Site icon HashtagU Telugu

TDP bus yatra : 125 స్థానాల్లో బ‌స్ యాత్ర‌, 50 స్థానాలు పొత్తుకేనా?

TDP bus yatra

Tdp Plan

TDP bus yatra : తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు రాజ‌కీయాలు ఎప్పుడూ వ్యూహాత్మ‌క‌మే. వాటిని అంచ‌నా వేయ‌డం చాలా క‌ష్టం. కానీ, ఈసారి ఆయ‌న వేస్తోన్న అడుగులు క్లియ‌ర్ క‌ట్ గా తెలిసిపోతున్నాయి. అలాంటి వాటిలో ఒక‌టి మినీ మేనిఫెస్టో (Mini manifesto)అంశం. దాన్ని విస్తృతంగా ప్ర‌జల మ‌ధ్య‌కు తీసుకెళ్లాల‌ని ప్ర‌య‌త్నం చేస్తున్నారు. అందుకోసం ఎంపిక చేసిన కొంద‌రు లీడ‌ర్ల ద్వారా బ‌స్సు యాత్ర‌ను పెట్టారు. పార్టీ విస్తృత స్థాయి స‌మావేశంలో సోమ‌వారం ఆ మేర‌కు నిర్ణ‌యం తీసుకున్నారు. ఆ బ‌స్సు 125 అసెంబ్లీ నియోజ‌క‌వ‌ర్గాలకు వెళ్ల‌నుంది. డిజిట‌ల్ స్లైడ్స్ ద్వారా బ‌స్సు యాత్ర‌కు వెళ్లిన లీడ‌ర్లు ప్రద‌ర్శిస్తారు.

తొలి విడ‌త 125 స్థానాల్లో బ‌స్సు యాత్ర‌ను (TDP bus yatra)

వై నాట్ పులివెందుల దిశ‌గా చంద్ర‌బాబు (Chandrbabu)అడుగులు వేస్తున్నారు. ఆ క్ర‌మంలో తొలి విడ‌త 125 స్థానాల్లో బ‌స్సు యాత్ర‌ను (TDP bus yatra)పెట్టారు. మిగిలిన 50 స్థానాల‌ను బ‌స్సు ప్ర‌స్తుతానికి ట‌చ్ చేయ‌డంలేదు. అంటే, 50 స్థానాల‌ను పొత్తు భాగ‌స్వాముల‌కు ఇస్తారా? అనే ప్ర‌శ్న ఉత్ప‌న్నం అవుతోంది. జ‌న‌సేన‌, బీజేపీ పొత్తుకు సిద్ధంగా ఉన్నాయ‌న్న టాక్ న‌డుస్తోంది. ఆ క్రమంలో 50 స్థానాల‌ను ఆ రెండు పార్టీల‌కు ఇవ్వ‌డానికి చంద్ర‌బాబు సిద్ధ‌ప‌డడం కార‌ణంగా బ‌స్సు యాత్ర పెట్ట‌లేదా? అనే అనుమానం పార్టీ వ‌ర్గాల్లోనూ వినిపిస్తోంది.

50 స్థానాల‌ను  త్యాగం చేయాల్సి వ‌స్తుంద‌న్న ఆందోళ‌న

తెలుగుదేశం పార్టీ విస్తృత స్థాయి స‌మావేశం సోమ‌వ‌రం జ‌రిగింది. ఐ ప్యాక్ రాబిన్ సింగ్ ఇచ్చిన స‌ర్వేల ప్ర‌కారం టీడీపీ స‌భ‌లు, స‌మావేశాల‌ను నిర్వ‌హిస్తోంది. యువ‌గ‌ళం కూడా ఆ టీమ్ ఆధ్వ‌ర్యంలోనే న‌డుస్తోంది. ఇక సీట్ల షేరింగ్‌, పొత్తుల‌కు సంబంధించిన అంశాల‌ను కూడా స‌ర్వేల ద్వారా తెలుసుకుంటున్న‌ట్టు స‌మాచారం. అయితే, స‌ర్వేల ప్ర‌కారం ఒంట‌రిగా వెళ్లిన‌ప్ప‌టికీ టీడీపీ అధికారంలోకి వ‌స్తుంద‌ని చెబుతున్నారు. కానీ, చంద్ర‌బాబు ధైర్యం చేయ‌లేక‌పోతున్నార‌ని టీడీపీ అంత‌ర్గ‌త వ‌ర్గాల్లోని చ‌ర్చ‌. ఫ‌లితంగా 50 స్థానాల‌ను(TDP bus yatra) త్యాగం చేయాల్సి వ‌స్తుంద‌న్న ఆందోళ‌న టీడీపీ క్యాడ‌ర్ లో ఉంది.

