత చంద్ర‌బాబు ప్ర‌భుత్వం ఏర్ప‌డింది. ఆ ప్ర‌భుత్వంలో మంత్రిగా గంటా శ్రీనివాస‌రావుకు అవ‌కాశం ల‌భించింది. ఆ స‌మ‌యంలో గంటా శ్రీనివాస‌రావు విశాఖ కేంద్రంగా చేసిన భూ కుంభ‌కోణాన్ని టీడీపీలోని వాళ్లే బ‌య‌ట పెట్టారు. ప్ర‌తిగా అయ్య‌న్న పాత్రుడు(Ayyanna) భూ దందాలంటూ గంటా శ్రీనివాస‌రావు మీడియాకు ఎక్కారు. ఫ‌లితంగా ఇద్ద‌రి భూ కుంభ‌కోణాల మీద ఆనాడు సిట్ విచార‌ణ చేయ‌డం జ‌రిగింది. ఇప్ప‌టికీ ఆ కేసు న‌డుస్తోంది.

తెలుగుదేశం పార్టీకి రాజీనామా చేస్తూ లేఖ‌

వ్యాపార‌వేత్త‌గా పేరున్న గంటా శ్రీనివాసరావు ప‌లు బ్యాంకుల‌కు రుణాల‌ను ఎగ‌వేశారు. అందుకు సంబంధించి నాన్ బెయిల‌బుల్ వారెంట్ల‌ను కూడా అందుకున్నారు. ప‌లువురు ప్రైవేటు వ్య‌క్తుల‌ను మోసం చేశాడ‌ని ఆయ‌న మీద ఆరోప‌ణ‌లు అనేకం. పైగా ఇప్ప‌టి వ‌ర‌కు జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి ప్ర‌భుత్వానికి తెర వెనుక మ‌ద్ధ‌తు ప‌లుతూ వ‌చ్చిన లీడ‌ర్ ఆయ‌న‌. ఇప్పుడు ఆయ‌న్ను తిరిగి టీడీపీ అధిష్టానం నెత్తిన పెట్టుకుంటే చంద్ర‌బాబు మార‌లేద‌నే సంకేతం వెళుతుంది. అంతిమంగా పాత రాజ‌కీయం మాత్ర‌మే టీడీపీ న‌డుపుతుంద‌న్న అప‌వాదు వ‌స్తుంది. ఫ‌లితంగా మార్పు కోరుకుంటోన్న క్యాడ‌ర్ నిరుత్సాహ ప‌డే ప్ర‌మాదం లేక‌పోలేదు. ఇదే విష‌యాన్ని మాజీ మంత్రి అయ్య‌న్న పాత్రుడు కూడా చెబుతున్నారు. ఇప్ప‌టి వ‌ర‌కు మూల‌నున్న వాళ్లు టీడీపీకి మ‌ళ్లీ ద‌గ్గ‌ర‌కావ‌డం ఏమిట‌ని ప్ర‌శ్నిస్తున్నారు. వాళ్లిద్ద‌రి మ‌ధ్యా గ‌తంలో న‌డిచిన ప్ర‌చ్ఛ‌న్న‌యుద్ధం ఇప్పుడు ప్ర‌త్య‌క్ష యుద్ధంగా మారింది.

Also Read : CBN-175 : పొత్తు కుత‌కుత‌! జ‌న‌సేన‌కు చంద్ర‌బాబు స్టేట్ మెంట్ క‌ల‌వ‌రం!