Site icon HashtagU Telugu

Chandrababu warns Jagan: కుప్పంలో హైటెన్షన్.. జగన్ పై చంద్రబాబు ఫైర్!

Chandrababu

Chandrababu

ఏపీ పాలిటిక్స్ (AP Politics) రసవత్తరంగా మారుతున్నాయి. సభలు, సమావేశాలపై ఏపీ ప్రభుత్వం విధించిన ఆంక్షల నేపథ్యంలో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) కుప్పం పర్యటన తీవ్ర ఉద్రిక్తతకు దారితీసింది. కుప్పం పర్యటనలో ఆంక్షలు, తన ప్రచార వాహనం ఇవ్వక పోవడం పై టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు మండిపడ్డారు. పోలీసుల తీరును తప్పుబడుతూ స్వయంగా బస్సుపైకి ఎక్కి ప్రజలను ఉద్దేశించి చంద్రబాబు నాయుడు ప్రసంగించారు.

రాజమహేంద్రవరంలో సీఎం జగన్‌ మీటింగ్‌ పెట్టలేదా? రోడ్‌షో చేయలేదా? అని నిలదీశారు. తన పర్యటనలను ఎందుకు అడ్డుకుంటున్నారని ప్రశ్నించారు. చిత్తూరు జిల్లా కుప్పం (Kuppam) నియోజకవర్గంలో టీడీపీ అధినేత చంద్రబాబు పర్యటనకు పోలీసులు అడుగడుగునా అడ్డంకులు సృష్టించారు. గుడిపల్లిలోని పార్టీ కార్యాలయానికి వెళ్లనివ్వకుండా అడ్డుకున్నారు. పోలీసుల వైఖరిని నిరసిస్తూ స్థానిక బస్టాండ్‌ సమీపంలో రోడ్డుపైనే ఆయన బైఠాయించారు. ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ సీఎం జగన్‌ పోలీసుల తీరుపై తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇతర ప్రాంతాల వాళ్లు గుడిపల్లికి రాకుండా మూడు మార్గాల్లో అడ్డుకోవడమేంటని మండిపడ్డారు.

‘‘పోలీసులూ..ఏంటీ బానిసత్వం. మీరు బానిసలుగా బతకొద్దు. చట్టప్రకారం మీ విధులు నిర్వర్తించండి. ఇక్కడి నుంచి నన్ను తిరిగి పంపాలని చూస్తున్నారు.. కానీ నేను వెళ్లను. మిమ్మల్నే ఇక్కడి నుంచి పంపిస్తా. మిమ్మల్నే కాదు. సైకో సీఎం, ఆయన పార్టీని శాశ్వతంగా భూస్థాపితం చేసే వరకు తెలుగు ప్రజల తరఫున పోరాడతా. నా గొంతు 5 కోట్ల మంది ప్రజలది. ఆ విషయాన్ని జగన్‌ (CM Jagan) గుర్తుపెట్టుకోవాలి. ప్రజాస్వామ్యంలో ఇలాంటి అరాచకాలకు తావులేదు.

నేను ప్రశ్నిస్తుంటే పోలీసు అధికారులు (Police Officers) పారిపోతారా? చట్టాన్ని అమలు చేయకుండా ఇష్టారీతిన వ్యవహరిస్తున్నారు. ప్రజలు తిరగబడితే ఏం చేయగలరు? పోలీసులు ఎక్కడుంటారు. ఎన్ని జైల్లు, పోలీస్‌స్టేషన్లు ఉన్నాయి? ఎంతమంది ప్రజలను వాటిలో పెట్టగలరు? జీవో నంబర్‌ 1 చట్టవిరుద్ధమైనది. రాజమహేంద్రవరంలో సీఎం జగన్‌ మీటింగ్‌ పెట్టలేదా? రోడ్‌షో చేయలేదా? మీ పార్టీ నేతలు రోడ్డు షోలు నిర్వహించలేదా? జగన్‌.. సమాధానం చెప్పండి. నీకో రూలు.. నాకో రూలా? పోలీసులు అన్ని పార్టీలను సమానంగా చూస్తే ప్రజలు సహకరిస్తారు. చట్టాన్ని ఎవరు ఉల్లంఘించినా వారంతా దోషులే’’ అని చంద్రబాబు (Chandrababu Naidu) ఆగ్రహం వ్యక్తం చేశారు.

Also Read: AAP Vs BJP: ఢిల్లీ మేయర్ ఎన్నిక రసాభాస.. తన్నుకున్న బీజేపీ, ఆమ్ నేతలు!