Chandrababu: చంద్ర‌బాబు `ఢిల్లీ టూర్` సంచ‌ల‌నం

మ‌రోసారి చంద్ర‌బాబు ఢిల్లీ టూర్ ఖ‌రారు కానుంది. ఆయ‌న వ‌చ్చే వారం ప్ర‌ధాని న‌రేంద్ర‌మోడీ, హోంశాఖ మంత్రి అమిత్ షా ను క‌లిసే అవ‌కాశం ఉంది. వా

  • Written By:
  • Updated On - August 19, 2022 / 01:13 PM IST

మ‌రోసారి చంద్ర‌బాబు ఢిల్లీ టూర్ ఖ‌రారు కానుంది. ఆయ‌న వ‌చ్చే వారం ప్ర‌ధాని న‌రేంద్ర‌మోడీ, హోంశాఖ మంత్రి అమిత్ షా ను క‌లిసే అవ‌కాశం ఉంది. వాళ్లిద్ద‌రితో భేటీ అయిన త‌రువాత ఏపీ, తెలంగాణ రాజ‌కీయాల‌పై ఒక క్లారిటీ రానుంది. మునుగోడు ఉప ఎన్నిక‌ల్లో చంద్ర‌బాబు వ్యూహాల‌ను తెర‌వెనుక ఉప‌యోగించుకోవాల‌ని ప్లాన్ చేస్తున్నారు. అంతేకాదు, చంద్ర‌బాబు భుజంపై రాజ‌కీయ తుపాకీ పెట్టి పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డిని జీరో చేయాల‌ని మాస్ట‌ర్ స్కెచ్ ఢిల్లీ కేంద్రంగా త‌యారైయింద‌ని టాక్‌. అందుకే ఆయ‌న టూర్ ప్ర‌చారం రాజ‌కీయ సంచ‌ల‌నంగా మారింది.

నాలుగేళ్ల త‌రువాత ప్ర‌ధాని న‌రేంద్ర మోడీ, చంద్ర‌బాబు రాష్ట్ర‌ప‌తి భ‌వ‌న్ వేదిక‌గా ఐదు నిమిషాల పాటు మాట్లాడుకున్నారు. ఆ 5 నిమిషాల‌కే ఏపీలోని అధికార పార్టీ వైసీపీ హైరానా ప‌డింది. తెర‌వెనుక స్నేహం చేస్తోన్న ఆ పార్టీ చంద్ర‌బాబు, మోడీ క‌ల‌యిక‌ను సీరియ‌స్ గా తీసుకుంది. గ‌త మూడు వారాలుగా వాళ్లి్ద్ద‌రి ఐదు నిమిషాల భేటీ గురించే చ‌ర్చించుకుంటున్నారు. వ‌చ్చే వారం మ‌ళ్లీ వాళ్లిద్ద‌రూ క‌లిస్తే జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి అండ్ టీమ్ రియాక్ష‌న్ మ‌రింత సీరియ‌స్ గా ఉండే ఛాన్స్ ఉంది.

Also Read: AP Employees : ఏపీ ఉద్యోగుల‌కు `జ‌గ‌న్ మార్క్` క్ర‌మ‌శిక్ష‌ణ‌

మూడేళ్లుగా తెర‌వెనుక బీజేపీ, వైసీపీ స్నేహం న‌డుస్తోంది. ఎన్డీయేలో భాగ‌స్వామి కావాల‌ని చాలా సంద‌ర్భాల్లో జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి మీద ఒత్తిడి వ‌చ్చింది. అయిన‌ప్ప‌టికీ మ‌త ప్రాదిప‌దిక‌న ఓటు బ్యాంకు ను అంచ‌నా వేస్తోన్న ఆ పార్టీ ఎప్ప‌టిక‌ప్పుడు బీజేపీకి దూరంగా ఉంటోంది. కానీ, వ్య‌వ‌సాయ చ‌ట్టాలు, ఆర్టిక‌ల్ 370 ర‌ద్దు, సీఏఏ త‌దిత‌ర అన్ని అంశాల‌కు పార్ల‌మెంట్ వేదిక‌గా మోడీ స‌ర్కార్ కు మ‌ద్ధ‌తు ఇచ్చింది. అంతేకాదు, కేంద్ర ప్ర‌భుత్వానికి తెలియ‌కుండా రాష్ట్రంలో ఏమీ చేయ‌మంటూ ఎంపీ విజ‌య‌సాయిరెడ్డి అధికారంలోకి వ‌చ్చిన తొలి రోజుల్లోనే చెప్పారు. అదే త‌ర‌హాలో కేంద్ర‌, రాష్ట్ర ప్ర‌భుత్వాల మ‌ధ్య స‌ఖ్య‌త తెర‌చాటును కొన‌సాగుతోంది.