20 స్థానాల‌ను బీజేపీ కోరింద‌ని

ఇటీవ‌ల అమిత్ షాను ఢిల్లీలో చంద్ర‌బాబు క‌లిశారు. ఆ సంద‌ర్భంగా 20 స్థానాల‌ను బీజేపీ కోరింద‌ని తెలుస్తోంది. అలాగే, 2 లోక్ స‌భ స్థానాలను అడిగిన‌ట్టు స‌మాచారం. అదే విధంగా ప‌వ‌న్ 40 స్థానాల‌కు త‌గ్గ‌కుండా అడుగుతున్నార‌ని రాజ‌కీయా వ‌ర్గాల్లోని వినికిడి. అలాగే, 2 లోక్ స‌భ స్థానాలు కావాల‌ని కోరుతున్న‌ట్టు చ‌ర్చ జ‌రుగుతోంది. అంటే జ‌న‌సేన‌, బీజేపీ కోరుకుంటున్న ప్ర‌కారం 60 అసెంబ్లీ, 4 లోక్ స్థానాల‌ను టీడీపీ త్యాగం చేయాలి. క‌నీసం 50 స్థానాల‌ను త్యాగం చేయాల్సిన ప‌రిస్థితి రావ‌చ్చ‌ని బ‌స్సు యాత్రను 125 స్థానాల‌కు(TDP bus yatra) ప‌రిమితం చేసినట్టు టీడీపీ వ‌ర్గాల్లోని చ‌ర్చ .

Also Read : CBN Manifesto 2.0 : టీడీపీ మేనిఫెస్టో 2.0 సిద్ధం! ప్ర‌చారానికి బ‌స్సు యాత్ర‌!!

వాస్త‌వంగా జ‌న‌సేన‌, బీజేపీ ఓటు బ్యాంకును తీసుకుంటే 6శాతానికి మించ‌దని గ‌త ఎన్నిక‌ల చరిత్ర చెబుతోంది. ఏపీలో బీజేపీకి 2శాతానికి లోపే ఓటు బ్యాంకు ఉంది. ఇక జ‌న‌సేన‌కు 4 నుంచి 5 శాతం ఉండే ఛాన్స్ ఉంద‌ని గ‌త ఎన్నిక‌ల రికార్ట్ చెబుతోంది. కానీ, ఆ రెండు పార్టీలు అడుగుతున్న అసెంబ్లీ, లోక్ స‌భ స్థానాల సంఖ్య‌ను గ‌మ‌నిస్తే తెలుగుదేశం పార్టీకి న‌ష్టం క‌లిగేలా ఉంది. కింగ్ మేక‌ర్ కావాల‌ని ప్ర‌య‌త్నిస్తోన్న జ‌న‌సేన‌కు లైఫ్ ఇచ్చేలా రాజ‌కీయ చిత్రం క‌నిపిస్తోంది. ప‌ది మంది ఎమ్మెల్యేలను గెలిపించుకోవాల‌ని జ‌న‌సేన ప్రాథ‌మిక టార్గెట్ గా ఉంద‌ని వినికిడి. అదే జ‌రిగితే, ఆ ప‌ది మందితో చంద్ర‌బాబును ఆడుకోవాల‌ని ప్లాన్ చేస్తున్నారు. అందుకు అనుగుణంగా చంద్ర‌బాబు అడుగులు వేస్తున్నార‌ని టీడీపీ అందోళ‌న చెందుతోంది. పార్టీ విస్తృత స్థాయి స‌మావేశంలో తీసుకున్న 125 స్థానాల్లో బ‌స్సు యాత్ర(TDP bus yatra) అనేది ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది.

Also Read : TDP Twist : ముగ్గురి ముచ్చ‌ట‌! విజ‌య‌వాడ ఎంపీగా బాల‌య్య‌?