Chandrababu Health : ఏపీ స్కిల్ డెవలప్ మెంట్ కార్పొరేషన్ కేసులో అరెస్టయి రాజమండ్రి సెంట్రల్ జైలులో రిమాండ్ పై ఉన్న టీడీపీ చీఫ్ చంద్రబాబు ఆరోగ్యంపై జైలు అధికారులు హెల్త్ బులిటెన్ ను రిలీజ్ చేశారు. చంద్రబాబు ఆరోగ్యం నిలకడగానే ఉందని, ఆయన బరువు ప్రస్తుతం 67 కేజీలు ఉందని వెల్లడించారు. చంద్రబాబుకు బీపీ 140/80 గా, పల్స్ నిమిషానికి 70, రెస్పిరేటరీ రేటు నిమిషానికి 12 సార్లు ఉందని చెప్పారు. చంద్రబాబు యాక్టివ్ గా ఉన్నారని, ఫిజికల్ యాక్టివిటీలో ఎలాంటి సమస్య లేదని స్పష్టం చేశారు. కోర్టు ఆదేశాలతో చంద్రబాబు ఉండే బ్యారక్ లో టవర్ ఏసీ ఏర్పాటు చేసినట్లు పేర్కొన్నారు.
We’re now on WhatsApp. Click to Join.
జైలులో చంద్రబాబు డీహైడ్రేషన్ కు గురయ్యారని ఆయనతో ములాఖత్ అనంతరం కుటుంబసభ్యులు ఆందోళన వ్యక్తం చేశారు. ఆసుపత్రికి తరలించి చికిత్స ఇప్పించాలని పోలీసులను కోరారు. డీహైడ్రేషన్ కు గురయ్యాక చంద్రబాబు ఆరోగ్యం క్షీణిస్తోందని, గుండె సమస్య వచ్చే ప్రమాదం ఉందని కుటుంబసభ్యులతో పాటు టీడీపీ నేతలు, ఆయన తరఫు లాయర్లు ఆరోపిస్తున్నారు.
Also Read: Telangana: నల్గొండ పోలీస్ తనిఖీల్లో పట్టుబడ్డ రూ.3.04 కోట్లు
‘‘జైలులో ఉన్న చంద్రబాబుకు స్వల్ప అనారోగ్య సమస్యలు వస్తున్నాయి. ఛాతీ, చేతులు, వీపు, నడుము, గడ్డం తదితర భాగాల్లో చంద్రబాబుకు ఎర్రటి దద్దుర్లు, పొక్కులు ఏర్పడ్డాయి’’ అంటూ రాజమండ్రికి చెందిన జీజీహెచ్ చర్మ వైద్య నిపుణులు డాక్టర్ సూర్యనారాయణ, డాక్టర్ సీహెచ్.వి సునీత జైలు ఉన్నతాధికారులకు నివేదిక ఇచ్చారు. ‘‘రెండు అరచేతుల్లో పొక్కుల వల్ల దురద, శరీరమంతా తెల్లటి పొక్కులు, కొన్ని ప్రాంతాల్లో వేడి కురుపుల వల్ల చంద్రబాబు ఇబ్బంది పడుతున్నారు’’ అని ఆ రిపోర్టులో పేర్కొన్నారు. అయితే ప్రస్తుతం ఉన్న వాతావరణంలో ఎవరైనా డీహైడ్రేషన్ కు గురయ్యే అవకాశం ఉందని ఈ డాక్టర్లు శనివారం ప్రెస్ మీట్ లో (Chandrababu Health) చెప్పారు.