TDP Fight : జ‌గ‌న్ పాల‌న‌పై టీడీపీ `గెరిల్లా` ఫైట్‌

గెరిల్లా (TDP Fight) ఆందోళ‌న‌లు చేయ‌డానికి టీడీపీ సిద్ధ‌మ‌వుతోంది. ఆ విష‌యాన్ని ఆ పార్టీ లీడ‌ర్ కోటంరెడ్డి శ్రీథ‌ర్ రెడ్డి బ‌య‌ట‌పెట్టారు.

  • Written By:
  • Publish Date - May 23, 2023 / 04:01 PM IST

గెరిల్లా (TDP Fight) ఆందోళ‌న‌లు చేయ‌డానికి టీడీపీ సిద్ధ‌మ‌వుతోంది. ఆ విష‌యాన్ని ఆ పార్టీ లీడ‌ర్ కోటంరెడ్డి శ్రీథ‌ర్ రెడ్డి (Kotamreddy Sridhar Reddy) బ‌య‌ట‌పెట్టారు. అణ‌చివేత‌లు, అక్ర‌మాలు, అన్యాయాల‌కు వ్య‌తిరేకంగా గెరిల్లా త‌ర‌హా ఫైట్ త‌ప్ప‌ద‌ని టీడీపీ భావిస్తోంది. ప్ర‌జా ఉద్య‌మం రావాల‌ని చంద్ర‌బాబు ఇటీవ‌ల ప‌లుమార్లు పిలుపునిచ్చారు. ఆ క్ర‌మంలో ఉద్యోగులు, ఉపాధ్యాయులు, అంగ‌న్వాడీ వ‌ర్క‌ర్లు రోడ్ల మీద‌కు వ‌చ్చారు. రైతులు బ‌య‌ట‌కు రావాల‌ని ఇటీవ‌ల గోదావ‌రి జిల్లా ప‌ర్య‌ట‌న‌కు వెళ్లిన చంద్ర‌బాబు(chandrababu) పిలుపునిచ్చారు. ప్ర‌స్తుతం ఉన్న సైకో ప్ర‌భుత్వాన్ని ఎదుర్కోవాలంటే అంద‌రూ ఐక్యంగా ప్ర‌జా ఉద్య‌మం చేయాల‌ని ఆయ‌న భావిస్తున్నారు. ఒక‌డుగు ముందుకేసి గెరిల్లా ఆందోళ‌న‌లు భ‌విష్య‌త్ లో ఉంటాయ‌ని ఆ పార్టీ లీడ‌ర్ కోటంరెడ్డి వ్యాఖ్యానించ‌డం చ‌ర్చ‌నీయాంశం అయింది.

గెరిల్లా  ఆందోళ‌న‌లు చేయ‌డానికి టీడీపీ (TDP Fight)

గెరిలా ఫైట్ లేదా వార్ అనేది బ్రిటీష్ కాలం నుంచి బాగా వింటున్నాం. పూర్వ‌కాలం నుంచి ఈ త‌ర‌హా ఫైట్ బ‌లంగా ఉండేది. సాధార‌ణంగా గెరిల్లా వార్‌ఫేర్ అనేది క్రమరహిత యుద్ధం. దీనిలో పారామిలిటరీ సిబ్బంది , సాయుధ పౌరులు , ఆకస్మిక దాడులు , విధ్వంసం , దాడులు ఇలా చిన్నపాటి యుద్ధంను త‌ల‌పించే దాన్ని గెరిల్లా ఫైట్ కింద భావిస్తుంటారు. హిట్-అండ్-రన్ వ్యూహాలు కూడా దీనిలో ఉంటాయి. 19వ శతాబ్దంలో ద్వీపకల్ప యుద్ధంతో పాటు గెరిల్లా యుద్ధం వ్యూహాత్మక పద్ధతులు వాడుక‌లో ఉన్నాయి. గెరిల్లా యుద్ధం చరిత్రను గ‌మ‌నిస్తే వివిధ వ‌ర్గాలు చేసిన‌ట్టు తెలుస్తోంది. విప్లవాత్మక ఉద్యమాలు ప్రజా ప్రతిఘటనతో ముడిపడి ఉంది. ఇప్పుడు ఏపీలో ప్ర‌జా ప్ర‌తిఘ‌ట‌న గెరిల్లా (TDP Fight) ఆందోళ‌న‌ల‌కు దారితీసేలా ఉంద‌ని టీడీపీ లీడ‌ర్ కోటంరెడ్డి భావ‌న‌.

