వైసీపీ ప్రభుత్వం రానున్న ఎన్నికల్లో దొంగ ఓట్లతో గెలవాలని చేస్తున్న అక్రమాలపై రాష్ట్ర ఎన్నికల కమిషనర్ కు టీడీపీ రాష్ట్ర అధ్యక్షులు కింజరాపు అచ్చెన్నాయుడు ఫిర్యాదు చేశారు. వైసీపీ దొంగ ఓట్ల వ్యవహారాన్ని పూర్తి వివరాలతో ఎన్నికల కమిషనర్ కు వినతిపత్రం ద్వారా వివరించారు. రాష్ట్రంలో ప్రజాస్వామ్యయుతంగా ఎన్నికలు జరిగేలా చూడాలని కమిషనర్ ను కోరారు. రాష్ట్రంలో వైసీపీ ఆవిర్భించాక, జగన్మోహన్ రెడ్డి వచ్చాక ఒక్క ఎలక్షన్ కూడా ప్రజా ఆమోదంతో గెలిచిన సందర్భాలు లేవని అచ్చెన్నాయుడు పేర్కొన్నారు. ఎప్పుడూ మేనేజ్ చేసి గెలవడం జగన్ కు అలవాటైందని ఇందులో భాగంగా గ్రామపంచాయతీ ఎన్నికలు, ప్రతి ఎన్నికల్లోనూ అదే విధంగా గెలిచారని అచ్చెన్నాయుడు ఆరోపించారు. రానున్న కాలంలో అయినా ఎన్నికలు ప్రజాస్వామ్యబద్ధంగా జరగాలని టీడీపీ భావిస్తోందని.. రాష్ట్రంలో ఓట్ల దొంగలు పడ్డారని ఎద్దేవా చేశారు.
We’re now on WhatsApp. Click to Join.
దేశంలో ఎక్కడా లేని విధంగా ఓట్ల దొంగలు రాష్ట్రంలో కొత్త వ్యవస్థను ఏర్పాటు చేసుకున్నారని తెలిపారు. ఆ వ్యవస్థను ఉపయోగించి ప్రతిపక్షాల ఓట్లను తొలగిస్తున్నారని.. వారికి అనుకూలంగా వున్నవారి పేర్లను బూత్ లలో చేర్చి అక్రమంగా గెలవాలని చూస్తున్నారని అచ్చెన్నాయుడు ఆరోపించారు. జరుగుతున్న ఈ తతంగాన్ని స్టేట్ ఎలక్షన్ కమిషన్ దృష్టికి తీసుకెళ్లామని… గతంలో కూడా చంద్రబాబు నాయుడు ఢిల్లీ వెళ్లి సెంట్రల్ ఎన్నికల కమీషన్ కి కూడా ఫిర్యాదు చేశారని గుర్తు చేశారు. వాలంటీర్, సచివాలయ వ్యవస్థలను ఉపయోగించి ఎన్నికల విధానాన్ని భ్రష్టు పట్టించారని మండిపడ్డారు. వీటన్నింటిని రాష్ట్ర ఎన్నికల కమిషన్ దృష్టికి తీసుకెళ్లామని.. పర్చూరులో జరిగిన సంఘటన పిన్ పాయింట్ గా కంప్లైంట్ ఇస్తే వెంటనే చర్యలు తీసుకున్నారని తెలిపారు.
Also Read: Angallu Case: అంగల్లు కేసులో చంద్రబాబు బెయిల్ పిటిషన్ రిజర్వ్