Ram Mohan Naidu : ఎంపీ వ‌ద్దు, ఎమ్మెల్యే ముద్దు!

రాష్ట్రంలో అధికారంలోకి రావ‌డం టీడీపీకి ముఖ్యం. కేంద్రం వైపు చూసే ప‌రిస్థితి ప్ర‌స్తుతానికి లేదు. ఏ మాత్రం అవ‌కాశం ఇవ్వ‌కుండా రాష్ట్రాధికారాన్ని చేజిక్కించుకోవాల‌ని చంద్ర‌బాబు, లోకేష్ ప‌క్కా స్కెచ్ వేస్తున్నారు.

  • Written By:
  • Publish Date - July 27, 2022 / 05:00 PM IST

రాష్ట్రంలో అధికారంలోకి రావ‌డం టీడీపీకి ముఖ్యం. కేంద్రం వైపు చూసే ప‌రిస్థితి ప్ర‌స్తుతానికి లేదు. ఏ మాత్రం అవ‌కాశం ఇవ్వ‌కుండా రాష్ట్రాధికారాన్ని చేజిక్కించుకోవాల‌ని చంద్ర‌బాబు, లోకేష్ ప‌క్కా స్కెచ్ వేస్తున్నారు. అందుకోసం అభ్య‌ర్థిత్వాల‌ను సిద్ధం చేస్తోన్న అధిష్టానం బ‌ల‌మైన యువ‌త కోసం అన్వేష‌ణ చేస్తోంది. ఆ క్ర‌మంలో ఉత్త‌రాంధ్ర‌లో బ‌ల‌మైన లీడ‌ర్ గా ఎదిగిన ఎంపీ కింజ‌ర‌పు రామ్మోహ‌న్ నాయుడును అసెంబ్లీ వైపు మ‌ళ్లించాల‌ని ప్లాన్ చేస్తున్నారు. వ‌చ్చే ఎన్నిక‌ల్లో 80శాతం ప‌వ‌ర్ ఫుల్ గా ఉండే లోకేష్ టీమ్ ఉండే టీడీపీ జాగ్ర‌త్త ప‌డుతోంది.

ప్ర‌స్తుతం శ్రీకాకుళం ఎంపీగా కింజరాపు రామ్మోహన్ నాయుడు ఉన్నారు. ఎంపీగా రెండుసార్లు గెలిచిన రామ్మోహన్ ఎంఎల్ఏగా చేయాల‌ని భావిస్తున్నార‌ట‌. వ‌చ్చే ఎన్నిక‌ల్లో టీడీపీ అధికారంలోకి వ‌స్తుంద‌ని భావిస్తోన్న ఆయ‌న హోంశాఖ ను చేప‌ట్టాల‌ని ఆయ‌న అభిమానులు ఉవ్విళ్లూరుతున్నార‌ని తెలుస్తోంది. జాతీయ రాజకీయాల్లో టీడీపీ చక్రం తిప్పే అవకాశాలు దాదాపు లేవు. అందుకనే ఎంపీగా మ‌రోసారి గెలిచిన‌ప్ప‌టికీ ఢిల్లీ కేంద్రంగా పెద్ద‌గా ప్రాధాన్యం ఉండ‌ద‌ని రామ్మోహ‌న్ ఆలోచ‌న‌గా ఉంద‌ని తెలుస్తోంది.

లోకేష్ కు అత్యంత స‌న్నిహితంగా ఉండే రామ్మోహ‌న్ అసెంబ్లీ కి వ‌స్తే మంత్రి అయిపోవచ్చని కుటుంబ స‌భ్యులు సైతం సూచిస్తున్నార‌ట‌. రాష్ట్రంలో బాగా ప్రాధాన్యత దక్కుతుందని కుటుంబ సభ్యుల నుంచి ఆయ‌న‌కు ఒత్తిడి వ‌స్తుంద‌ని తెలుస్తోంది. ఆ విషయాన్ని చంద్రబాబునాయుడుతో కూడా చెప్పినట్లు సమాచారం.

ప్ర‌స్తుతం ఆయ‌న బాబాయ్ అచ్చెన్నాయుడును ఏపీ టీడీపీ అధ్య‌క్షునిగా ఉన్నారు. పైగా ఆయ‌న మంత్రి ప‌ద‌వుల‌ను ఇప్ప‌టికే నిర్వ‌హించిన అనుభ‌వ‌శాలి. ఆయ‌న్ను కాద‌ని ఒక వేళ రామ్మోహ‌న్ అసెంబ్లీలో అడుగుపెట్టిన‌ప్ప‌టికీ మంత్రిపదవి దక్కే అవకాశం ఉందా? అంటూ కొంద‌రు ప్ర‌శ్నిస్తున్నారు. పైగా శ్రీకాకుళం ఎంపీగా కొత్త నేతను వెతుక్కోవటం టీడీపీకి అంత వీజీకాదు. అచ్చెన్నాయుడును ఎంపీగా పోటీ చేయిద్దామంటే ఆయన ఒప్పుకోలేదని సమాచారం. బాబాయ్ అబ్బాయ్ ఇద్దరు అసెంబ్లీకే పోటీ చేస్తే పార్టీలో గొడవలు బాగా పెరిగిపోతాయని చంద్రబాబుకు సంకేతాలు ఉన్నాయ‌ట‌. ఎందుకంటే ఇప్పటికే వీళ్ళద్దరి మధ్య సంబంధాలు అంతంత మాత్రంగా ఉన్నాయ‌ని స‌ర్వ‌త్రా వినిపిస్తోంది.

వచ్చే ఎన్నికల్లో ఎంపీగానే పోటీచేయమని చంద్రబాబు చెప్పినా రామ్మోహన్ స‌సేమిరా అంటున్నార‌ని పార్టీలోని టాక్‌. శ్రీకాకుళం జిల్లా నరసన్నపేటలో ఎంఎల్ఏగా పోటీ చేయ‌డానికి గ్రౌండ్ సిద్ధం చేసుకుంటున్నార‌ని తెలుస్తోంది. ప్ర‌స్తుతం ఆ నియోజకవర్గ ఇన్చార్జి బగ్గు రమణమూర్తి కూడా రామ్మోహ‌న్ కు మద్దతిచ్చారని స్థానికంగా వినిపిస్తోంది. అటు బాబాయ్ ఇటు అబ్బాయ్ డిమాండ్ తో చంద్రబాబుకు తోచటం లేదట. ఒక వేళ రామ్మోహన్ ఎంఎల్ఏగా పోటీచేస్తే జిల్లా సమీకరణలు మారిపోయే అవకాశాలు లేక‌పోలేదు. అంతిమంగా టీడీపీ అధిష్టానం ఏమి చేస్తుందో చూద్దాం.