ప్ర‌జాప్ర‌తిఘ‌ట‌న క‌నిపిస్తుంద‌ని గ్ర‌హించిన టీడీపీ

ఏపీ సీఎంగా జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి(Jaganmohan Reddy)  బాధ్య‌త‌లు స్వీక‌రించిన త‌రువాత టీడీపీ సోషల్ మీడియా మీద విరుచుకుప‌డ్డారు. ఆ త‌రువాత మాజీ మంత్రులు, ఎమ్మెల్యేల అరెస్ట్ ల‌తో ప్ర‌త్య‌ర్థి పార్టీల‌కు టెర్ర‌ర్ క్రియేట్ చేశారు. సోష‌ల్ మీడియాలో రీ పోస్ట్ చేసిన 70ఏళ్ల రంగ‌నాయ‌క‌మ్మ నుంచి డాక్ట‌ర్ సుధాక‌ర్ తో పాటు ప‌లువుర్ని ఏపీ సీఐడీ అదుపులోకి తీసుకొని విచార‌ణ చేసింది. తాజాగా రామోజీరావును సీఐడీ విచార‌ణ చేసింది. ఇప్పుడు చంద్ర‌బాబును స్కిల్ డ‌వెల‌ప్మెంట్ అక్ర‌మాల‌పై విచార‌ణ చేస్తామ‌ని చెబుతోంది. జ‌డ్జిల నుంచి విలేక‌రుల వ‌ర‌కు అన్నీ వ్య‌వ‌స్థ‌ల్లోని వాళ్ల‌ను సోష‌ల్ మీడియా వేదిక‌గా టార్గెట్ చేయ‌డం జ‌రిగింది. అస‌హ‌నం, నిరుద్యోగం పెరుగుతోన్న క్ర‌మంలో చంద్ర‌బాబు(Chandrababu) స‌భ‌ల‌కు జ‌నం పెద్ద ఎత్తున త‌ర‌లి వ‌స్తున్నారు. అయిన‌ప్ప‌టికీ జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి త‌న పంథాను మార్చుకోవ‌డంలేదు. దీంతో గెరిల్లా(TDP Fight) త‌ర‌హా ఆందోళ‌న త‌ప్ప‌ద‌ని విప‌క్షాలు భావిస్తున్నాయి.

Also Read : AP Trend : BJP కి షాక్‌,కామ్రేడ్ల‌తో TDP,JSP కూట‌మి?

సొంత పార్టీలోని ఎమ్మెల్యేలు, ఎంపీలు కూడా అస‌హ‌నంగా ఉన్నారు. ఇప్ప‌టికే రెండేళ్లుగా ర‌ఘురామ‌క్రిష్ణంరాజు సోష‌ల్ మీడియా వేదిక‌గా జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి పాల‌న‌కు వ్య‌తిరేకంగా పోరాడుతున్నారు. న్యాయ‌వ్య‌వ‌స్థ‌ల్లోనూ ఫైట్ చేస్తున్నారు. ఇప్ప‌టికే కొంద‌రు ఎమ్మెల్యేలు బ‌య‌ట‌కు వెళ్లారు. మ‌రికొంద‌రు పార్టీని వీడేందుకు సిద్ధ‌మ‌వుతున్నారు. ఇంకో వైపు మాజీ మంత్రి వివేకానంద‌రెడ్డి హ‌త్య కేసు విచార‌ణ తాడేప‌ల్లి కోట వైపు చూస్తోంది. ఇలాంటి ప‌రిస్థితుల్లో జ‌నం విసుగెత్తిపోయార‌ని తెలుస్తోంది. ప్ర‌జాప్ర‌తిఘ‌ట‌న క‌నిపిస్తుంద‌ని గ్ర‌హించిన టీడీపీ భ‌విష్య‌త్ లో గెరిల్లా(TDP Fight) ఆందోళ‌న‌లు త‌ప్ప‌వ‌ని భావిస్తోంది.

Also Read : Delhi CBN : చంద్ర‌బాబుపై NDA, UPA `హాట్ లైన్ `ఆప‌రేష‌న్‌