తుని మున్సిపాలిటీ (Tuni Municipality) వైస్ ఛైర్మన్ పదవి ఎన్నిక ఇటీవల తీవ్ర రాజకీయ దుమారం సృష్టించింది. ఈ ఎన్నిక మూడుసార్లు వాయిదా పడిన తర్వాత నాలుగోసారిగా ఫిబ్రవరి 18న రద్దయ్యిన సందర్భంగా ఎన్నికల కమిషన్ తదుపరి తేదీని నిర్ణయించనున్నట్లు జిల్లా జాయింట్ కలెక్టర్ తెలిపారు. వైస్ ఛైర్మన్ ఎన్నికకు టీడీపీ కౌన్సిలర్లు ప్రతి సమావేశంలో హాజరయ్యేవారు, కానీ ఓటమి భయంతో వైసీపీ కౌన్సిలర్లను పార్టీ నేతలు రహస్య ప్రదేశాల్లో దాచిపెట్టారని ఆరోపణలు ఉన్నాయి.
LRS : లక్ష పై చిలుకు ఎల్‌ఆర్ఎస్ దరఖాస్తులు.. 500 కోట్ల ఆదాయం.. ఎక్కడ ఎంతంటే..?
ఇది కూడా టీడీపీ గెలుస్తుందనే భయంతో 17 మంది వైసీపీ కౌన్సిలర్లను నిర్బంధించారనే ప్రచారం జరిగింది. ఇదంతా మాజీ మంత్రి దాడిశెట్టి రాజా కనుసన్నుల్లోనే జరిగిందని విమర్శలు వచ్చాయి. వైస్ ఛైర్మన్ ఎన్నికకు కనీసం 15 మంది కౌన్సిలర్లు అవసరమయ్యుండగా, తుని చైర్‌పర్సన్ పదవికి సుధారాణి రాజీనామా చేసి షాక్ ఇచ్చింది. ఈ షాక్ లో ఉండగానే వైసీపీకి మరో భారీ షాక్ తగిలింది. తునిలో వైసీపీకి చెందిన ఐదుగురు కౌన్సిలర్లు రాజీనామా చేయడమే కాదు యనమల సమక్షంలో టీడీపీలో చేరారు. దీంతో మొత్తం 28 మంది కౌన్సిలర్లలో ఇప్పటికే 15 మంది టీడీపీలో చేరడంతో, తుని మున్సిపాలిటీలో త్వరలో టీడీపీ కైవసం అవ్వడం అనివార్యమైంది.