Site icon HashtagU Telugu

AP Assembly : బాలకృష్ణ .. దమ్ముంటే రా అంటూ అంబటి సవాల్

Ap Assembly Minister Ambati

Ap Assembly Minister Ambati

ఏపీ అసెంబ్లీ సమావేశాలు (AP Assembly Sessions) కొద్దీ సేపటి క్రితం ప్రారంభం అయ్యాయో..లేదో స్పీకర్ అసెంబ్లీ ని కాసేపు వాయిదా వేశారు. అసెంబ్లీ ప్రారంభం కాగానే చంద్రబాబు అక్రమ అరెస్ట్‌ (Chandrababu Arrest)పై ఎమ్మెల్యేలు పెద్ద ఎత్తున నినాదాలు చేస్తూ, పోడియం ను చుట్టుముట్టారు. ప్రశ్నోత్తరాల కార్యక్రమం కొనసాగుతుండగానే.. టీడీపీ సభ్యులు చంద్రబాబు అరెస్ట్ ను ఖండిస్తూ..చంద్రబాబు ఫై పెట్టిన అక్రమ కేసులు ఎత్తువేయాలంటూ పెద్ద ఎత్తున నినాదాలు చేస్తూ, స్పీకర్ వద్దకు వెళ్ళి ప్లకార్డులు చూపించారు. మీ స్థానాలకు వెళ్లి కూర్చోవాలని స్పీకర్ కోరుతున్నప్పటికీ వారు వినలేదు. స్కిల్ కేస్ అక్రమ కేస్ , అక్రమ అరెస్ట్‌ను ఖండించాలని వారంతా డిమాండ్ చేసారు.

దీనిపై అధికార పక్షం సభ్యులు అభ్యంతరం వ్యక్తం చేసారు. ఈ సందర్భాంగా ఇరు వర్గాల మధ్య వాగ్వాదం మొదలైంది. అంబటి మాట్లాడూ టీడీపీ సభ్యులను రెచ్చగొట్టారు. దీంతో అటు నుంచి కూడా గట్టి రియాక్షన్ వచ్చింది. ఇదే క్రమంలో హిందూపురం ఎమ్మెల్యే బాలకృష్ణ (MLA Balakrishna) మీసం తిప్పడం ఫై మంత్రి అంబటి రాంబాబు (MInister Ambati) ఘాటుగా స్పందించారు. మీరు సినిమాల్లో మీసం తిప్పండి ఇక్కడ కాదు..మాకు ఉన్నాయి మీసాలు, మీము కూడా తిప్పుతాం అంటూ రాంబాబు ఘాటుగా స్పందించారు. ఈ క్రమంలో బాలయ్య హెచ్చరించడంతో దమ్ముంటే రా అంటూ అంబటి రాంబాబు సవాల్‌ విసిరారు.

అంతకు ముందు టీడీపీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు శాసనసభకు పాదయాత్రగా వెళ్లారు. చంద్రబాబు అరెస్టుకు నిరసనగా సచివాలయ అగ్నిమాపక కేంద్రం నుంచి శాసనసభ వరకు పాదయాత్ర చేశారు. టీడీపీ సభ్యుల నిరసనలో వైసీపీ బహిష్కృత ఎమ్మెల్యేలు కూడా పాల్గొన్నారు. టీడీపీ నేతల నిరసనలో ఆనం, కోటంరెడ్డి, మేకపాటి, శ్రీదేవి పాల్గొన్నారు. చంద్రబాబు అరెస్టు అక్రమమని గళమెత్తటమే తమ ప్రధాన అజెండా అని టీడీపీ నేతలు స్పష్టం చేశారు. అక్రమ అరెస్టులు, కేసులకు భయపడేది లేదని బాలకృష్ణ తేల్చి చెప్పారు. టీడీపీ అధినేత చంద్రబాబు అరెస్టు అంశాన్ని ప్రజాక్షేత్రంలోనే తేల్చుకుంటామని అన్నారు. ఈ పోరాటం ఇంతటితో ఆగేది కాదని చెప్పారు. ప్రజల్లో తమ పార్టీకి ఉన్న స్పందన చూసే అక్రమ కేసులు పెట్టారని ఆరోపించారు. ప్రజలంతా తమ వెంటే ఉన్నారని బాలకృష్ణ అన్నారు.

Read Also: India vs Australia: మెగా టోర్నీకి ముందు బిగ్ ఫైట్‌.. రేపటి నుంచే భారత్, ఆసీస్ వన్డే సిరీస్‌