TDP : టీడీపీ అధినేత నివాసం వద్ద మొదలైన కోలాహలం

Election Results 2024: ఉండవల్లిలోని టీడీపీ అధినేత చంద్రబాబు నివాసం వద్ద కోలాహలం మొదలైంది. ఏపీ ఎన్నికల ఫలితాల్లో టీడీపీ కూటమి ప్ర‌భంజ‌నం కొన‌సాగుతోంది. దీంతో టీడీపీ శ్రేణుల్లో ఉత్సాహం పొంగిపొర్లుతుంది. చంద్రబాబు ఇంటి వద్దకు మంగళగిరిలోని టీడీపీ ప్రధాన కార్యాలయం వద్దకు భారీగా కార్యకర్తలు చేరుకుంటుండడంతో కోలహలం ఏర్పాడింది. బాణసంచా కాల్చుతూ, నినాదాలు చేస్తూ టీడీపీ కార్యకర్తలు హోరెత్తించారు. టీడీపీ కేంద్ర కార్యాలయానికి భారీగా పార్టీ శ్రేణులు. బాణాసంచా పేల్చి సంబరాలు చేస్తున్న టీడీపీ కార్యకర్తలు#KutamiTsunami […]

Published By: HashtagU Telugu Desk
tdp-cadre-starts-celebrations at TDP chief Chandrababu residence

tdp-cadre-starts-celebrations at TDP chief Chandrababu residence

Election Results 2024: ఉండవల్లిలోని టీడీపీ అధినేత చంద్రబాబు నివాసం వద్ద కోలాహలం మొదలైంది. ఏపీ ఎన్నికల ఫలితాల్లో టీడీపీ కూటమి ప్ర‌భంజ‌నం కొన‌సాగుతోంది. దీంతో టీడీపీ శ్రేణుల్లో ఉత్సాహం పొంగిపొర్లుతుంది. చంద్రబాబు ఇంటి వద్దకు మంగళగిరిలోని టీడీపీ ప్రధాన కార్యాలయం వద్దకు భారీగా కార్యకర్తలు చేరుకుంటుండడంతో కోలహలం ఏర్పాడింది. బాణసంచా కాల్చుతూ, నినాదాలు చేస్తూ టీడీపీ కార్యకర్తలు హోరెత్తించారు.

We’re now on WhatsApp. Click to Join.

నిన్ననే టీడీపీ కార్యాలయం వద్ద పార్టీ శ్రేణులు సీఎం, సీఎం అంటూ నినాదాలతో హోరెత్తించాయి. ఈరోజు కౌంటింగ్ మొదలైన గంటకే టీడీపీ భారీ లీడింగ్ లోకి వెళ్లడంతో నేతలు, కార్యకర్తల్లో సంతోషం అంతా ఇంతా కాదు.

Read Also: AP Election Results : ఫ్యాన్‌ను బండకేసి బాదిన టీడీపీ నేతలు

కోనసీమ, రాయలసీమ, కోసాంధ్రలో టీడీపీ అభ్యర్థులు ముందంజలో ఉండగా, వైసీపీ బాగా వెనుకబడినట్టు ఇప్పటివరకు జరిగిన కౌంటింగ్ తీరు చెబుతోంది. సొంతంగా టీడీపీ 125 స్థానాల్లో ముందంజలో ఉండగా, భాగస్వామ్య పక్షాలైన జనసేన 17, బీజేపీ 7 స్థానాల్లో ఆధిక్యంలో ఉన్నాయి. అధికార వైసీపీ 20 చోట్ల ఆధిక్యంలో కొనసాగుతోంది.

  Last Updated: 04 Jun 2024, 11:40 AM IST