Site icon HashtagU Telugu

TDP : అచ్చెన్న ఇదేం ప‌ద్ద‌త‌న్నా అంటున్న తెలుగు త‌మ్ముళ్లు.. అధ్య‌క్షుడిపై గుర్రుగా క్యాడ‌ర్‌..!

Atchannaidu

Atchannaidu

తెలుగుదేశం పార్టీలో ఒక‌ప్ప‌టి క్ర‌మ‌శిక్ష‌ణ ఇప్పుడు క‌నిపించ‌డంలేదు. సోష‌ల్ మీడియా పుణ్య‌మా అని ఎవ‌రుప‌డితే వాళ్లు త‌మ సొంత సాహిత్యాన్ని ప్ర‌ద‌ర్శిస్తూ టీడీపీకి త‌ల‌నొప్పులు తెచ్చిపెడుతుంటే మ‌రోవైపు వ‌ర్గ‌పోరు టీడీపీని తీవ్ర‌స్థాయిలో న‌ష్ట‌పెడుతుంది. 2019 ఎన్నిక‌ల త‌రువాత పార్టీ ఘొర ఓట‌మి చెందింది. దాదాపు మూడేళ్ల వ‌ర‌కు వైసీపీపై ద్వితీయ శ్రేణి నాయ‌కులే పోరాడడుతూ కేసులు పెట్టించుకుంటూ వ‌చ్చారు. ఆ మూడేళ్లు ఖ‌ద్ద‌ర్ చొక్కా వేసుకున్న నేత‌లంతా త‌మ వ్యాపారాలు ఎక్క‌డ దెబ్బ‌తింటాయోన‌ని బ‌య‌టికి కూడా రాలేదు. మూడేళ్ల త‌రువాత వైసీపీపై ప్ర‌జ‌ల్లో వ్య‌తిరేక‌త మొద‌ల‌వ్వ‌డంతో నియోజ‌క‌వ‌ర్గాల్లో చోటా మోటా నాయ‌కులంతా బ‌య‌టివ‌చ్చి తామే అన్ని అన్న‌ట్లు వ్య‌వ‌హ‌రిస్తున్నారు.క్యాడ‌ర్ క‌ష్టాల్లో ఉన్న‌ప్పుడు క‌న్నెత్తి ఊడాని వాళ్లంతా ఇప్పుడు టికెట్ కోసం వెంప‌ర్లాడ‌తున్నారు. ప్ర‌తి నియోజ‌క‌వ‌ర్గంలో నాలుగైదు గ్రూపులుగా టీడీపీ నాయ‌కులు ఉన్నారు. దీనికి రాష్ట్ర అధ్య‌క్షుడు చెక్ పెట్టాల్సింది పోయి ఆయ‌నే వారితో క‌లిసి కార్య‌క్ర‌మాలు చేస్తున్నారు. నియోజ‌క‌వ‌ర్గాల్లో ఉన్న వ‌ర్గ‌పోరుతో పార్టీ తీవ్రంగా న‌ష్ట‌పోతుంది.

ఇటీవ‌ల విజ‌య‌వాడ సెంట్ర‌ల్ నియోజ‌కవ‌ర్గంలో ఇంఛార్జ్ బోండా ఉమా పార్టీ కార్యాల‌యం ప్రారంభోత్స‌వానికి సిట్టింగ్ ఎంపీ కేశినేని నానిని కాద‌ని ఆయ‌న సోద‌రుడు చిన్నిని ఆహ్వానించారు. పైగా కార్యాల‌యం వ‌ద్ద ఫ్లెక్సీల్లో ఎక్క‌డా సిట్టింగ్ ఎంపీ ఫోటో కూడా వేయ‌లేదు. దీనిని రాష్ట్ర అధ్య‌క్షుడు అచ్చెన్నాయుడు ప్రారంభిచ‌డంతో ఎంపీ అనుచ‌రులు అసంతృప్తితో ఉన్నారు. క‌నీసం రాష్ట్ర అధ్య‌క్షుడు వచ్చి ప్రారంభోత్స‌వం చేస్తున్నా కార్యాల‌యంకి ఎంపీ ఫోటో లేక‌పోవ‌డాన్ని అధ్య‌క్షుడు ప్ర‌శ్నించ‌క‌పోవ‌డం పార్టీలో వ‌ర్గాల‌ను ఎలా ప్రోత్స‌హిస్తున్నారో క్లియ‌ర్ గా అర్థ‌మ‌వుతుంద‌ని క్యాడ‌ర్ చ‌ర్చించుకుంటుంది.            ప్ర‌తి ని యోజ‌క‌వ‌ర్గంలో ఉన్న వ‌ర్గాల‌పై రాష్ట్ర అధ్య‌క్షుడికి ప‌లుమార్లు ఫిర్యాదు చేసిన అచ్చెన్నాయుడు మాత్రం వాటిని గాలికివ‌దిలేస్తున్నార‌ని నాయ‌కులు అంటున్నారు. క‌నీసం పిలిచి మాట్లాడి సెటిల్ చేయ‌లేని స్థితిలో అచ్చెన్నాయుడు ఉన్నార‌ని క్యాడ‌ర్ అంటున్నారు. నియోజ‌క‌వ‌ర్గాల్లో ఎప్ప‌టి నుంచి ఉన్న వాళ్ల‌ని కాద‌ని కొత్త‌గా కార్పోరేట్ స్థాయి వాళ్ల‌ని తీసుకువ‌చ్చి పార్టీపై రుద్దుతున్నారు. వీళ్లు అధికారం లేకపోతే మ‌ళ్లీ వాళ్లు నియోజ‌క‌వ‌ర్గపై క‌న్నెత్తి కూడా చూడ‌ర‌ని క్యాడ‌ర్ అంటుంది. ఇలాంటి వాళ్ల‌ని అధిష్టానం ప్రోత్స‌హించ‌డం ఎంత‌వ‌ర‌కు స‌మంజ‌సంమ‌ని కార్య‌క‌ర్త‌లు ప్ర‌శ్నిస్తున్నారు.