TCS : విశాఖలో ప్రారంభానికి సిద్దమవుతున్న TCS

TCS : TCS వంటి అంతర్జాతీయ సంస్థల రాకతో విశాఖపట్నం ఐటీ హబ్‌గా మరింత బలపడుతుందని ప్రభుత్వం భావిస్తోంది. ఇది ఇతర ఐటీ కంపెనీలను కూడా విశాఖ వైపు ఆకర్షించే అవకాశం ఉంది

Published By: HashtagU Telugu Desk
Vizag Tcs Office

Vizag Tcs Office

ఆంధ్రప్రదేశ్ లో ఐటీ రంగం (IT Sector) విస్తరణలో భాగంగా విశాఖపట్నంలోని మధురవాడ ఐటీ సెజ్‌లో టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ (TCS) సంస్థ తన కార్యకలాపాలను ప్రారంభించేందుకు సిద్ధమవుతోంది. ఈ మేరకు ఏర్పాటు పనులు వేగవంతం అయ్యాయి. విశాఖపట్నం ఐటీ సెజ్ లోని హిల్ నంబర్ 3లోని మిలీనియం టవర్స్ లోని భవనంపై ఇప్పటికే TCS సంస్థ తమ నేమ్ బోర్డును కూడా ఏర్పాటు చేసింది. త్వరలోనే ఈ ప్రాంగణంలో కార్యకలాపాలు ప్రారంభం కానున్నట్లు సమాచారం. ఈ సంస్థ ఏర్పాటుతో విశాఖలో ఉద్యోగ అవకాశాలు మెరుగుపడతాయని నిరుద్యోగులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.

Bihar : బీహార్ లో బీజేపీ-కాంగ్రెస్ కార్యకర్తల మధ్య ఫైట్
ఈ కొత్త ప్రాజెక్ట్ కోసం TCS ఉద్యోగుల నియామక ప్రక్రియను కూడా ప్రారంభించినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం, మిలీనియం టవర్స్లోని B బ్లాక్ మొత్తం మరియు A బ్లాక్‌లోని 4, 5, 6, 7 అంతస్తులను TCS సంస్థకు కేటాయించారు. సంస్థకు శాశ్వత భవనం నిర్మాణం పూర్తయ్యే వరకు, ఈ తాత్కాలిక భవనం నుంచే TCS కార్యకలాపాలను నిర్వహించనుంది. విశాఖపట్నం ఐటీ రంగానికి ఇది ఒక మంచి పరిణామం అని ఐటీ నిపుణులు అభిప్రాయపడుతున్నారు.

TCS వంటి అంతర్జాతీయ సంస్థల రాకతో విశాఖపట్నం ఐటీ హబ్‌గా మరింత బలపడుతుందని ప్రభుత్వం భావిస్తోంది. ఇది ఇతర ఐటీ కంపెనీలను కూడా విశాఖ వైపు ఆకర్షించే అవకాశం ఉంది. ఈ ప్రాజెక్ట్ విజయవంతమైతే, స్థానిక యువతకు మెరుగైన ఉద్యోగ అవకాశాలు లభించడంతో పాటు, నగర ఆర్థికాభివృద్ధికి కూడా ఇది దోహదపడుతుంది. తద్వారా విశాఖపట్నం ఆంధ్రప్రదేశ్ లోని కీలక ఐటీ కేంద్రంగా మారే అవకాశం ఉంది.

  Last Updated: 29 Aug 2025, 01:39 PM IST