TDP : అంగన్వాడీలకు షోకాజ్ నోటీసులివ్వడం దుర్మార్గపు చర్య – టీడీపీ అంగ‌న్వాడీ విభాగం రాష్ట్ర అధ్య‌క్షురాలు సునీత‌

అంగన్వాడీ కార్యకర్తలకు షోకాజ్ నోటీస్ ఇవ్వడం జగన్మోహన్ రెడ్డి నియంతృత్వానికి పరాకాష్ట అని తెలుగునాడు అంగన్వాడీ,

Published By: HashtagU Telugu Desk
TDP sunitha

TDP sunitha

అంగన్వాడీ కార్యకర్తలకు షోకాజ్ నోటీస్ ఇవ్వడం జగన్మోహన్ రెడ్డి నియంతృత్వానికి పరాకాష్ట అని తెలుగునాడు అంగన్వాడీ, డ్వాక్రా సాధికార కమిటీ రాష్ట్ర అధ్యక్షురాలు సునీత తెలిపారు. చంద్రబాబు అక్రమ అరెస్ట్ ను నిరసిస్తూ కుప్పంలో ఏర్పాటు చేసిన టీడీపీ దీక్షా శిబిరంలో అంగన్వాడీలు పాల్గొనడం తప్పా? అని ఆమె ప్ర‌శ్నించారు. మాజీ ముఖ్య‌మంత్రి చంద్రబాబు నాయుడు ప్రజా నాయకుడని..ఆయన జీవితమంతా ప్రజల కోసమే పనిచేశారని ఆమె తెలిపారు. అలాంటి వ్యక్తిపై అక్రమ కేసులు బనాయించి జైలు పాల్జేస్తే చూస్తూ ఊరుకోవాలా? నిరసన తెలిపే హక్కు లేదా? రాష్ట్రంలో ప్రజాస్వామ్యం లేదనడానికి ఇంతకంటే నిదర్శనం ఏం కావాలి? అని ఆమె ప్ర‌శ్నించారు. 70 మంది అంగన్వాడీలు, సహాయకులకు షోకాజ్ నోటీసులు ఇవ్వడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామని సునీత తెలిపారు. అంగన్వాడీలపై సీఎం జగన్ రెడ్డి కక్ష కట్టారని.. నాలుగేళ్లుగా వారి సమస్యలు పరిష్కరించకుండా ఉక్కుపాదం మోపుతున్నారని ఆరోపించారు. ఇప్పటికైనా ప్రభుత్వం అణిచివేత ధోరణి విడనాడాలని… తక్షణమే అంగన్వాడీలకు ఇచ్చిన షోకాజ్ నోటీసు ఉపసంహరించుకోవాలని ఆమె డిమాండ్ చేశారు.

Also Read:  Telangana Pre Poll Survey 2023 : కారు స్పీడ్ కు బ్రేకులు..కాంగ్రెస్ జోరు..దరిదాపుల్లో లేని బిజెపి

  Last Updated: 06 Oct 2023, 06:10 PM IST