Chandrababu : గుడివాడ‌పై చంద్ర‌బాబు ఆప‌రేష‌న్, `కొడాలి`పై ఉమ ఫిక్స్ ?

స్వ‌ర్గీయ ఎన్టీఆర్ హ‌యాంలో కాంగ్రెస్ సీనియ‌ర్ లీడ‌ర్, మాజీ గ‌వ‌ర్న‌ర్ స్వ‌ర్గీయ రోశ‌య్య ను ఓడించ‌డానికి టీడీపీ స‌ర్వ‌శ‌క్తులు ఒడ్డింది.

  • Written By:
  • Publish Date - September 30, 2022 / 01:10 PM IST

స్వ‌ర్గీయ ఎన్టీఆర్ హ‌యాంలో కాంగ్రెస్ సీనియ‌ర్ లీడ‌ర్, మాజీ గ‌వ‌ర్న‌ర్ స్వ‌ర్గీయ రోశ‌య్య ను ఓడించ‌డానికి టీడీపీ స‌ర్వ‌శ‌క్తులు ఒడ్డింది. ఆ విష‌యం టీడీపీకి స‌న్నిహితంగా ఉండే వాళ్లకు బాగా తెలుసు. స‌రిగ్గా అలాంటి ప‌రిస్థితి ఇప్పుడు గుడివాడ ఎమ్మెల్యే, మాజీ మంత్రి కొడాలి వెంక‌టేశ్వ‌ర‌రావు అలియాస్ నాని విష‌యంలో తార‌స‌ప‌డుతోంది. ఈసారి కొడాలి అసెంబ్లీలోకి అడుగుపెట్ట‌కుండా ఆయ‌న్ను ఓడించేందుకు టీడీపీ చీఫ్ చంద్ర‌బాబు సీరియస్ గా వ్యూహాలు ర‌చిస్తున్నార‌ని తెలుస్తోంది.

గ‌త ఎన్నిక‌ల్లో దేవినేని నెహ్రూ కుమారుడు అవినాష్ కు టీడీపీ అవ‌కాశం ఇచ్చింది. కానీ, ఆయ‌న ప్ర‌స్తుతం వైసీపీలోకి వెళ్లారు. దీంతో గుడివాడ నియోక‌వ‌ర్గం టీడీపీ మీద ప‌ట్టుసాధించే స‌మ‌ర్థ లీడ‌ర్ కోసం అన్వేషిస్తోంది. ప్ర‌స్తుతానికి రావి వెంక‌టేశ్వ‌ర‌రావు నియోజ‌క‌వ‌ర్గ ఇంచార్జిగా ఉన్నారు. అదే స‌మ‌యంలో ఆయ‌న‌కు సమాంత‌రంగా మాజీ మంత్రి పన్నిమనేని వేంకటేశ్వర రావు, పిన్నమేని బాబ్జీ రాజ‌కీయాలు న‌డుపుతున్నారు. ఆ ముగ్గురి మధ్యా ఆధిప‌త్య పోరు కొన‌సాగుతోంది. ఫ‌లితంగా టీడీపీ బ‌ల‌హీనం కావ‌డం కొడాలి నానికి క‌లిసొస్తోంది. అందుకే, చంద్ర‌బాబు ఈసారి మాస్ట‌ర్ ప్లాన్ వేస్తున్నారు. కొడాలిని ఓడించే అభ్యర్థిగా మాజీ మంత్రి దేవినేని ఉమామ‌హేశ్వ‌ర‌రావును ఎంపిక చేసుకున్న‌ట్టు తెలుస్తోంది.

గుడివాడ నియోజ‌క‌వ‌ర్గానికి దేవినేని కుటుంబానికి సంబంధాలు ఉన్నాయి. పైగా కొడాలి వ‌ర్సెస్ ఉమ మ‌ధ్య రాజ‌కీయ వైరం కృష్ణా జిల్లా రాజ‌కీయాల్లో హైలెట్ గా నిలుస్తోంది. ప్ర‌స్తుతం మైలవ‌రం ఇంచార్జిగా ఉమ ఉన్నారు. ఆయ‌న గతంలో నందిగామ నుంచి వరుస‌గా గెలుస్తూ వ‌చ్చారు. కానీ, నియోజ‌క‌వ‌ర్గాల పున‌ర్విభ‌జ‌నలో నందిగామ ఎస్సీ రిజ‌ర్వుడు కావ‌డంతో మైల‌వ‌రంకు షిఫ్ట్ అయ్యారు. గ‌త ఎన్నిక‌ల్లో మైల‌వ‌రం నుంచి ఓడిపోయారు. ఈసారి మైల‌వ‌రం ఒక ఎన్నారైకి కేటాయించ‌డం కోసం గుడివాడ నుంచి ఉమ ను పోటీకి దింపాల‌ని చంద్ర‌బాబు ఫిక్స్ అయిన‌ట్టు తెలుస్తోంది.

గుడివాడ ఎమ్మెల్యే కొడాలి నానిని ఓడించాల‌ని చంద్ర‌బాబు ప‌లుర‌కాల ఈక్వేష‌న్ల‌ను ప‌రిశీలిస్తున్నారు. తొలుత వంగ‌వీటి రాధాను అక్క‌డ నుంచి పోటీకి దింపాల‌ని యోచించారు. కానీ, సామాజిక స‌మీక‌ర‌ణాల న‌డుమ పున‌రాలోచ‌న‌లో ప‌డ్డార‌ట‌. ఒకానొక స‌మ‌యంలో హిందూపురం నుంచి లోకేష్ ను రంగంలోకి దింప‌డంతో పాటు బాల‌క్రిష్ణ‌ను గుడివాడ నుంచి పోటీ చేయించాల‌ని చ‌ర్చ జ‌రిగింది. కానీ, బాల‌య్య సానుకూలంగా స్పందించ‌క‌పోవ‌డంతో చివ‌ర‌కు దేవినేని ఉమామ‌హేశ్వ‌ర‌రావు స‌రైన అభ్య‌ర్థిగా టీడీపీ అధిష్టానం భావిస్తున్న‌ట్టు తెలుస్తోంది. ఆయ‌న్ను రంగంలోకి దింప‌డం ద్వారా గుడివాడ‌లోని టీడీపీ గ్రూపులు అన్నీ ఏక‌మై ఉమ‌కు క‌లిసి వ‌స్తాయ‌ని అంచ‌నా వేస్తున్నారు. గుడివాడ మీద చంద్ర‌బాబు చాణ‌క్యం ప‌నిచేస్తుందా? లేదా అనేది చూడాలి.