తిరుపతి మున్సిపల్ కార్పొరేషన్ డిప్యూటీ మేయర్(Deputy Mayor of Tirupati)గా తెలుగుదేశం పార్టీ (టీడీపీ) అభ్యర్థి మునికృష్ణ (MuniKrishna) ఎన్నికయ్యారు. తాజాగా జరిగిన ఎన్నికల్లో మునికృష్ణకు 26 మంది కార్పొరేటర్లు మద్దతు తెలపగా, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ (వైసీపీ) అభ్యర్థి భాస్కర్ రెడ్డికి 21 ఓట్లు లభించాయి. ఈ విజయంతో తిరుపతిలో టీడీపీ తన పట్టును మరింత బలపర్చుకుంది. ఈ విజయంతో టీడీపీ శ్రేణులు సంబరాలు చేసుకుంటున్నారు. డిప్యూటీ మేయర్ పదవిని దక్కించుకోవడం ద్వారా పార్టీ స్థానిక రాజకీయాల్లో మరింత బలంగా ఎదిగే అవకాశం పొందిందని నేతలు అంటున్నారు. మునికృష్ణకు పార్టీ నేతలు, కార్పొరేటర్ల నుంచి పూర్తి మద్దతు లభించడం గమనార్హం.
Allu Arjun : అల్లు అర్జున్ నెక్స్ట్ మూవీ అప్డేట్ ఇచ్చిన మెగా ప్రొడ్యూసర్
ఇక నందిగామ మున్సిపాలిటీ ఛైర్‌పర్సన్‌గా కూడా టీడీపీ అభ్యర్థి విజయం సాధించారు. పదో వార్డు కౌన్సిలర్ మండవ కృష్ణ కుమారి ఈ పదవికి ఎన్నికయ్యారు. ఎంపీ, ఎమ్మెల్యే సూచించిన అభ్యర్థులకన్నా కృష్ణ కుమారికి అధిష్ఠానం ప్రాధాన్యత ఇవ్వడం చర్చనీయాంశమైంది. టీడీపీ అభ్యర్థుల విజయంతో పార్టీ శ్రేణుల్లో ఆనందం నెలకొంది. తిరుపతిలో తాజా విజయం భవిష్యత్తులో స్థానిక ఎన్నికలకు పెద్ద సహాయపడుతుందని నాయకులు భావిస్తున్నారు. మరోవైపు, వైసీపీ మాత్రం ఈ ఓటమిని తేలికగా తీసుకోకుండా, పార్టీ బలాన్ని పెంచేందుకు కార్యాచరణ సిద్ధం చేస్తోంది.
తిరుపతి కార్పొరేషన్ పరిధిలో ఎన్నికలు ప్రతిష్టాత్మకంగా మారాయి. డిప్యూటీ మేయర్ పదవిని టీడీపీ దక్కించుకోవడం, నందిగామ మున్సిపాలిటీలో కూడా పార్టీ విజయాన్ని నమోదు చేయడం టీడీపీకి రాజకీయంగా దన్నుగా నిలుస్తుందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.