అధికారంలోకి రాగానే 50 ఏళ్లు నిండిన బీసీలకు రూ.4వేల పెన్షన్ అందిస్తామని ప్రకటించారు టీడీపీ. గుంటూరు జిల్లా మంగళగిరిలో నిర్వహించే జయహో బీసీ వేదికపై ఈ ప్రకటన చేసారు. టీడీపీ అధినేత చంద్రబాబు (Chandrababu), జనసేన అధినేత పవన్ కల్యాణ్ (Pawan Kalyan) బీసీ డిక్లరేషన్ ఆవిష్కరించారు. ఎన్నికల మేనిఫెస్టోలో పెట్టబోయే వివిధ అంశాలను ప్రస్తావిస్తూ బీసీ డిక్లరేషన్ (BC Declaration) రూపొందించినట్లు తెలుస్తోంది. మొత్తం 10 అంశాలతో కూడిన పోస్టర్‌ను విడుదల చేశారు. అందులో మొదటిగా 50 ఏళ్లు నిండిన బీసీలకు రూ.4000 పెన్షన్ అందిస్తామని హామీ ఇచ్చారు.
త్వరలో ఏపీలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో టీడీపీ-జనసేన (TDP-Janasena) కూటమి జోరు పెంచింది. ఇప్పటికే ‘రా కదలి రా..’, ‘శంఖారావం’ కార్యక్రమాలతో ప్రజల్లో నిలుస్తూ వస్తుంది. ఇక ఇప్పుడు బీసీల సమగ్రాభివృద్ధి, సంరక్షణ కోసం బీసీ డిక్లరేషన్‌ను విడుదల చేసింది. వెనకబడిన వర్గాల సమగ్రాభివృద్ధి, పూర్తి స్థాయి సామాజిక న్యాయమే లక్ష్యంగా టీడీపీ – జనసేన పార్టీలు ఉమ్మడిగా నేడు బీసీ డిక్లరేషన్ ను ప్రకటించాయి. గుంటూరు జిల్లా మంగళగిరిలో నిర్వహించే జయహో బీసీ వేదికపై రెండు పార్టీల అధినేతలు డిక్లరేషన్ ఆవిష్కరించాయి. స్థానిక సంస్థల్లో బీసీలకు రిజర్వేషన్ల పెంపు, కార్పొరేషన్, నామినేటెడ్ పదవులు, సబ్‌ప్లాన్ నిధులకు సంబంధించి స్పష్టమైన ప్రకటన చేయనున్నట్లు సమాచారం.
Read Also : Byreddy Shabari : టీడీపీలోకి బైరెడ్డి శబరి..? నంద్యాల నుంచి పోటీ..?