YS Vijayamma : జ‌గ‌న్ కు `డ‌బుల్ జ‌ల‌క్` ఇచ్చిన బాబు

తెలుగుదేశం పార్టీ అధినేత చంద్ర‌బాబు వ్యూహాలు, ఆయ‌న రాజ‌కీయ చ‌తుర‌తను ఇప్పుడిప్పుడే వైసీపీ రుచిచూస్తోంది.

  • Written By:
  • Updated On - July 15, 2022 / 01:52 PM IST

తెలుగుదేశం పార్టీ అధినేత చంద్ర‌బాబు వ్యూహాలు, ఆయ‌న రాజ‌కీయ చ‌తుర‌తను ఇప్పుడిప్పుడే వైసీపీ రుచిచూస్తోంది. ఎన్డీయే రాష్ట్ర‌ప‌తి అభ్య‌ర్థి ముర్ము టీడీపీ మ‌ద్ధ‌తు కోర‌డం తాజాగా చంద్ర‌బాబు నాయుడు సాధించిన రాజ‌కీయ విజ‌యం. దాన్ని జీర్ణించుకోలేని ప‌రిస్థితిలో ఉన్న వైసీపీకి వ‌లంటీర్లపై ఆంక్ష‌లు విధిస్తూ కేంద్ర ఎన్నిక‌ల సంఘం నిర్ణ‌యం తీసుకోవ‌డం ఆయోమ‌యానికి గురి చేసింది. ఇవ‌న్నీ చంద్ర‌బాబు తెర‌వెనుక చేసిన వ్యూహంలో భాగంగా జ‌రిగిన ప‌రిణామాలు. భ‌విష్య‌త్ లో ఇలాంటి షాక్ లు చాలా ఉంటాయ‌ని టీడీపీ చెబుతోంది.

ఏపీలో వాలంటీర్ల వ్య‌వ‌స్థ‌ను తీసుకొచ్చిన జగన్ మోహన్ రెడ్డి వాళ్ల‌కు ప్ర‌భుత్వ ఖ‌జానా నుంచి గౌర‌వ వేత‌నాలు అందిస్తున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా గ్రామ‌, వార్డు స‌చివాల‌యం కేంద్రాల్లో ప‌నిచేసే వాలంటీర్లు ఇక నుంచి ఎన్నిక‌లకు దూరంగా ఉండాలి. అంతేకాదు, ఏజెంట్లుగా, స్లిప్పులు ఇచ్చే కార్య‌క‌ర్త‌ల మాదిరిగా వ్య‌వ‌హ‌రించ‌డానికి లేకుండా ఏపీ ఎన్నిక‌ల అధికారి అనిల్ కుమార్ సింఘాల్ అధికారిక ఉత్త‌ర్వులు ఇవ్వ‌డం గ‌మ‌నార్హం. వాళ్ల ద్వారా వ‌చ్చే ఎన్నిక‌ల‌ను నిర్వ‌హించాల‌ని ప‌క్కా స్కెచ్ వేసింది వైసీపీ. ఆ ధైర్యంతోనే వాళ్ల‌ను ప్రోత్స‌హిస్తూ వ‌చ్చింది. అవార్డుల‌ను కూడా బ‌హూక‌రిస్తూ ఇటీవ‌ల జగన్ మోహన్ రెడ్డి బ‌హిరంగ స‌భ‌ల్ని నిర్వ‌హించారు. ఏపీ ప్ర‌జా వ్య‌వ‌స్థ‌ను వాలంటీర్ల ద్వారా మోనిట‌ర్ చేయ‌డానికి జగన్ మోహన్ రెడ్డి స్కెచ్ వేశారు.

ఏపీలోని ప్ర‌తి 50 ఇళ్ల‌కు ఒక వ‌లంటీర్ ను ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి నియ‌మించారు. వాళ్ల ద్వారా సంక్షేమ ప‌థ‌కాల‌ను అందిస్తున్నారు. వాళ్లిచ్చే స‌మాచారం ఆధారంగా అర్హ‌త‌ల‌ను నిర్థారిస్తున్నారు. స్థానికంగా ఉండే ఎమ్మెల్యేలు, జ‌డ్పీటీసీలు, ఎంపీటీసీల కంటే వాలంటీర్ల వ్య‌వ‌స్థ బ‌లంగా త‌యారు అయింది. ప్ర‌భుత్వ సంక్షేమ ప‌థ‌కాలు కావాలంటే, వాలంటీర్ల‌ను ప్ర‌స‌స్నం చేసుకునే సంస్కృతి ప్ర‌బ‌లింది. దీంతో వాలంటీర్ల‌ను కాద‌ని నిరుపేద‌, పేద‌, మ‌ధ్య త‌ర‌గ‌తి కుటుంబాలు ఏమీ చేయ‌లేని స్థితికి వ‌చ్చారు. ఆయా వ‌ర్గాల‌పై వాలంటీర్ల ప్ర‌భావం బాగా ఉంది. అందుకే, వాళ్ల ద్వారా ఓట్ల‌ను రాబ‌ట్టాల‌ని జ‌గ‌న్ స్కెచ్ వేశారు.

స్థానిక సంస్థ‌ల ఎన్నిక‌లు, తిరుప‌తి, బ‌ద్వేలు, ఆత్మ‌కూరు ఉప ఎన్నిక‌ల్లోనూ వాలంటీర్ల వ్య‌వ‌స్థ చాలా చురుగ్గా ప‌నిచేసింది. ఓట‌ర్ల‌కు స్లిప్పులు అందించ‌డం, వాళ్ల‌ను కొనుగోలు చేయ‌డం, పోలింగ్ కేంద్రాల వ‌ద్ద వాళ్ల ప్రాబ‌ల్యం చూపించ‌డం త‌దిత‌రాల‌ను టీడీపీ గ‌మ‌నించింది. వాళ్ల వ్య‌వ‌హారాన్ని వీడియోలు, వాయిస్ రికార్డుల‌తో స‌హా ఎన్నిక‌ల సంఘానికి అంద‌చేసింది. అంతేకాదు, వాలంటీర్లు అంద‌రూ వైసీపీ కార్య‌క‌ర్త‌లంటూ తొలి నుంచి ప్ర‌క‌టించిన ఎంపీ విజ‌య‌సాయిరెడ్డి, హోంశాఖ మంత్రి వ‌నితి ఇత‌ర లీడ‌ర్ల వీడియో, ఆడియోల‌ను ఈసీకి అందించారు. వాటిని ప‌రిశీలించిన త‌రువాత ఎన్నిక‌ల సంఘం సంచ‌ల‌న నిర్ణ‌యం తీసుకుంది. ఫ‌లితంగా జగన్ మోహన్ రెడ్డి ఎన్నిక‌ల వ్యూహం ఆదిలోనే కుప్ప‌కూలేలా చంద్ర‌బాబు ర‌చించిన వ్యూహం ర‌క్తిక‌ట్టింది. వైసీపీ గౌర‌వాధ్య‌క్షురాలుగా తొల‌గిన త‌రువాత ఆ పార్టీకి త‌గిన రెండో షాక్ గా చెప్పొచ్చు.