నారా లోకేష్ యువగళం పాదయాత్ర(Nara Lokesh YuvaGalam Padayatra) చేస్తున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం నారా లోకేష్ యువగళం పాదయాత్ర పశ్చిమగోదావరి జిల్లా భీమవరంలో(Bhimavaram) సాగుతుంది. యువగళం పాదయాత్రకు మొదటి నుంచి వైసీపీ(YCP) ఆటంకాలు కల్పిస్తుంది. యువగళంపై దాడులు చేస్తుంది, లోకేష్ ని ఎక్కడికక్కడ అడ్డుకోవాలని చూస్తున్నారు వైసీపీ కార్యకర్తలు.
ఇప్పటికే పుంగనూరు, ఎమ్మిగనూరు, పెదపారుపూడి.. ఇలా అనేక ప్రదేశాల్లో నారా లోకేష్ పాదయాత్రను వైసీపీ వాళ్ళు అడ్డుకోవడంతో ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి. టీడీపీ, వైసీపీ కార్యకర్తలు ఒకర్నొకరు బాహాబాహిగానే కొట్టుకున్నారు. తాజాగా నారా లోకేష్ యువగళం పాదయాత్రలో మరోసారి ఉద్రిక్తత నెలకొంది.
భీమవరం వద్ద గునుపూడి వంతెన వైపుగా నారా లోకేష్ పాదయాత్ర చేస్తుండగా వైసీపీ కార్యకర్తలు హల్ చల్ చేశారు. కొంతమంది కర్రలతో దాడి చేశారు. దీంతో వైసీపీ, టీడీపీ కార్యకర్తలు బాహాబాహీగా కొట్టుకున్నారు. ఒకరిపై ఒకరు రాళ్లు విసురుకున్నారు. ఈ ఘర్షణలో పలువురు పోలీసులకు కూడా గాయాలు అయ్యాయి. అంతేకాక లోకేష్ కాన్వాయ్ లో పలు వాహనాలను ధ్వంసం చేశారు వైసీపీ కార్యకర్తలు.
దీంతో వైసీపీ వాళ్లపై నారా లోకేష్ ఆగ్రహం వ్యక్తం చేస్తూ తాడేరు వద్ద పాదయాత్ర ఆపి నిరసన తెలుపుతున్నారు. ఉన్నతాధికారులు వచ్చే వరకు ముందుకు కదిలేది లేదు అన్నారు. పలువురు టీడీపీ కార్యకర్తలు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి దిష్టిబొమ్మను దగ్ధం చేశారు. పోలీసులు పరిస్థితులని చక్కదిద్దడానికి ప్రయత్నిస్తున్నారు.
Also Read : CBN No Arrest : ఆగడు..ఆపలేరు.! ఐటీతో అరెస్ట్ తూచ్.!