Site icon HashtagU Telugu

AP : 8 ఎంపీ సీట్లు అడుగుతున్న బిజెపి..4 ఇస్తాం అంటున్న టీడీపీ..!!

Amith Sha Babu

Amith Sha Babu

బిజెపి- టీడీపీ – జనసేన పొత్తుకు సంబంధించి కాసేపట్లో ఓ క్లారిటీ రానుంది. 2014 లో ఎలాగైతే పొత్తు తో విజయం సాధించారో..ఇప్పుడు కూడా అదే రిపీట్ చేయాలనీ ఆయా పార్టీలు భావిస్తున్నాయి. వైసీపీ పార్టీ ని ఓడించాలంటే సింగిల్ గా వెళ్తే కుదరదని , కలిసి కట్టుగా వెళ్తేనే ఓడించగలం అని ముందు నుండి చెప్పుకుంటూ వస్తున్న జనసేన అధినేత పవన్..ఇప్పుడు బిజెపి తో పొత్తు పెట్టుకోవడం వెనుక కూడా ఎంతో కష్టపడ్డారు. తమ సీట్లను తగ్గించుకొని కూడా బిజెపి కి సీట్లు ఇచ్చేందుకు ముందుకొచ్చారు.

We’re now on WhatsApp. Click to Join.

గత కొద్దీ రోజులుగా సీట్లకు సంబంధించి మూడు పార్టీలలో చర్చలు నడుస్తుండగా..దీనిపై ఏదోకటి తేల్చాలని చెప్పి నిన్న సాయంత్రం చంద్రబాబు , పవన్ కళ్యాణ్ లు ఢిల్లీకి వెళ్లి.. రాత్రి అమిత్‌షాతో సమావేశమయ్యారు. అక్కడే జేపీ నడ్డా కూడా ఉన్నారు. నలుగురూ కలిసి గంటకుపైగా చర్చలు జరిపారు. ఈ చర్చల సందర్భంగా తమకు మెజార్టీ ఎంపీ సీట్లు ఇవ్వాలని అమిత్‌షా ప్రతిపాదించారు. 8 నుంచి 10 వరకు ఇస్తే బాగుటుందని , 370 సీట్లను లక్ష్యంగా పెట్టుకున్నామని అందుకే తమకు అసెంబ్లీ సీట్లు పెద్ద ప్రాధాన్యం కాదని అందుకే ఎక్కవ లోక్‌సభ స్థానాలు ఇవ్వాలని అమిత్‌షా, నడ్డా ప్రతిపాదించారు.

దీనికిపై ‌స్పందించిన చంద్రబాబు… నాలుగు స్థానాల్లో బీజేపీ సీట్లు కేటాయిస్తే గెలిచే అవకాశాలు ఎక్కువ ఉంటాయని తర్వాత ఒక రాజ్య సభ స్థానాన్ని ఇస్తామని అన్నారు. అంతకంటే ఎక్కువ సీట్లు ఇస్తే ప్రత్యర్థులకు మేలు జరుగుతుందని వివరించారు. ఈ చర్చలు ఈరోజు కూడా జరిపి.. సాయంత్రం కల్లా ఓ క్లారిటీ రానుంది. మరి బిజెపి అడిగినట్లు సీట్లు ఇస్తుందా..ఇవ్వదా ..? అనేది చూడాలి.

Read Also : Balakrishna: శివరాత్రి సందర్భంగా బాలయ్య 109 నుంచి అదిరిపోయే అప్డేట్.. ఫ్యాన్స్ కి పునకాలే!

Exit mobile version