Site icon HashtagU Telugu

Chandrababu: జగన్ ప్రోత్సాహంతోనే హత్యా రాజకీయాలు

Check your Vote

Jagan chandrababu naidu

పల్నాడు జిల్లా, రొంపిచర్ల మండల తెలుగుదేశం అధ్యక్షుడు వెన్నా బాల కోటిరెడ్డి పై వైసీపీ నేతలు చేసిన హత్యాయత్నాన్ని తీవ్రంగా ఖండిస్తున్నట్టు టీడీపీ అధినేత నారా చంద్రబాబునాయుడు పేర్కొన్నారు. ఉదయాన్నే వాకింగ్ కు వెళ్లిన వ్యక్తిపై గొడ్డళ్ళతో దాడిచేశారంటే ఏపీలో శాంతిభద్రతల రక్షణ వ్యవస్థలు ఏం చేస్తున్నాయి? నిద్రపోతున్నాయా?  అని పోలీసుల తీరును ఆయన ప్రశ్నించారు. తెలుగుదేశం కార్యకర్తలు, నేతల హత్యలకు జగన్ రెడ్డి ప్రోత్సాహం ఉంది కాబట్టే వైసీపీ రౌడీలు ఇలా రెచ్చిపోతున్నారని బాబు మండిపడ్డారు.

పోలీసులను ఈ విషయంలో కల్పించుకోవద్దని జగన్ రెడ్డి ఆదేశాలిచ్చారా? లేకపోతే ఇలాంటివి జరుగుతుంటే చేతులు ముడుచుకుని కూర్చుంటున్నారని చంద్రబాబు ప్రశ్నించారు. తెలుగుదేశం వైవు నుంచి కూడా ప్రతీకార చర్యలు ఉంటే, ఎవరు బాధ్యత తీసుకుంటారని, జగన్ తీసుకుంటారా? లేక పోలీసులా? అని అని చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. తీవ్రగాయాలతో ఆసుపత్రిలో చావుబతుకుల మధ్య ఉన్న బాలాకోటిరెడ్డికి ఏం  జరిగినా దానికి జగన్ రెడ్డే సమాధానం చెప్పాలని చంద్రబాబు నాయుడు డిమాండ్ చేశారు.