Site icon HashtagU Telugu

TDP: రాయలసీమలో పోస్ట్ పోల్ సర్వేలో టీడీపీ ఆధిపత్యం!!

Ap Politics (1)

Ap Politics (1)

ఏపీలో సార్వత్రిక ఎన్నికలు ముగిసి 10 రోజులు అవుతోంది. ఫలితాల కోసం జూన్ 4 వరకు ఆగాల్సిందే. అయితే.. ప్ర‌స్తుతం ఏపీలో ప‌రిణామాలు ఏంట‌ని ప్ర‌జ‌లు ఉత్కంఠగా ఎదురు చూస్తున్నారు. ఏపీలో పలు నియోజకవర్గాలపై ఆసక్తి పెరుగుతోంది. అక్కడ గెలుపు కంటే.. మెజారిటీపైనే దృష్టి సారిస్తున్నారు. ఎందకంటే.. ఇప్పటికే అక్కడ టీడీపీ కూటమి గెలుపు ఖాయమని అంటున్నారు నిపుణులు. అయితే.. దేశవ్యాప్తంగా సార్వత్రిక ఎన్నికలకు చివరి రోజుగా జూన్ 1వ తేదీ వరకు భారత ఎన్నికల సంఘం ఎగ్జిట్ పోల్స్‌ను నిషేధించింది. ఆంధ్రప్రదేశ్‌లో మే 13న ఎన్నికలు పూర్తి కాగా, జూన్ 4న ఫలితాలు వెలువడనున్నాయి. ఎగ్జిట్ పోల్స్ పై నిషేధం ఉన్నప్పటికీ కొన్ని సర్వే సంస్థలు రాష్ట్రంలో పోస్ట్ పోల్ సర్వేలు నిర్వహించాయి.

We’re now on WhatsApp. Click to Join.

తాజాగా రాయలసీమ ప్రాంతంలో ఓ ప్రైవేట్ సంస్థ పోస్ట్ పోల్ సర్వే ఫలితాలను విడుదల చేసి ఆశ్చర్యకరమైన ఫలితాలను వెల్లడించింది. ఈ ప్రాంతంలో అధికారంలో ఉన్న వైఎస్సార్‌సీపీపై టీడీపీ కూటమి ఆధిక్యత కనబరుస్తున్నట్లు సర్వేలో తేలింది.
సర్వే ప్రకారం:

టీడీపీ పొత్తు: చిత్తూరు, హిందూపురం, అనంతపురం, తిరుపతి.

వైఎస్‌ఆర్‌సీపీ: కడప, కర్నూలు, నంద్యాల, రాజంపేట.

 

అసెంబ్లీ స్థానాలకు సంబంధించి సర్వే ఫలితాలు ఇలా సూచిస్తున్నాయి.

Read Also : Hyd Real Estate : విలాసవంతమైన ఇళ్లపైనే ఆసక్తి చూపుతున్న జనాలు..!