Site icon HashtagU Telugu

TCS : ఏపీకి రాబోతున్న టీసీఎస్..నారా లోకేష్ ప్రకటన

Tcs Lokesh

Tcs Lokesh

ఐటీ మినిస్టర్ నారా లోకేష్ (Nara Lokesh) రాష్ట్ర నిరుద్యోగులకు గుడ్ న్యూస్ తెలిపారు. సారతీరంలో (Vizag) టీసీఎస్‌(TCS )ను ఏర్పాటు చేయనున్నామని ప్రకటించారు. విశాఖలో భారీ పెట్టుబడుల ద్వారా టాటా గ్రూపు దాదాపు 10వేల మంది (Employ )కి ఉపాధి అవకాశాలు కల్పించనుంది. ముఖ్యంగా ఈవీ, ఏరోస్పేస్‌, పర్యాటక, స్టీలు రంగాల్లో పెట్టుబడులను పరిశీలిస్తామని ఇదివరకే టాటా గ్రూపు ప్రకటించింది. ఈ క్రమంలో మంగళవారం టాటా గ్రూపు ఛైర్మన్‌ చంద్రశేఖరన్‌తో మంత్రి నారా లోకేశ్‌ ముంబయిలో భేటీ అయ్యారు.

ఈ క్రమంలో బుధవారం..సాగర తీరంలో టీసీఎస్‌ ఏర్పాటు చేయనుందని ట్విట్టర్ వేదికగా ప్రకటించారు. టీసీఎస్ రాకతో విశాఖ ఐటీ హబ్గా మారనుందని.. ప్రఖ్యాత కంపెనీల పెట్టుబడుల గమ్యస్థానంగా ఏపీ మారుతుందని మంత్రి లోకేశ్ హర్షం వ్యక్తం చేశారు. ‘విశాఖపట్నంలో టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ లిమిటెడ్ 10,000 మంది ఉద్యోగులతో కూడిన ఐటీ క్యాంపస్‌ను అభివృద్ధి చేయడాన్ని నేను సంతోషిస్తున్నాను. ‘వ్యాపారం చేయడంలో వేగం’ అనే మా నినాదంతో నడిచే కార్పొరేట్‌లకు అత్యుత్తమ పెట్టుబడి వాతావరణాన్ని అందించడానికి మేము కట్టుబడి ఉన్నాం. ఆంధ్రప్రదేశ్‌‌‌ను వ్యాపారం చేయడానికి భారతదేశంలో నంబర్ 1 రాష్ట్రంగా చేయడానికి మేము కృషి చేస్తున్నందున TCS ద్వారా ఈ పెట్టుబడి ఒక ముఖ్యమైన మైలురాయి” అని లోకేశ్ రాసుకొచ్చారు.

Read Also : Negative Thoughts : నెగెటివ్ థాట్స్ మీకు సహాయం చేయవు.. ఈ 5 సాధారణ చిట్కాలను అనుసరించండి..!