జాతీయ‌, స్థానిక స‌ర్వేల ఆధారంగా జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి గ్రాఫ్ ప‌డిపోతుంద‌ని బీజేపీ గ్ర‌హించింది. అందుకే, నాలుగేళ్లుగా దూరంగా పెట్టిన చంద్ర‌బాబును దువ్వే ప్ర‌య‌త్నం ఢిల్లీ బీజేపీ చేస్తోంది. ఆ క్ర‌మంలోనే రాష్ట్ర‌ప‌తి అభ్య‌ర్థిగా ఇటీవ‌ల ఏపీకి వ‌చ్చిన ముర్ము టీడీపీ మ‌ద్ధ‌తును కోరారు. వెనువెంట‌నే ఆజాదీ కా అమృత మ‌హోత్స‌వ్ వేడుకుల‌కు చంద్ర‌బాబుకు ఆహ్వానం ల‌భించింది. రాష్ట్ర‌ప‌తి భ‌వ‌న్ వేదిక‌గా జ‌రిగిన ఆ వేడుక‌ల‌కు ఆయ‌న హాజ‌రు కావ‌డం రాజ‌కీయ వ‌ర్గాల్లో చ‌ర్చ‌గా మారింది.

Also Read: Nara Lokesh: ఓవ‌రాక్ష‌న్ పై `లోకేష్` మూడోక‌న్ను!

ప్ర‌స్తుతం మునుగోడు ఉప ఎన్నిక‌ల బీజేపీకి ప్ర‌తిష్టాత్మ‌కంగా మారింది. ఈనెల 21న అమిత్ షా ఆ నియోజ‌క‌వ‌ర్గం ప‌రిధిలోనే బ‌హిరంగ స‌భ పెడుతున్నారు. సుమారు 2ల‌క్షల మందితో ఆ స‌భ‌ను విజ‌య‌వంతం చేయ‌డానికి బీజేపీ సిద్ధం అయింది. అయితే, గ్రౌండ్ లో బీజేపీ ఓటు బ్యాంకు లేక‌పోవ‌డంతో చంద్ర‌బాబు స‌హాయాన్ని కోరాల‌ని ఢిల్లీ బీజేపీ నేత‌లు భావిస్తున్నారు. వ‌చ్చే ఎన్నిక‌ల్లోనూ 2014 ఎన్నిక‌ల మ‌దిరిగా టీడీపీ, బీజేపీ పొత్తు ఉండేలా సంకేతాలు ఇస్తున్నారు. తెలంగాణ వ్యాప్తంగా టీడీపీకి ఉన్న క్రేజ్ ను ఆర్ఎస్ఎస్ గుర్తించింది. ఆ సంస్థ ఇచ్చిన రిపోర్ట్ ఆధారంగా చంద్ర‌బాబును క‌లుపుకుని వెళితే తెలంగాణ‌లో రాజ్యాధికారం ఈజీ అనే భావ‌న బీజేపీలో ఉంది.

ప్ర‌స్తుతం టీడీపీ వ‌ర్గాల్లో జ‌రుగుతోన్న చ‌ర్చ ప్ర‌కారం వ‌చ్చే వారం చంద్ర‌బాబు ఢిల్లీ టూర్ ఉండే అవ‌కాశం ఉంది. ప్ర‌స్తుతం. యూపీఏ నితీష్ ను ప్ర‌యోగించాల‌ని భావిస్తోన్న టైమ్ లో ఎన్డీయే త‌ర‌పున చంద్ర‌బాబును ఫోక‌స్ చేయాల‌ని వ్యూహాన్ని బీజేపీ ర‌చిస్తోంది. నితీష్ వెళ్లిపోయిన గ్యాప్ ను చంద్ర‌బాబుతో భ‌ర్తీ చేయాల‌ని భావిస్తోంద‌ట‌. అందుకే, వ‌చ్చే వారం మోడీ, షా తో చంద్ర‌బాబు భేటీ అంటూ చ‌ర్చ జ‌రుగుతోంది. నిజంగా ఆ భేటీ జ‌రిగితే, ఏపీ, తెలంగాణ రాజ‌కీయాల్లో పెనుమార్పులు చోటుచేసుకునే అవ‌కాశం లేక‌పోలేదు.

Also Read: TDP : తండ్రీ కొడుకుల ప‌క్కా ప్ర‌ణాళిక‌