Site icon HashtagU Telugu

CBN-CEC : 28న ఢిల్లీకి చంద్రబాబు.. ఓట్ల తొలగింపుపై సీఈసీకి కంప్లైంట్

Check your Vote

Chandrababu Naidu meeting with Telangana TDP Leaders in Hyderabad NTR Trust Bhavan

CBN-CEC : ఆంధ్రప్రదేశ్ లో ఓట్ల తొలగింపు వ్యవహారంపై టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు కేంద్ర ఎన్నికల సంఘాని(CEC)కి ఫిర్యాదు చేయనున్నారు. ఇందుకోసం ఆయన  ఆగస్టు 28న ఢిల్లీకి వెళ్లనున్నారు. “ఓట్ల తొలగింపు ఘటనలు, పలు పార్టీల సానుభూతిపరుల దొంగ ఓట్లను జాబితాలో చేర్చడం, టీడీపీ అనుకూల ఓట్లను తొలగించడం వంటి అంశాలపై కేంద్ర ఎన్నికల సంఘానికి చంద్రబాబు కంప్లైంట్ చేసే అవకాశం ఉంది” అని పార్టీ వర్గాలు తెలిపాయి. వాలంటీర్ల ద్వారా ఓట్ల సమాచారాన్ని సేకరించడం ద్వారా ఏపీ ప్రభుత్వం అధికార దుర్వినియోగానికి పాల్పడుతోందనే అంశాన్ని కూడా ఎన్నికల సంఘం దృష్టికి చంద్రబాబు తీసుకెళ్తారని టీడీపీ నేతలు చెప్పారు.

Also read : Medak: అతిగా నిద్రపోతున్నారనే కారణంతో పిల్లలపై వేడినీళ్లు పోసిన తల్లి

ఓట్ల అక్రమాలపై ఉరవకొండ, పర్చూరు, విజయవాడ, విశాఖ తదితర ఘటలకు సంబంధించిన సాక్ష్యాలను చంద్రబాబు ఎలక్షన్ కమిషన్ కు (CBN-CEC) అందజేయనున్నారు. ఒక కుటుంబానికి చెందిన ఓట్లు ఒకే పోలింగ్‌ బూత్‌ పరిధిలోనే ఉండాలనే నిబంధన ఉన్నాఏపీ ప్రభుత్వం  పట్టించుకోవడం లేదని, ఉద్దేశపూర్వకంగానే అనేక చోట్లకు మార్చేస్తున్నారని టీడీపీ ఆరోపిస్తోంది.

ఎన్టీరామారావు స్మారకార్థం ప్రత్యేక నాణేలు 

టీడీపీ వ్యవస్థాపకుడు ఎన్టీరామారావు వందో జయంతి సందర్భంగా ఈ నెల 28న ఢిల్లీలో ఆయన స్మారకార్థం ప్రత్యేక నాణేలను విడుదల చేస్తున్నారు. ఈ ప్రోగ్రాంకు చంద్రబాబు హాజరయ్యే అవకాశాలు ఉన్నాయి. అదే రోజు కేంద్ర ఎన్నికల ప్రధానాధికారిని కలిసి ఫిర్యాదు చేసే ఛాన్స్ ఉంది. ఇప్పటికే అపాయింట్మెంట్‌ కోరుతూ ఎన్నికల కమిషన్‌కు చంద్రబాబు లేఖ పంపారు.