Site icon HashtagU Telugu

Chandrababu : ఏపీ మ‌రో శ్రీలంక : చంద్ర‌బాబు

Jagan Babu Ap Map

Jagan Babu Ap Map

ముందు చూపుతో చంద్ర‌బాబు ఏదైనా అంటుంటారు. ఆ మ‌ధ్య పిల్లల్ని క‌నండంటూ స్లోగ‌న్ ఇచ్చారు. రాబోవు రోజుల్లో పిల్ల‌ల సంఖ్య త‌గ్గే అవకాశం ఉంద‌ని అంచ‌నా వేశారు. ఒక‌ప్పుడు ఇద్ద‌రు ముద్దు అనే స్లోగ‌న్ వినిపించారు. ఒక‌రు చాల‌నే నినాదం కూడా ఇచ్చారు. ఇప్పుడు పిల్ల‌ల్ని ఎక్కువ‌గా క‌నండంటూ చెబుతున్నారు. ఇదంతా ముందుచూపుతూ ఆయ‌న చెబుతున్న మాట‌. ఏపీ భ‌విష్య‌త్ గురించి కూడా చంద్ర‌బాబు అంచ‌నా వేస్తున్నారు. రాబోవు రోజుల్లో శ్రీలంక మాదిరిగా అవుతుంద‌ని ఏపీ ప్ర‌జ‌ల్ని అప్ర‌మ‌త్తం చేస్తున్నారు.ఏపీ సీఎం గా జ‌గ‌న్ ఇలాగే పరిపాల‌న కొన‌సాగిస్తే శ్రీలంక‌గా మారే ప్ర‌మాదం ఉంద‌ని చంద్ర‌బాబు ఆందోళ‌న చెందుతున్నారు. సోమవారం ఆయన పార్టీ ముఖ్యనేతలతో సమావేశమయ్యారు. ఆ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ శ్రీలంక‌లోని ప‌రిస్థితిని ప్ర‌స్తావించారు. కరెంట్ ఎందుకు పోతుందో.. బిల్లు ఎందుకు పెరిగిందో సీఎం చెప్పాలి? అని ప్రశ్నించారు. జగన్ వ్యక్తిగత ఆదాయం కోసమే ప్రజలపై భారం మోపుతున్నారని మండిపడ్డారు. జగన్ పాలనపై ఆయన సామాజికవర్గం కూడా సంతృప్తిగా లేదని తెలిపారు. అశాస్త్రీయంగా, రాజకీయ కోణంలో కొత్త జిల్లాల ఏర్పాటు చేశారని తప్పుబట్టారు. టీడీపీ అధికారంలోకి వచ్చాక అన్ని సరిదిద్దుతామని ప్రకటించారు. వ్యక్తిగత అవసరాల కోసమే పదవులు ఇస్తున్నారని చంద్రబాబు తప్పుబట్టారు. సామాజిక సమతూకం పాటించకుండా పదవులు, పోస్టింగ్‌లు ఇస్తున్నారని విమర్శించారు. జగన్‌ విధానాలపై ప్రజల్లో చర్చ జరుగుతోందని పేర్కొన్నారు. ఏపీలో అక్రమ మద్యం రూపంలో వేల కోట్లు జగన్‌ ఆర్జిస్తున్నారని ఆరోపించారు. ప్రభుత్వ షాపుల ద్వారానే నెంబర్ 2 మద్యం అమ్ముతున్నారని విమర్శించారు. కల్తీమద్యం, జె-ట్యాక్స్‌పై టీడీపీ పోరాడుతుందని చంద్రబాబు ప్రకటించారు.

Exit mobile version