Site icon HashtagU Telugu

AP Boat Accident: చంద్రబాబు పర్యటనలో పడవ ప్రమాదం.. నెట్టింట్లో వీడియో వైరల్?

Chandra Babu Naidu

Chandra Babu Naidu

తాజాగా టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు పర్యటనలో ఊహించని అపశృతి ఒకటి చోటు చేసుకుంది. కాగా గత కొద్దిరోజులుగా కోనసీమ జిల్లాలో కుడుస్తున్న వర్షాల వల్ల ఊర్లు నదులను తలపిస్తూ ఉండడంతో అక్కడి ప్రజలను పరామర్శించడానికి వెళ్లారు టిడిపి అధినేత చంద్రబాబు నాయుడు.. ఈ క్రమంలోనే రాజోలు మండలం సోంపల్లి రేవులో లాంచీ దిగుతుండగా నీటిలో అకస్మత్తుగా అందరూ నీటిలో పడిపోయారు.

ప్రమాద సమయంలో లాంచీలో చంద్రబాబుతో పాటు 15 మంది టీడీపీ నేతలతో పాటు మాజీ మంత్రి దేవినేని ఉమా, పలువురు మాజీ ఎమ్మెల్యేలు, పోలీసు అధికారులు అందరూ నీటిలో పడిపోయారు.కానీ ఊహించని ఆ పెను ప్రమాదం నుంచి అందరూ సురక్షితంగా బయటపడ్డారు. అయితే మానేపల్లి వరదల సమయంలో చనిపోయిన ఆ మృతుల కుటుంబాలను పరామర్శించేందుకు వెళుతుండగా ఘటన చోటు చేసుకుంది.

ప‌శ్చిమ గోదావ‌రి జిల్లా సోంప‌ల్లి వ‌ద్ద చోటుచేసుకున్న ఈ ప్ర‌మాదంలో టీడీపీ సీనియ‌ర్ నేత దేవినేని ఉమామ‌హేశ్వ‌ర‌రావు, ఉండి ఎమ్మెల్యే రామ‌రాజు, త‌ణుకు మాజీ ఎమ్మెల్యే రాధాకృష్ణ‌తో పాటు పార్టీకి చెందిన మ‌రో నేత స‌త్య‌నారాయ‌ణ గోదావ‌రి న‌దిలో ప‌డిపోయారు. అయితే చంద్రబాబు ఎలాంటి ప్రమాదానికి గురి కాలేదు.

దీంతో పార్టీ శ్రేణులు ఊపిరి పీల్చుకున్నాయి. అయితే ఈ ప్రమాదం పై వెంటనే స్పందించిన మ‌త్స్య‌కారులు టిడిపి నేతలను సురక్షితంగా ఒడ్డుకు చేర్చారు. టీడీపీ అధినేత చంద్ర‌బాబు ప‌ర్య‌ట‌న‌లో భాగంగా సోంప‌ల్లి చేరుకున్న సంద‌ర్భంగా టీడీపీ నేత‌లు ప్ర‌యాణిస్తున్న రెండు ప‌డ‌వ‌లు ప‌ర‌స్ప‌రం ఢీ కొన్నాయి. దీంతో ఓ వైపున‌కు ఒరిగిపోయిన ప‌డ‌వ‌లో ఉన్న టీడీపీ నేత‌లు గోదావ‌రిలో ప‌డిపోయారు. అయితే మ‌త్స్య‌కారులు వేగంగా స్పందించ‌డంతో ఎవ‌రికీ ఏమీ కాక‌పోవ‌డంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. ఇందుకు సంబంధించిన వీడియోలు ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

Exit mobile version